చూడవలసినవి: కోదండ రామస్వామి ఆలయం
వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : రామేశ్వరం నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, రామంతాపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరం నుండి 10 కి. మీ దూరంలో కలదు. శ్రీ రామచంద్రుడిని విభీషణుడు శరణు వేడింది ఇక్కడనే. అదియునుగాక, విభీషణుని తాత్కాలిక పట్టాభిషేకము కూడా లక్ష్మణునిచె ఇక్కడనే జరిగినది. రామేశ్వరము నందలి రామలింగ ప్రతిష్టాపన ఉత్సవము రోజున ఉత్సవరులను కేడియం (మనుష్యులు బారుకొయ్యలతో మోయుట) నందు నిలిపి , రామేశ్వరం నుండి ఇచ్చటికి ఉత్సవముతో వచ్చుదురు. రావణ వధానంతరము విభీషణుని పట్టాభిషేకము జరిగి, మరునాడు రామలింగ ప్రతిష్టాపన మహోత్సవము రామేశ్వరము నందు జరుపబడును.
చూడవలసినవి: కోదండ రామస్వామి ఆలయం వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : రామేశ్వరం నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|