చూడవలసినవి: గాల్ట మందిరం , సూర్య దేవాలయం, విష్ణువు దేవాలయం
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కొండ కింది వరకు బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/galtaji.html
ఇది రాజస్థాన్, జైపూర్ లో కలదు. ఈ పురాతన హిందూ దేవాలయం జైపూర్ లోని కొండల నడుమ ఉన్నది. ఇది జైపూర్ లోని ఓల్డ్ సిటీకి దగ్గరలో కలదు. కొండ ఎక్కుతుంటూనే మనకు చాలా కోతులు దర్శనమిస్తాయి. దీనినే ఇక్కకడి ప్రజలు కోతుల దేవాలయం అని కూడా పిలుస్తారు. ముందుగా కొండ ఎక్కిన తరవాత మళ్లీ కిందికి దిగాలి. అక్కడనుండి అసలైన ప్రయాణం మొదలవుతుంది. ప్రశాంతమైన వాతావరణం , చుట్టూ కొండలు మనల్ని పరవశింపజేస్తాయి. మొదటగా ఆంజనేయస్వామి దేవాలయం వస్తుంది. కొంచెం ముందుగా వెళితే గాల్త దేవాలయం వస్తుంది. దీని ముందు ఒక గుండం ఉంది. ఇక్కడ కోతులు ఈత కొడుతుంటే చూడటానికి భలే ముచ్చటేస్తుంది. ఇంకొంచెం ముందుగా వెళితే గోవు నోరు ఆకారం లో నుండి సన్నని నీళ్ళ ధారా కింద ఉన్న కొలనులో పడుతుంది. భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు. ఇంకా కొంచెం కిందిగా వెళితే విష్ణువు దేవాలయం ఉంది.ఇక్కడికి రావాలనుకునేవారు నీళ్ళు, ఆహారం వెంట తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తినుభండారాలు లభ్యం కావు.
చూడవలసినవి: గాల్ట మందిరం , సూర్య దేవాలయం, విష్ణువు దేవాలయం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కొండ కింది వరకు బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/galtaji.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|