ఈ గుడికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. పూర్వం ఈ ప్రాంతాన్ని నానన్ అనే రాజు పరిపాలించేవాడు. అలియార్ నది ఒడ్డున పంటపొలాల దగ్గర ఒక ప్రత్యేకమైన మామిడి చెట్టు కలదు. ఆ మామిడి చెట్టన్నా, దాని పండ్లన్నా రాజు గారికి చాలా ఇష్టం. రాజు గారి ఆజ్ఞ ప్రకారం ఆ చెట్టు ఆకులను కానీ, పండ్లను కానీ ఎవరు ఉపయోగించడానికి వీల్లేదు. ఒక రోజు కొంత మంది అమ్మాయిలు నది ఒడ్డున స్నానం చేస్తూ నీటిలో తేలియాడుతున్న మామిడిపండును చూసారు. అది రాజు గారి చెట్టుకు సంబంధించిన మామిడి పండు. అందులో ఒక అమ్మాయి ఆ మామిడి పండును తిన్నది. ఇది రాజు గారికి తెలిసి ఆ అమ్మాయికి మరణ దండన విధించాడు. కొద్ది రోజుల తర్వాత అక్కడ నివసించేవారు పడుకొని ఉన్న ఒక అమ్మాయి విగ్రహాన్ని తయారు చేయించి , ఆ అమ్మాయికి గుర్తుగా పూజించడం ప్రారంభించారు. తరవాత కాల క్రమంలో ఆమె మాసానిగా ప్రసిద్ధి చెందిది. కొద్ది రోజుల తర్వాత కోరిన్ ఖోసర్గల్ అనే రాజు నానన్ ని ఓడించి, ఆ చెట్టును ధ్వంసం చేసాడు.
చూడవలసినవి: మాసాని అమ్మన్ తిరుకోయిల్ , అలియార్ నది
వసతి : కోయంబత్తూర్ మరియు పొల్లాచి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు.