చూడవలసినవి: గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. దీనిని 1956 లో జాతిపిత అయిన మహాత్మాగాంధి జ్ఞాపకార్ధంగా దీనిని నిర్మించారు. మహాత్మాగాంధి అస్తికలను కన్యాకుమారిలోని త్రివేణి సంగమంలో కలిపే ముందు ప్రజల సందర్శనార్ధం ఇక్కడ ఉంచారు. మహాత్మాగాంధి 1925 లో మరియు 1937 లో, రెండు సార్లు కన్యాకుమరిని దర్శించారు. 1948 లో గాంధిజీ అస్తికలను కన్యాకుమారిలోని సముద్రజలాలో కలిపారు. దానికి గుర్తుగా ఇక్కడ మహాత్మాగాంధి మెమోరియల్ నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణపు ఆకారం యొక్క పైకప్పు 78 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఇది (79) గాంధీజీ యొక్క వయసును (చనిపోయేనాటికి) సూచిస్తుంది. ఇందులో గాంధీజీ జీవితంలోని వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు కలవు. ప్రవేశ సమయము ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు. ప్రవేశం ఉచితం.
చూడవలసినవి: గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|