చూడవలసినవి: సరస్వతి మహల్, తంజావూర్ ప్యాలెస్ మ్యూజియం
వసతి : తంజావూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : తంజావూర్ లో లోకల్ బస్సులు కలవు.
ఇది తమిళనాడు, తంజావూరులో కలదు. ఇందులో ఎంతో పురాతన కాలంనాటి తాళపత్ర గ్రంథాలున్నాయి. పురాతన కాలం నాటి ఆయుధాలు , కిరీటాలు , కృపాణాలు లాంటివి ఎన్నో భద్రం చేయబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యిదో విజ్ఞాన భాండాగారం. సంస్కృత గ్రంథాలు అనేకం గల ఇక్కడి సంగీత మహల్లో రాతి స్తంభాలు సరిగమ పదనిసలు తాకగానే వినిపిస్తాయి. 30 వేల వ్రాత ప్రతులు గల ఈ సరస్వతి మహల్ గ్రంథాలయంలో భారతీయ, యూరోపియన్ల భాషలకు సంబంధించిన ఆముద్రిత గ్రంథాలు వున్నాయి.
చూడవలసినవి: సరస్వతి మహల్, తంజావూర్ ప్యాలెస్ మ్యూజియం వసతి : తంజావూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : తంజావూర్ లో లోకల్ బస్సులు కలవు.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|