చూడవలసినవి: ప్యాలెస్ మరియు మ్యూజియం
వసతి : నాగర్ కోయిల్ లో హోటల్స్ కలవు.
అందుబాటు : తకలే నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లలో కలదు. ఇది నాగర్ కోయిల్ నుండి 20 కి. మీ దూరంలో తుకలే కు దగ్గరలో కలదు. ఇది వెలి కొండలకు అడుగు భాగంలో ఉంది. దీనిని 1601 వ సంవత్సరములో ఇరావి వర్మ కులశేకర పెరుమాళ్ నిర్మించాడు. ఒకప్పుడు ఇది ట్రావెన్ కోర్ లో భాగంగా ఉండేది. తరవాత ట్రావెన్ కోర్ రాజధానిని తిరువనంతపురం కు మార్చడం జరిగింది. భౌగోళికంగా ఇది తమిళనాడులో ఉన్నప్పటికినీ , దీని నిర్వహణను కేరళ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ ప్యాలెస్ మరియు మ్యూజియం మొత్తం చెక్కతోనే నిర్మించబడినది. ఇందులో ఆ కాలనాటి రాజులు వాడిన వివిధ వస్తువులను పదిలంగా భద్రపరిచారు. ఇందులో చెక్కతో చేసిన చాలా నిర్మాణాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. సందర్శన వేళలు ఉదయం 9 నుండి మద్యాహ్నం 1 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4.30 వరకు. ప్రతి సోమవారం సెలవు. సందర్శన రుసుము 25/- ఒక్కరికి. కెమేరాకు 25/- మరియు వీడియో కెమేరాకు 1500/-.
చూడవలసినవి: ప్యాలెస్ మరియు మ్యూజియం వసతి : నాగర్ కోయిల్ లో హోటల్స్ కలవు. అందుబాటు : తకలే నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. కన్యాకుమారి రైల్వే స్టేషన్ నుండి 1 కి.మీ దూరంలో కలదు. ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిదని, దీనిని రాజ రాజ చోళ అనే రాజు నిర్మించాడని చెపుతారు. చోళుల యొక్క నిర్మాణ శైలి ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయంలో 10 వ శతాబ్దానికి చెందిన 16 శాసనాలు కనుగొనబడ్డాయి. సందర్శన వేళలు ఉదయం 8 గంటల నుండి 11.15 వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8.45 వరకు.
చూడవలసినవి: గుగంతస్వామి టెంపుల్, భగవతి అమ్మన్ టెంపుల్, వాండరింగ్ మాంక్ ప్రదర్శన, మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. కన్యాకుమారి అనే పేరు కన్యాకుమారి అమ్మన్ పేరు మీదుగా వచ్చింది. భగవతి అమ్మన్ గుడి కుమారి పార్వతికి అంకితమీయబదినది. ఈ గుడి కన్యాకుమారి పట్టణం నందు త్రివేణి సంగమం వద్ద కలదు. పూర్వం బాణాసురుడనే రాక్షసుడు దేవతల మీద ఆధిక్యం సంపాధించి వారిని అనేక బాధలకు గురి చేస్తుండేవాడు. దేవతలు అందరూ బాణాసురుడి వినాశనం కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆదిపరాశక్తి ప్రభావంతో అందులోనుండి ఒక కన్య జనిస్తుంది. ఇంతలో పరమశివుడు ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. శివుడు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోగోరి అన్ని ఏర్పాట్లను చేయమని ఆదేశిస్తాడు. నారదుడి వలన శివుడు తన మార్గం నుండి పెండ్లిచేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతాడు.( ఒక కన్య మాత్రమే బాణాసురుడిని చంపగలదు. ఒక వేళ శివుడు ఆ కన్యను పెండ్లి చేసుకుంటే ఆ యజ్ఞ ఫలం వృధా అవుతుందని నారదుడు అలా శివుడిని వెళ్ళిపోయేటట్లుగా చేస్తాడు.) తర్వాత ఆ అమ్మాయి శివుడికోసం ఎదురుచూస్తూ అలా కన్యగానే ఉండిపోతుంది. తర్వాత కాలంలో బాణాసురుడిని సంహరించి దేవతలకు ఆ రాక్షస పీడ లేకుండా చేస్తుంది.
చూడవలసినవి: భగవతి అమ్మన్ టెంపుల్, వాండరింగ్ మాంక్ ప్రదర్శన, మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. కన్యాకుమారి నుండి నాగరు కోయిల్ కు పోయే దారిలో కన్యాకుమారి నుండి 14 కి. మీ దూరంలో కలదు. దీనికి జ్ఞాన వనక్షేత్రమనే పేరు కూడా కలదు.ఇచ్చటకు త్రిమూర్తులు వచ్చి అనసూయ దేవి పతివ్రతా ధర్మమును పరీక్షించుటకు భిక్ష యడిగిరి. త్రిమూర్తులు వివస్త్రగా భిక్షము పెట్టితే గాని అంగీకరించమని చెప్పినారు. అనసూయ దేవి తన పతివ్రతా ధర్మ మహిమచే త్రిమూర్తులను బాలకులుగా చేసి భిక్షము పెట్టినట్లు పురాణం. దేవేంద్రునికి ఇచ్చట మోక్షము సిద్దించినదని చెబుతారు. ఈ ఆలయమున బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన వారికీ ప్రత్యేక స్థానం కలదు. ఈ ఆలయమున ప్రతి రోజు అర్థరాత్రులందు దేవేంద్రుడు వచ్చి పూజ చేస్తాడని ఇతిహాసములు చెప్పుచున్నవి. దీనినే దేవేంద్ర పూజయని చెప్పుదురు. ఈ గుడి ప్రాకారమున ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం ఉన్నది. ఈ ఆలయమున ధనుర్మాసమున, చైత్రమాసమున పెద్ద ఉత్సవాలు జరుగును. ఈ ధనుర్మాస ఉత్సవమును రథోత్సవము అని చెప్పుతారు. చైత్రమాస ఉత్సవమును తెప్పోత్సవము అని చెబుతారు. ఈ ఆలయము బహు పునీతమైనది. ఈ స్థల పురాణమును భక్తితో చదివేవారును, శ్రవణించేవారును , వ్యాఖ్యానం చేసేవారును సర్వ పాప విముక్తులై సద్గతి పొందుతారు.
దేవేంద్రుడు తపస్సు చేసి పాపవిముక్తుడైన ఈ దివ్య ప్రదేశములో స్థానేశ్వరాలయము ఉంది. భక్తులు (మగవారు మాత్రమే) చొక్కాలు తీసి స్వామిని దర్శించుకోవాలి. కళ్యాణమండపము, సంగీత స్థంభాలుగల ఈ ప్రదేశము దగ్గరలో అత్రి, అనసూయ తపస్సు చేసిన ప్రదేశాలున్నాయి. చూడవలసినవి: శుచీంద్రం కోయిల్, అమ్మన్ కోయిల్ వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నాగర్ కోయిల్ నుండి మరియు కన్యాకుమారి నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి నుండి 14 కి.మీ దూరంలోని శుచీంద్రంలో కలదు. గుడి ముందుగా ఒక పెద్ద కొలను కలదు. భక్తులు ఇందులో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు (మగవారు మాత్రమే) చొక్కాలు తీసి, అమ్మవారిని దర్శించుకోవాలి.
చూడవలసినవి: అమ్మన్ కోయిల్ వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నాగర్ కోయిల్ నుండి మరియు కన్యాకుమారి నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ పట్టణము నందు కలదు. నాగర్ కోయిల్ అనే పేరు ఈ నాగరాజ గుడి మూలంగానే వచ్చిందని చెపుతారు. ఈ గుడి ముందు ఒక చిన్న కొలను లాంటిది కలదు. కొలనులో భక్తులు స్నానం చేసి నాగరాజ స్వామిని దర్శిస్తారు. కొలను పక్కగా ఒక దిమ్మె మీద చాలా నాగరాజ విగ్రహాలు కలవు. భక్తులు పసుపు మరియు పాలతో వీటిని అభిషేకిస్తారు. ఈ గుడిలో మనకు ఎక్కడ చూసినా నాగరాజ ప్రతిమలే కనిపిస్తాయి. ఈ గుడిలో ఇద్దరు ప్రధాన దైవాలు. ఆనంద కృష్ణ మరియు నాగరాజ. నాగరాజ గర్భాలయంలో వూరు నీటి వూటలోని నీటిని తీర్ధముగా ఇస్తారు. ఈ నీటి వూటలోని ఇసుక సంవత్సరములో సగభాగం తెల్లగాను మరియు మిగిలిన సగభాగం నల్లగాను ఉంటుంది.
చూడవలసినవి: నాగరాజ గుడి వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నాగర్ కోయిల్ నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. ఇందులో స్వామి వివేకానంద వివిధ ప్రదేశాలను దర్శించినప్పటి చిత్రాలు మరియు వాటి వర్ణన సవివరంగా హిందీ, ఇంగ్లీష్ మరియు తమిళ భాషలలో పొందుపరచడం జరిగింది. సందర్శన వేళలు ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ప్రవేశ రుసుము 10/-.
చూడవలసినవి: వాండరింగ్ మాంక్ ప్రదర్శన, మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. ఇందులో దక్షిణ భారత దేశానికి చెందిన వివిధ గుడుల యొక్క చిత్ర పటాలు మరియు పురాతన శిలా రూపాలు ఉన్నాయి. సందర్శన వేళలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు. అన్ని శుక్రవారాలు మరియు రెండవ శనివారాలు సెలవు దినాలు. ప్రవేశ రుసుము 5/-.
చూడవలసినవి: మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. ఇది ఆరు అంతస్తులుగా ఉంది. వాచ్ టవర్ పై నుండి చూస్తే కన్యాకుమారి చివరి భాగాన్ని మొత్తం ఒకేసారి చూడవచ్చు. సందర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. ప్రవేశ రుసుము 3/-.
చూడవలసినవి: వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలోని తిరుపరప్పు అనే గ్రామంలో కలదు. ఇది కన్యాకుమారి నుండి 60 కి. మీ దూరంలో కలదు. కన్యాకుమారి నుండి ముందుగా నాగర్ కోయిల్ చేరుకోవాలి. అక్కడి నుండి తకలే మరియు తకలే నుండి తిరుపరప్పు చేరుకోవాలి. తకలే నుండి తిరుపరప్పు వెళ్ళే దారిలో రోడ్డు కిరివైపులా రబ్బరు చెట్లు దర్శనమిస్తాయి. తిరుపరప్పు గ్రామం చేరుకున్నాక, అక్కడి నుండి ఒక పది నిమిషాల నడక ద్వారా తిరుపరప్పు జలపాతాలను చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న నీటి ప్రవాహం కొడయార్ నది నీటి ప్రవాహం. ఈ జలపాతాలు 50 అడుగుల ఎత్తునుండి పడుతున్నాయి. ఇక్కడికి తమిళనాడు నుండే కాక కేరళ నుండి కూడా చాలా సందర్శకులు వస్తుంటారు. జలపాతాల పక్కనుండి కొంచెం పైకి వెళితే బోటింగ్ చేయవచ్చు. బోటింగ్ గంటకి 100/-. ఇక్కడ ఒక శివుని దేవాలయం కూడా కలదు.
చూడవలసినవి: తిరుపరప్పు జలపాతాలు , శివాలయం వసతి : తిరుపరప్పు లో హోటల్స్ కలవు. అందుబాటు : తకలే నుండి బస్సు సౌకర్యం కలదు. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|