ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 30 కి.మీ దూరంలో కలదు. మొదటగా పూండి చేరుకోవాలి. అక్కడ ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాక, వెల్లియంగిరి కొండల మీద ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడికి అన్ని సమయాలలో అనుమతి లేదు. కేవలం చైత్రమాసంలో (ఉగాది నుండి ఒక నెల రోజుల వరకు) మాత్రమే అనుమతిస్తారు. మొతం ఏడు కొండలు కలవు. ఏడు కొండల తరవాత శివాలయం వస్తుంది. వెళ్ళడం కొంచెం కష్టమే. చాలా మంది భక్తులు రాత్రివేళ బయలుదేరి, దర్శనం చేసుకొని ఉదయం వరకల్లా కిందికి చేరుకుంటారు. ఎందుకంటే రాత్రి వేళలో వాతావరణం చల్లగా ఉండడం వలన మనకు అంతగా బడలికగా అనిపించదు. ఒకవేళ ఉదయం బయలు దేరినట్లయితే, ప్రయాణం మద్యాహ్నం చేయాల్సి ఉంటుంది, అందులోనూ చాలా వేడిగా ఉండడం వలన, భక్తులు రాత్రివేళల్లో బయలుదేరుతారు. కొండలపైకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఒక వెదురు కర్ర లాంటిది తీసుకెళతారు. ఎందుకంటే కొండలు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ కర్ర సహాయం చాలా అవసరం. భక్తులు శివుడి దర్శనం తరవాత, కిందికి వచ్చాక ఆ కర్రని ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తారు.
చూడవలసినవి: శివాలయం, కొండ కింద గల శివాలయం, ధ్యాన లింగ
వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు.