చూడవలసినవి: నాగరాజ గుడి
వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : నాగర్ కోయిల్ నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ పట్టణము నందు కలదు. నాగర్ కోయిల్ అనే పేరు ఈ నాగరాజ గుడి మూలంగానే వచ్చిందని చెపుతారు. ఈ గుడి ముందు ఒక చిన్న కొలను లాంటిది కలదు. కొలనులో భక్తులు స్నానం చేసి నాగరాజ స్వామిని దర్శిస్తారు. కొలను పక్కగా ఒక దిమ్మె మీద చాలా నాగరాజ విగ్రహాలు కలవు. భక్తులు పసుపు మరియు పాలతో వీటిని అభిషేకిస్తారు. ఈ గుడిలో మనకు ఎక్కడ చూసినా నాగరాజ ప్రతిమలే కనిపిస్తాయి. ఈ గుడిలో ఇద్దరు ప్రధాన దైవాలు. ఆనంద కృష్ణ మరియు నాగరాజ. నాగరాజ గర్భాలయంలో వూరు నీటి వూటలోని నీటిని తీర్ధముగా ఇస్తారు. ఈ నీటి వూటలోని ఇసుక సంవత్సరములో సగభాగం తెల్లగాను మరియు మిగిలిన సగభాగం నల్లగాను ఉంటుంది.
చూడవలసినవి: నాగరాజ గుడి వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నాగర్ కోయిల్ నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|