చూడవలసినవి: మరుదమలై గుడి, పామ్ బట్టి సిద్ధార్ గుహ
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు .
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/maruthamalai-temple.html
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణం నుండి 15 కి. మీ దూరంలో కలదు. ఇక్కడి ప్రధాన దైవం సుబ్రమణ్యస్వామి. మరుదమలై చేరుకున్నాక కొండ పైకి వెళ్ళడానికి రెండు మార్గాలు కలవు. ఒకటి రోడ్డు మార్గం మరియు రెండవది మెట్ల ద్వారా. మెట్ల ద్వారా వెళ్లాలనుకునే భక్తులు సుమారుగా 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. తమిళంలో మరుద అనేది చెట్టు మరియు మలై అంటే కొండ . ఇక్కడ ఉన్న కొండ ఎక్కువగా మరుద చెట్లతో ఉండడంవల్ల దీనికి మరుదమలై అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉండే సుబ్రమణ్యస్వామికి మరుదజలాపతి అనే పేరు కలదు. ఇక్కడ చూడవలసినది మరొకటి కూడా కలదు. అదే పామ్ బట్టి సిద్ధార్ గుహ. ఇది మరుదమలై గుడికి ఆగ్నేయ దిశగా కొంచెం కిందికి వెళితే వస్తుంది. ఈ గుహలోనే ఒక పాము సుబ్రమణ్యస్వామిని పూజిస్తూ, ధ్యానం చేస్తూ సిద్ధిని పొందిందని ఇక్కడి వారి విశ్వాసం. ఇక్కడ ఉన్న ఒక రాతి మీద పాము ఆకారం మనం చూడవచ్చు.
చూడవలసినవి: మరుదమలై గుడి, పామ్ బట్టి సిద్ధార్ గుహ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/maruthamalai-temple.html
2 Comments
siddu
6/21/2013 05:06:17 am
very nice
Reply
vihaarayaatra
6/21/2013 02:06:09 pm
Thanks for your feedback siddu.
Reply
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|