పదండి ప్రపంచాన్ని చుట్టేద్దాం.............
  • పర్యాటక ప్రదేశాలు
  • నేను
  • యాత్రా వార్తలు
  • తెలుగు తరుణి

స్నేక్ పార్క్, పాలక్కడ్

6/13/2013

1 Comment

 
ఇది కేరళ, పాలక్కడ్ జిల్లాలో  కలదు. ఇది మలంపుర గార్డెన్ పక్కనే కలదు. ఇందులో చాలా రకాల పాములు కలవు . అందులో బ్లాక్ కోబ్రా, వైట్ కోబ్రా , ర్యాట్ స్నేక్, ఇండియన్ రాక్ పైథాన్ , ఫారెస్ట్ క్యాట్ స్నేక్, గోల్డెన్ ట్రీ స్నేక్, వోల్ఫ్ స్నేక్, డాగ్ ఫేస్ డ్ వాటర్ స్నేక్ మొదలగునవి.


చూడవలసినవి: మలంపుర డ్యాం మరియు  గార్డెన్ ,  రాక్ గార్డెన్ మరియు అక్వేరియం
వసతి :  పాలక్కడ్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పాలక్కడ్ నుండి  బస్సు సౌకర్యం కలదు.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :

http://letustravel.weebly.com/snake-park.html




Picture
1 Comment

కోయంబత్తూర్ నుండి పాలక్కడ్ వరకు - V 

6/12/2013

0 Comments

 
మలంపురా డ్యాం మరియు గార్డెన్

జైనిమేడు తరవాత మలంపురా డ్యాం దగ్గరకు చేరుకున్నాం. ముందుగా రోప్ వేకి టికెట్స్ తీసుకున్నాం. రోప్ వే మీదినుంచి మలంపురా డ్యాం మరియు గార్డెన్ మొత్తం కనిపిస్తుంది. రోప్ వే మీద వెళ్తుంటే గాలిలో తేలుతున్నట్లు అనిపించిది. రోప్ వే మీద మొత్తంగా ఒక పదిహేను నిమిషాలు ఉంటాము. కిందికి వచ్చిన తరవాత గార్డెన్ లోకి వెళ్ళాము. ఇక్కడ ఉన్న గార్డెన్ చాలా పెద్దది. అలా నడుస్తూ డ్యాం మీదికి చేరుకున్నాం. అక్కడనుండి వెనక ఉన్న కొండలు మరియు నీళ్ళను చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపించింది. కాని దగ్గరలో చూడదగ్గ ప్రదేశాలు ఉండడంతో బయటికి వచ్చాము. పక్కనే ఉన్న అక్వేరియం , స్నేక్ పార్క్ మరియు  రాక్ గార్డెన్ చూసి కోయంబత్తూర్ బయలుదేరాం. 

                                                                                                                                                  (సశేషం)



Picture
రోప్ వే మీద
Picture
మలంపురా డ్యాం
Picture
మలంపురా గార్డెన్
Picture
మలంపురా గార్డెన్ లోని బ్రిడ్జ్
Picture
డ్యాం వెనకాల పనోరమ వ్యూ
0 Comments

కోయంబత్తూర్ నుండి పాలక్కడ్ వరకు - IV

6/11/2013

0 Comments

 
జైనిమేడు

పాలక్కడ్ కోట చూసిన తరవాత జైనిమేడుకు బయలుదేరాం. ఇది రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే కలదు. ఇక్కడ దిగంబర జైన్ మందిర్ కలదు. ఈ గుడి చుట్టు ప్రక్కల ప్రదేశాన్ని అంతటినీ కలిపి జైనిమేడు అంటారు. జైన్ మందిర్ వెళ్ళడానికి ముందు నేను కొంచెం ఎక్కువగా ఊహించుకున్ననేమో , జైనిమేడు కు వెళ్ళాక కొంచెం నిరుత్సాహపడ్డాను ఎందుకంటే మామూలుగా జైన్ దేవాలయాలు చాలా మటుకు గొప్ప శిల్ప కళా చాతుర్యాన్ని కలిగి ఉంటాయి. కాని ఇక్కడ జైన్ మందిర్ మామూలుగా ఉంది. మేము వెళ్ళేసరికే జైన్ మందిర్ మూసివేయబడింది. ఇంకా అక్కడినుండి మలంపురా డ్యాం మరియు గార్డెన్ కి బయలుదేరాం.
Picture
Picture
0 Comments

కోయంబత్తూర్ నుండి పాలక్కడ్ వరకు - III

6/11/2013

0 Comments

 
పాలక్కడ్ కోట

వలయార్ లోని డీర్ పార్క్ చూసిన తరవాత పాలక్కడ్ బయలుదేరాం. ముందుగా పాలక్కడ్ కోటకు చేరుకున్నాం. అప్పటికే మద్యాహ్నం 12 అయ్యింది. కోటలోనికి ప్రవేశ రుసుము లేదు. కోట చుట్టూ కందకం కలదు. ఒక చిన్న బ్రిడ్జ్ మీదుగా కోట లోనికి వెళ్ళాము. కోట ద్వారం ముందు కోటకు సంబంధించిన సమాచారం ఒక బోర్డుపై కలదు. లోనికి వెళ్ళగానే ముందుగా ఆంజనేయస్వామి గుడి వస్తుంది. గుడి చిన్నదే. కోట లోపల పెద్ద పెద్ద చెట్లు కలవు. ఇక్కడ మొత్తం చూడటానికి ఒక గంట కంటె ఎక్కువ సమయమేమి పట్టదు. తరవాత పాలక్కడ్ లోని జైనిమేడుకు బయలుదేరాం.

Picture
పాలక్కడ్ కోట
Picture
కోటలోకి వెళ్ళే మార్గం (ఈ బ్రిడ్జ్ ద్వారా మాత్రమే కోటలోకి ప్రవేశించగలము)
Picture
ఆంజనేయస్వామి దేవాలయం ముఖద్వారం
Picture
కోట లోపల
0 Comments

కోయంబత్తూర్ నుండి పాలక్కడ్ వరకు - II

6/9/2013

0 Comments

 
డీర్ పార్క్, వలయార్ , కేరళ

మదుక్కరై లోని ధర్మ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పాలక్కడ్ బయలుదేరాము. కొంచెం దూరం (10 కి. మీ) వెళ్ళగానే చిన్నగా వర్షం మొదలయ్యింది. అలాగే వర్షంలోనే వలయార్ చేరుకున్నాం. ఇది కేరళలో కలదు. ఇక్కడ ఆటవీశాక వారి చెక్ పోస్ట్ కలదు. దానికి దగ్గరలోనే డీర్ పార్క్ కలదు. మా ప్రయాణానికి మళ్లీ ఇక్కడ ఒక బ్రేక్. డీర్ పార్క్ లోనికి వెళ్ళాం. ప్రవేశ రుసుము ఒక్కరికి 5 రూపాయలు. ప్లాస్టిక్ వస్తువులు, పదార్దాలు మరియు డిజిటల్ కెమేరాలు అందులోకి  అనుమతి లేదు. పార్క్ లోకి వెళ్ళే ముందు అక్కడ ఉండే ఉద్యోగి మాకు కొన్ని సూచనలు చేసాడు. అవి ఏమిటంటే ఒక గంటలోనే బయటకి రావాలని, లోపలికి వెళ్ళడానికి మరియు బయటికి రావడానికి ఒకటే మార్గం కలదని ( వెళ్ళిన దార్లోనే బయటికి రావాలని). మేము బయటి నుండి గేట్ గడి తీసి లోపలికి  వెళ్లి లోపలినుండి గడి వేశాం. మామూలుగా పార్కులల్లో జంతువులను బోనులో ఉంచుతారు. మనము బోను బయటనుండి చూస్తాము. కాని ఇక్కడ ఒక చిన్న అడవి లాంటి ప్రదేశంలో వాటిని ఉంచారు. మనము ఆ అడవిలో నడుస్తూ జింకలను చూడొచ్చు అన్నమాట. ఇంతకు మునుపే వర్షం పడింది కాబోలు అవి ఎక్కడ ఉన్నాయో మొదట్లో కనిపించలేదు. చాలా దూరం నడిచాక ఒక జింక కనపడింది. ఇంకా లోపలికి వెళితే చాలా జింకలు కనిపించేవేమో కాని సమయాభావం వల్ల ఇక అక్కడినుండి తిరుగు ప్రయాణం. ఇంకా కొంచెం సేపట్లో మేము పార్క్ బయటికి వస్తాం అనేలోపు కొన్ని జింకలు అక్కడికి వచ్చాయి. కొద్ది సేపు వాటిని చూసి బయటికి వచ్చేసాం. పాలక్కడ్ కి బయలు దేరాం.

Picture
Picture
Plastic free area
Picture
Picture
Picture
0 Comments

కోయంబత్తూర్ నుండి పాలక్కడ్ వరకు - I 

6/7/2013

0 Comments

 
ధర్మ లింగేశ్వర స్వామి కోయిల్ , మదుక్కరై
ఒక విధంగా చెప్పాలంటే కోయంబత్తూర్ నుండి కేరళ బార్డర్ పెద్ద దూరమేమి కాదు. కోయంబత్తూర్ నుండి ఒక ముప్పయి కిలోమీటర్లు ప్రయాణిస్తే కేరళ సరిహద్దు చేరుకోవచ్చు. శనివారం ఉదయం 7 గంటలకు ద్విచక్ర వాహనం మీద బయలుదేరాము. మేము బయలుదేరేటప్పుడు కోయంబత్తూర్ లో ఎండగా ఉంది. సిటి అవతలకి చేరగానే వాతావరణం మేఘావృతమై కనిపించింది. బండి మీద వెళుతుంటే మబ్బులు కూడా వాటి దారిలో అవి ప్రయాణిస్తున్నాయి. బండి ఒకసారి ఆపి వాటిని అలాగే చూస్తూ ఉండి పోయాము. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు మబ్బులు అలా వెళుతుంటే బయట నిలిబడి చూస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు భలే సరదాగా అనిపించేది. అక్కడి నుండి బయలుదేరి ముందుగా మధుక్కరై చేరుకున్నాము.
Picture
మామూలు రోజులలో తీసిన ఫోటో ఇది
అక్కడ ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ మధ్య భాగం నుండి పై భాగం వరకు మబ్బుల్లో ఉన్నట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుండి కింది నుండి మబ్బులను చూడడమే కాని మనల్ని మబ్బులు అలా తాకుతూ వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది. ఒక్కసారిగా అలాంటి అనుభూతి పొందాలని అనిపించింది. మళ్ళి అవకాశం వస్తుందో రాదో అని కొండ ఎక్కుదామని నిర్ణయించుకున్నాము. అక్కడికి వెళుతుంటే తెలిసిందేమిటి అంటే కొండ పైన శివుడి గుడి ఉందని. ఇక్కడి వాళ్ళు దానిని ధర్మలింగేశ్వర స్వామి కోయిల్ అంటారు. కొండ పైకి బండి వెళ్ళడానికి మార్గం లేకపోవడంతో, బండి కిందనే పార్క్ చేసి మెట్లు ఎక్కడం ప్రారంబించాము.
Picture
కొండ మధ్య బాగం నుండి
మెట్లు ఎక్కుతుంటే కొంచెం పైన మబ్బులు అలా ఆ కొండని తాకుతూ వెళ్ళిపోతున్నాయి. కొన్ని నిమిషాల్లో మేము కూడా ఆ మబ్బుల్లో ఉంటామన్న ఆనందం మెట్లు ఎక్కడం వల్ల వచ్చే అలసటను మరిచిపోయేలా చేసింది. కొండ కింది నుండి చూసినప్పుడు కొండ మధ్య నుండి పై వరకూ మబ్బులు ఉన్నాయి కానీ కొండ మధ్యకి చేరుకున్నాక మబ్బులు మరీ పలుచగా ఉన్నాయేమో మాకు చల్లగా అనిపించింది కానీ మబ్బులు కనిపించలేదు. ఇంకొంచెం పైన మబ్బులు కనిపించాయి. మబ్బుల్ని ఎలాగానే తాకాలన్న ఉద్దేశముతో రెట్టించిన ఉత్సాహముతో కొండ పైవరకూ చేరుకున్నాము.
Picture
కొండ పైనుండి
మేము ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. మబ్బులు అలా మమ్మల్ని తగులుతుంటే ఏదో ఒక కొత్త అనుభూతికి లోనయ్యాము. పైన పెద్దగా భక్తులు లేరు. కొండ పైనుంచి కిందకి చూస్తే ఏమి కనిపించట్లేదు ఒక మబ్బులు తప్ప. అక్కడ ఉన్న ఆ చలి, ఆ గాలి అంతా కలిసి నన్ను మైమరచిపోయేలా  చేసాయి. ఏదో ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది.
Picture
మబ్బుల లోకంలో
అలాగే కొద్దిసేపు అలా కూర్చుండిపోయాము. కొద్దిసేపటి తర్వాత ఆ తన్మయత్వంలో నుంచి తేరుకొని గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్నాము. అప్పటికే సమయం 10 గంటలు కావడంతో పాలక్కడ్ వెళ్ళాలని గుర్తుకు వచ్చి కొండ కిందకి దిగాము. కొండ కిందకి వచ్చాక, పైన ఉన్నంత చలిగా లేదు. పాలక్కడ్ కు బయలుదేరాము.
Picture
మబ్బుల లోకంలో నేను
0 Comments

అక్వేరియం, పాలక్కడ్

6/6/2013

0 Comments

 
Picture
ఇది కేరళ, పాలక్కడ్ జిల్లాలో  కలదు. ఇది మలంపుర గార్డెన్ పక్కనే కలదు. దీనిని ఒక చేప నీళ్ళల్లో ఉన్నట్టుగా నిర్మించారు. అందులోని అక్వేరియంలో గ్రీన్ టెర్రర్ , టైగర్ ఆస్కార్ , టైగర్ షార్క్ , గోల్డ్ ఫిష్ , స్వార్డ్ టైల్ మొదలైన వివిధ రకాల చేపలు కలవు.


చూడవలసినవి: మలంపుర డ్యాం మరియు  గార్డెన్ , స్నేక్ పార్క్, రాక్ గార్డెన్
వసతి :  పాలక్కడ్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పాలక్కడ్ నుండి  బస్సు సౌకర్యం కలదు.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/aquarium.html




0 Comments

గాల్తాజీ మందిర్ , జైపూర్

6/5/2013

0 Comments

 
Picture
విష్ణువు దేవాలయం
ఇది రాజస్థాన్, జైపూర్ లో కలదు. ఈ పురాతన హిందూ దేవాలయం జైపూర్ లోని కొండల నడుమ ఉన్నది. ఇది జైపూర్ లోని ఓల్డ్ సిటీకి దగ్గరలో కలదు.  కొండ ఎక్కుతుంటూనే మనకు చాలా కోతులు దర్శనమిస్తాయి. దీనినే ఇక్కకడి ప్రజలు కోతుల దేవాలయం అని కూడా పిలుస్తారు. ముందుగా కొండ ఎక్కిన తరవాత మళ్లీ కిందికి దిగాలి. అక్కడనుండి అసలైన ప్రయాణం మొదలవుతుంది. ప్రశాంతమైన వాతావరణం , చుట్టూ కొండలు మనల్ని పరవశింపజేస్తాయి. మొదటగా ఆంజనేయస్వామి దేవాలయం వస్తుంది. కొంచెం ముందుగా వెళితే గాల్త దేవాలయం వస్తుంది. దీని ముందు ఒక గుండం ఉంది. ఇక్కడ కోతులు ఈత కొడుతుంటే చూడటానికి భలే ముచ్చటేస్తుంది. ఇంకొంచెం ముందుగా వెళితే గోవు నోరు ఆకారం లో నుండి సన్నని నీళ్ళ ధారా కింద ఉన్న కొలనులో పడుతుంది. భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు. ఇంకా కొంచెం కిందిగా వెళితే విష్ణువు దేవాలయం ఉంది.ఇక్కడికి రావాలనుకునేవారు నీళ్ళు, ఆహారం వెంట తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తినుభండారాలు లభ్యం కావు.

చూడవలసినవి: గాల్ట మందిరం , సూర్య దేవాలయం, విష్ణువు దేవాలయం
వసతి :  జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు :  కొండ కింది వరకు బస్సు సౌకర్యం కలదు.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/galtaji.html

0 Comments

రాక్ గార్డెన్ , పాలక్కడ్

6/4/2013

0 Comments

 
Picture
ఇది కేరళ, పాలక్కడ్ జిల్లాలో  కలదు. ఇది మలంపుర గార్డెన్ నుండి 2 కి.మీ దూరంలో కలదు. దక్షిణ భారత దేశంలోనే ఇలాంటిది మొదటిది. దీనియొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఉపయోగించిన వస్తువులు అన్నీ మనం మన ఇంట్లో వాడి,  తీసిపడేసిన వస్తువులే. ఉదాహరణకు పగిలిన  గాజులు, గాజుపలకలు , ప్లాస్టిక్ డబ్బాలు మరియు ఇతర పింగాణి వస్తువులు.


చూడవలసినవి: మలంపుర డ్యాం మరియు  గార్డెన్ , స్నేక్ పార్క్,అక్వేరియం
వసతి :  పాలక్కడ్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పాలక్కడ్ నుండి  బస్సు సౌకర్యం కలదు.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/rock-garden.html



0 Comments

నాగార్జునసాగర్ డ్యాం 

6/3/2013

0 Comments

 
Picture
ఇది నల్లగొండ జిల్లాలో కలదు.  హైదరాబాద్ నుండి 150 కి.మీ దూరంలో ఉన్నది. పూర్వం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి పట్టణంలో కలసి ఉండేది. .  ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అతి విశాలమైన నాగార్జునసాగర్ డ్యాంను చూసి భావుకత్వంతో  "ఆధునిక దేవాలయంగా" అభివర్ణించాడు. ఈ జలాశయం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకొని పరవళ్ళు త్రొక్కుతూ ఉంది. వర్షాకాలంలో కృష్ణవేణమ్మ మరింతగా ఉప్పొంగి పొరలుతుంది.

చూడవలసినవి: డ్యాం, నాగార్జున కొండ
వసతి :   నాగార్జునసాగర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/nagarjuna-sagar.html
0 Comments
<<Previous
Forward>>

    విహారయాత్రకు స్వాగతం. ఇందులోని పోస్టులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మీ మిత్రులతో వాటిని పంచుకోవాలంటే పేస్ బుక్ ఓపెన్ చేసినతరవాత సెర్చ్ ఐటమ్స్ లో "vihaarayaatra" అని టైప్ చేయండి. విహారయాత్ర యొక్క ఫేస్ బుక్ హోమ్ పేజి వస్తుంది. అక్కడ మీకు కావలసిన వాటిని షేర్ చేయండి. …….. మీ విహారయాత్ర

    నా గురించి

    నా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా  చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ ....   మీ బద్రి  


    vihaarayaatra.weebly.com

    Promote Your Page Too
    Foreign Languages Institute

    Promote Your Page Too
    Telugutaruni

    Promote Your Page Too
    letustravel.weebly.com

    Promote Your Page Too

    Archives

    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    Andhra Pradesh
    Aquarium
    Church
    Dam
    Fort
    Garden
    Karnataka
    Kerala
    Lake
    Memorial
    Miscellaneous
    Mosque
    Mountain
    Museum
    Palace
    Park
    Rajasthan
    Tamilnadu
    Temple
    Travel News
    Uttarakhand
    Waterfall
    Zoo

    Enter your email address:

    Delivered by FeedBurner

    Picture
    ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.

    Picture
    పండ్ల ప్రదర్శన - 2013

    Picture
    శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం

    Picture
    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture





    Picture
    Picture
    Picture
    Picture
    poodanda
    Blaagulokam logo
    మొత్తం పేజీ వీక్షణలు
    vihaarayaatra.weebly.com
Powered by Create your own unique website with customizable templates.