చూడవలసినవి: రాజాజీ మెమోరియల్
వసతి : హొసూరు లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : హొసూరు నుండి ఒన్నల్ వాడికి బస్సులు కలవు .
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/thorapalli.html
ఇది తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లాలో కలదు. ఇది హొసూరు నుండి 10 కి.మీ దూరంలో ఒన్నల్ వాడికి సమీపంలో, తోరపల్లి గ్రామంలో కలదు. ఇది చక్రవర్తి రాజాజీ పుట్టిన ఇల్లు. రాజాజీ అంటే రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. రాజాజీ గారు వకీలుగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయనాయకుడిగా, రచయితగా మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కూడా పనిచేసారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి మఖ్యమంత్రిగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పనిచేసారు. రాజాజీ గారు స్వాతంత్ర పార్టీ అనే దానిని స్థాపించారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందుకున్నవారిలో ప్రథముడు. రాజాజీగారు పుట్టిన ఇల్లును తమిళనాడు ప్రభుత్వంవారు రాజాజీ మెమోరియల్ గా మార్చారు. ఇందులో రాజాజీ గారి జీవత కాలంలో వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు ఉన్నాయి. ఈ ఇంటిలో రాజాజీ గారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనం చూడొచ్చు.
చూడవలసినవి: రాజాజీ మెమోరియల్ వసతి : హొసూరు లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : హొసూరు నుండి ఒన్నల్ వాడికి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/thorapalli.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
![]() ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
![]() పండ్ల ప్రదర్శన - 2013
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() మొత్తం పేజీ వీక్షణలు
|