ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 22 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ఒకే గుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలు కలవు. ఇది ఒకప్పుడు త్రిమూర్తిగా పిలువబడేది. త్రిమూర్తి అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు . తదనంతర కాలంలో అదే తిరుమూర్తిగా ప్రాచుర్యం పొందింది. ఈ గుడికి సంబంధించిన ఒక కథ మనకు వినిపిస్తుంది.

           ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్రి మహర్షి, తన భార్య అనసూయతో కలిసి ఇక్కడ నివసించేవారు. ఒకనాడు నారదుడు అనసూయ యొక్క పాతివ్రత్యం గురించి బ్రహ్మ, విష్ణు మరియు ఈశ్వరుడి ధర్మపత్నులైన  సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి దగ్గర ప్రస్తావించాడు. దీనితో ఆ ముగ్గురు దేవతలు అసూయ చెందారు. ఎలాగైనా అనసూయ యొక్క పాతివ్రత్యం తగ్గించమని తమ భర్తలను  వేడుకుంటారు . ఒకనాడు అత్రి మహర్షి లేని సమయంలో త్రిమూర్తులు వెళ్లి అనసూయను భిక్ష అడుగుతారు. కాని వారు ఒక షరతు విధిస్తారు. అనసూయ వివస్త్రగా భిక్ష వేస్తేనే స్వీకరిస్తామని. దీనితో అనసూయకు ఏమి చేయాలో మొదట పాలుపోదు. తరవాత బాగా అలోచించి అనసూయ , మనసులో తన భర్తను తలచుకొని భిక్ష వేయడానికి సిద్ధమవుతుంది. అనసూయ పాతివ్రత్య ప్రభావం చేత త్రిమూర్తులు ముగ్గురు చిన్న పసిపాపలుగా మారిపోతారు. అప్పుడు వాళ్లకు పాలు పట్టి పడుకోబెడుతుంది. తన భర్త వచ్చిన తరవాత జరిగినదంతా చెబుతుంది. జరిగిన దానికి అత్రి మహర్షి చాలా సంతోషిస్తాడు. కొద్దిసేపటి తరవాత త్రిమూర్తులు మేలుకొని, అనసూయ పాతివ్రత్య మహిమను అభినందిస్తారు. ఏదైనా వరం కోరుకొమ్మని అనసూయను అడుగుతారు త్రిమూర్తులు. అనసూయ త్రిమూర్తులను తన బిడ్డలుగా జన్మించాలనే వరాన్ని కోరుకుంటుంది. అది ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర.

చూడవలసినవి: తిరుమూర్తి గుడి,  తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి జలపాతం
వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు.


Picture
తిరుమూర్తి టెంపుల్
Picture
గుడి ముందుగా ఉన్న కొలను
Picture
గుడి ముందు ఉన్న మండపం
Picture
గుడి ముందు ఉన్న ద్వజస్థంభం
 


Comments
Leave a Reply

  విహారయాత్రకు స్వాగతం. ఇందులోని పోస్టులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మీ మిత్రులతో వాటిని పంచుకోవాలంటే పేస్ బుక్ ఓపెన్ చేసినతరవాత సెర్చ్ ఐటమ్స్ లో "vihaarayaatra" అని టైప్ చేయండి. విహారయాత్ర యొక్క ఫేస్ బుక్ హోమ్ పేజి వస్తుంది. అక్కడ మీకు కావలసిన వాటిని షేర్ చేయండి. …….. మీ విహారయాత్ర

  నా గురించి

  నా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా  చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ ....   మీ బద్రి  


  Archives

  November 2013
  October 2013
  September 2013
  August 2013
  July 2013
  June 2013
  May 2013

  Categories

  All
  Andhra Pradesh
  Aquarium
  Church
  Dam
  Fort
  Garden
  Karnataka
  Kerala
  Lake
  Memorial
  Miscellaneous
  Mosque
  Mountain
  Museum
  Palace
  Park
  Rajasthan
  Tamilnadu
  Temple
  Travel News
  Uttarakhand
  Waterfall
  Zoo

  Enter your email address:

  Delivered by FeedBurner

  Picture
  ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.

  Picture
  పండ్ల ప్రదర్శన - 2013

  Picture
  Picture

  Picture

  Picture

  Picture

  Picture

  Picture

  Picture

  Picture

  Blaagulokam logo
  మొత్తం పేజీ వీక్షణలు
  vihaarayaatra.weebly.com