స్వామి వివేకానంద తనకు కాళికాదేవిపైన భక్తి ప్రేరణతో తపస్సు చేయుటకు కన్యాకుమారి ఒడ్డుకు చేరినాడు. సముద్రంపై అక్కడ ఉన్న రాయిని చేరాడు. అక్కడ మూడు రాత్రుళ్లు, మూడు పగళ్ళు ధ్యానంలో కూర్చొనినాడు. అక్కడ ఉన్న శ్రీ పాదశిల క్రమముగా వివేకానంద శిలగా మారింది. వివేకానంద మండపము ప్రధాన ద్వారములకు రెండు ప్రక్కలా నల్లరాతి ఏనుగులు, దూలములపై సాంప్రదాయక చిహ్నమైన గజపూర్ణ కుంభం చెక్కినారు. మండపములోని గదులలో శ్రీ రామకృష్ణ పరమహంస , శ్రీ శారదాదేవి యొక్క సజీవం అనిపించే చిత్ర పటములు కలవు. ధ్యాన మందిరంలో ఓం గుర్తును ప్రణవ పీఠంపై ప్రతిష్టించబడినది. ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రకృతి అందాలను చూసి ఆనందించవలసిందే కాని వర్ణించరానిది.
చూడవలసినవి: వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కన్యాకుమారి నుండి ఫెర్రీ సౌకర్యం కలదు.