ఒక విధంగా చెప్పాలంటే కోయంబత్తూర్ నుండి కేరళ బార్డర్ పెద్ద దూరమేమి కాదు. కోయంబత్తూర్ నుండి ఒక ముప్పయి కిలోమీటర్లు ప్రయాణిస్తే కేరళ సరిహద్దు చేరుకోవచ్చు. శనివారం ఉదయం 7 గంటలకు ద్విచక్ర వాహనం మీద బయలుదేరాము. మేము బయలుదేరేటప్పుడు కోయంబత్తూర్ లో ఎండగా ఉంది. సిటి అవతలకి చేరగానే వాతావరణం మేఘావృతమై కనిపించింది. బండి మీద వెళుతుంటే మబ్బులు కూడా వాటి దారిలో అవి ప్రయాణిస్తున్నాయి. బండి ఒకసారి ఆపి వాటిని అలాగే చూస్తూ ఉండి పోయాము. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు మబ్బులు అలా వెళుతుంటే బయట నిలిబడి చూస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు భలే సరదాగా అనిపించేది. అక్కడి నుండి బయలుదేరి ముందుగా మధుక్కరై చేరుకున్నాము.
ధర్మ లింగేశ్వర స్వామి కోయిల్ , మదుక్కరై ఒక విధంగా చెప్పాలంటే కోయంబత్తూర్ నుండి కేరళ బార్డర్ పెద్ద దూరమేమి కాదు. కోయంబత్తూర్ నుండి ఒక ముప్పయి కిలోమీటర్లు ప్రయాణిస్తే కేరళ సరిహద్దు చేరుకోవచ్చు. శనివారం ఉదయం 7 గంటలకు ద్విచక్ర వాహనం మీద బయలుదేరాము. మేము బయలుదేరేటప్పుడు కోయంబత్తూర్ లో ఎండగా ఉంది. సిటి అవతలకి చేరగానే వాతావరణం మేఘావృతమై కనిపించింది. బండి మీద వెళుతుంటే మబ్బులు కూడా వాటి దారిలో అవి ప్రయాణిస్తున్నాయి. బండి ఒకసారి ఆపి వాటిని అలాగే చూస్తూ ఉండి పోయాము. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు మబ్బులు అలా వెళుతుంటే బయట నిలిబడి చూస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు భలే సరదాగా అనిపించేది. అక్కడి నుండి బయలుదేరి ముందుగా మధుక్కరై చేరుకున్నాము. అక్కడ ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ మధ్య భాగం నుండి పై భాగం వరకు మబ్బుల్లో ఉన్నట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుండి కింది నుండి మబ్బులను చూడడమే కాని మనల్ని మబ్బులు అలా తాకుతూ వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది. ఒక్కసారిగా అలాంటి అనుభూతి పొందాలని అనిపించింది. మళ్ళి అవకాశం వస్తుందో రాదో అని కొండ ఎక్కుదామని నిర్ణయించుకున్నాము. అక్కడికి వెళుతుంటే తెలిసిందేమిటి అంటే కొండ పైన శివుడి గుడి ఉందని. ఇక్కడి వాళ్ళు దానిని ధర్మలింగేశ్వర స్వామి కోయిల్ అంటారు. కొండ పైకి బండి వెళ్ళడానికి మార్గం లేకపోవడంతో, బండి కిందనే పార్క్ చేసి మెట్లు ఎక్కడం ప్రారంబించాము. మెట్లు ఎక్కుతుంటే కొంచెం పైన మబ్బులు అలా ఆ కొండని తాకుతూ వెళ్ళిపోతున్నాయి. కొన్ని నిమిషాల్లో మేము కూడా ఆ మబ్బుల్లో ఉంటామన్న ఆనందం మెట్లు ఎక్కడం వల్ల వచ్చే అలసటను మరిచిపోయేలా చేసింది. కొండ కింది నుండి చూసినప్పుడు కొండ మధ్య నుండి పై వరకూ మబ్బులు ఉన్నాయి కానీ కొండ మధ్యకి చేరుకున్నాక మబ్బులు మరీ పలుచగా ఉన్నాయేమో మాకు చల్లగా అనిపించింది కానీ మబ్బులు కనిపించలేదు. ఇంకొంచెం పైన మబ్బులు కనిపించాయి. మబ్బుల్ని ఎలాగానే తాకాలన్న ఉద్దేశముతో రెట్టించిన ఉత్సాహముతో కొండ పైవరకూ చేరుకున్నాము. మేము ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. మబ్బులు అలా మమ్మల్ని తగులుతుంటే ఏదో ఒక కొత్త అనుభూతికి లోనయ్యాము. పైన పెద్దగా భక్తులు లేరు. కొండ పైనుంచి కిందకి చూస్తే ఏమి కనిపించట్లేదు ఒక మబ్బులు తప్ప. అక్కడ ఉన్న ఆ చలి, ఆ గాలి అంతా కలిసి నన్ను మైమరచిపోయేలా చేసాయి. ఏదో ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. అలాగే కొద్దిసేపు అలా కూర్చుండిపోయాము. కొద్దిసేపటి తర్వాత ఆ తన్మయత్వంలో నుంచి తేరుకొని గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్నాము. అప్పటికే సమయం 10 గంటలు కావడంతో పాలక్కడ్ వెళ్ళాలని గుర్తుకు వచ్చి కొండ కిందకి దిగాము. కొండ కిందకి వచ్చాక, పైన ఉన్నంత చలిగా లేదు. పాలక్కడ్ కు బయలుదేరాము.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|