చూడవలసినవి: పెరూర్ పట్టీశ్వరర్ ఆలయం, ఎచనారి వినాయగర్ ఆలయం
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సులు కలవు .
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/perur.html
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణానికి పశ్చిమాన 7 కి.మీ దూరంలో కలదు. దీనినే మేల్ చిదంబరం అని కూడా అంటారు. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఇక్కడి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని జనన మరణ కాల చక్రం నుండి శివుడు విముక్తి కలిగిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం నొయ్యల్ నదికి దగ్గరలో కలదు. ఈ ఆలయాన్ని కరికాల చోరన్ అనే రాజు నిర్మించాడు. ఈ ఆలయానికి ముందర ఒక చిన్న కొలను లాంటిది కలదు. దానిని తెప్పకులం అని పిలుస్తారు. ఈ తెప్పకులం 16 కోణాలు మరియు 8 మూలలతో ఉంది. ఇది 15 వ శతాబ్దంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినది.
చూడవలసినవి: పెరూర్ పట్టీశ్వరర్ ఆలయం, ఎచనారి వినాయగర్ ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/perur.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|