ఇక్కడికి వెళ్ళాలని అనుకునేవాళ్ళు ఉదయం 7 లోపు వెళితే బాగుంటుంది. ఇక్కడ ప్రకృతి చాలా ప్రశాంతంగా, పక్షుల కిల కిల రావాలతో మసను హాయి గొలుపుతుంది. ముత్యాలమడువు చేరుకున్నాక ట్రెక్కింగ్ చేయాలనుకునేవారు పక్కనే ఉన్న కొండ పైకి ట్రెక్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చేవారు తమవెంట నీళ్ళు , ఆహారపదార్ధాలు తెచ్చుకుంటే మంచిది.
చూడవలసినవి: ముత్యాలమడువు వాటర్ ఫాల్
వసతి : KSTDC వాళ్ళ రెస్టారెంట్ ఉంది. ముందుగా బుక్ చేసుకుంటే రూమ్స్ లభించవచ్చు.
అందుబాటు : ఇక్కడికి బస్సు సౌకర్యం లేదు. సొంత వాహనాల మీద లేదా క్యాబ్స్ బుక్ చేసుకొని రావచ్చు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/muthyalamaduvu.html