మదుక్కరై లోని ధర్మ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పాలక్కడ్ బయలుదేరాము. కొంచెం దూరం (10 కి. మీ) వెళ్ళగానే చిన్నగా వర్షం మొదలయ్యింది. అలాగే వర్షంలోనే వలయార్ చేరుకున్నాం. ఇది కేరళలో కలదు. ఇక్కడ ఆటవీశాక వారి చెక్ పోస్ట్ కలదు. దానికి దగ్గరలోనే డీర్ పార్క్ కలదు. మా ప్రయాణానికి మళ్లీ ఇక్కడ ఒక బ్రేక్. డీర్ పార్క్ లోనికి వెళ్ళాం. ప్రవేశ రుసుము ఒక్కరికి 5 రూపాయలు. ప్లాస్టిక్ వస్తువులు, పదార్దాలు మరియు డిజిటల్ కెమేరాలు అందులోకి అనుమతి లేదు. పార్క్ లోకి వెళ్ళే ముందు అక్కడ ఉండే ఉద్యోగి మాకు కొన్ని సూచనలు చేసాడు. అవి ఏమిటంటే ఒక గంటలోనే బయటకి రావాలని, లోపలికి వెళ్ళడానికి మరియు బయటికి రావడానికి ఒకటే మార్గం కలదని ( వెళ్ళిన దార్లోనే బయటికి రావాలని). మేము బయటి నుండి గేట్ గడి తీసి లోపలికి వెళ్లి లోపలినుండి గడి వేశాం. మామూలుగా పార్కులల్లో జంతువులను బోనులో ఉంచుతారు. మనము బోను బయటనుండి చూస్తాము. కాని ఇక్కడ ఒక చిన్న అడవి లాంటి ప్రదేశంలో వాటిని ఉంచారు. మనము ఆ అడవిలో నడుస్తూ జింకలను చూడొచ్చు అన్నమాట. ఇంతకు మునుపే వర్షం పడింది కాబోలు అవి ఎక్కడ ఉన్నాయో మొదట్లో కనిపించలేదు. చాలా దూరం నడిచాక ఒక జింక కనపడింది. ఇంకా లోపలికి వెళితే చాలా జింకలు కనిపించేవేమో కాని సమయాభావం వల్ల ఇక అక్కడినుండి తిరుగు ప్రయాణం. ఇంకా కొంచెం సేపట్లో మేము పార్క్ బయటికి వస్తాం అనేలోపు కొన్ని జింకలు అక్కడికి వచ్చాయి. కొద్ది సేపు వాటిని చూసి బయటికి వచ్చేసాం. పాలక్కడ్ కి బయలు దేరాం.
డీర్ పార్క్, వలయార్ , కేరళ

0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|