చూడవలసినవి: పెరుంపల్లం డ్యాం
వసతి: సత్యమంగలంలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు మరియు ఈరోడ్ నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, ఈరోడ్ జిల్లాలో కలదు. దీనిని 1980 లో నిర్మించారు. ఈ డ్యాం 2 కి.మీ పొడవు, 40 మీటర్ల ఎత్తులో కలదు. ఈ డ్యాం కాదంబుర్ పర్వత శ్రేణి అడుగు భాగంలో కలదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల పంటపొలాలకు ఈ నీరే ఆధారం.
చూడవలసినవి: పెరుంపల్లం డ్యాం వసతి: సత్యమంగలంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు మరియు ఈరోడ్ నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. ఇది పానగల్లు మ్యూజియంకు ముందు భాగంలో కలదు.ఇది అన్యమతస్తుల దుశ్చర్యలకు గురైనట్లు తెలుస్తున్నది. దేవాలయం పైభాగం సింహ ద్వారంలోని గజేంవూదుల తొండాలు దెబ్బతిని కనిపిస్తున్నాయి. ఈ ఆలయం నల్లరాతితో నిర్మించబడినది. రామాయణ, మహాభారతాది ఘట్టాలతో సహా ఎన్నో శిల్పాలు ఈ ఆలయ ప్రాకారాలందూ గోడలపై చెక్కబడినాయి. పచ్చల సోమేశ్వ రాలయ పునరుద్ధరణకు 1923లో నిజాం ప్రభువు ప్రధాన మంత్రైన మహారాజు సర్కిషన్ ప్రసాద్ బహుద్దర కృషి చేసినాడు. ఈ ఆలయంలోని లింగమునకు ఒక పెద్ద మచ్చ(రత్నం) పాదగబడి ఉండేనని, దేవుడి ఆలంకరణకు పచ్చల హారాలు వేయించి ఉండే వారని, తద్వారా దీనికి పచ్చల సోమేశ్వర ఆలయమనే పేరు వచ్చిందని తెలుస్తున్నది. ఇక్కడే మరొక వైష్ణవ ఆలయం ఉన్నదు. పైరెండు ఆలయాలకన్నా ఇది కొంచే ఆధునిక తపం. ప్రస్తుతం ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ అష్టధిక్పాలక శిల్పములు, బుగ్వేదమునందు ప్రధాన దేవతలుగా ఇంద్ర, అగ్రి, వర్ణ, కుబేరా, వాయువులు స్తుతించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రాచీన నగరాల్లో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ.శ 11-12 శతాబ్ధాలలో కందూరు చోళుల రాజధానిగా ఉండేది. ఇక్కడ కాకతీయులకు సామంతులైన కందూరు చోళులు పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు. నల్ల శానపు రాళ్ళపై రమ్యంగా మలచిన శిల్పాలు, ఆలయాలు, మధ్యయుగ వాస్తు శిల్ప సాంప్రదాయాలకు అడ్డం పడుతున్నాయి. తూర్పు వైపున ఒకటి, పశ్చిమం వైపున మూడు ఆలయాలను 70 స్తంభాలతో నిర్మించిన మహామండపం కలుపుతూ ఉంది. ఆలయం గోడలపైన, మండపం స్తంభాలపైన చెక్కిన శివ, అష్టదిక్పాల, భారత, రామాయణ గాథలు, సమకాలీన జీవన విదానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. చూడవలసినవి: పచ్చల సోమేశ్వరాలయం,మ్యూజియం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. దీనిని 1994 లో పురావస్తు శాఖవారు పచ్చల సోమేశ్వరాలయం వెనుక భాగంలో నెలకొల్పారు. జిల్లాలో లభ్యమయిన శిలాసంపదను సేకరించి మ్యూజియంలో ఉంచారు. ముఖ్యంగా ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, వంటపాత్రలు, లిపి , దేవతా విగ్రహాలు, అప్పటి నాణేలు మొదలగునవి ఇక్కడ కళ్లకు కట్టినట్లు దర్శమిస్తాయి. ఈ మ్యూజియంలో 1 వ శతాబ్ధం నుండి 18 వ శతాబ్ధం వరకు శిలాశాసనాలు, ఆయుధాలు, శిల్పాలు పొందుపరచడం జరిగింది. ప్రతి సోమవారం సెలవు దినం. సందర్శన వేళలు : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు.
చూడవలసినవి: మ్యూజియం, పచ్చల సోమేశ్వరాలయం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 22 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ఒకే గుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలు కలవు. ఇది ఒకప్పుడు త్రిమూర్తిగా పిలువబడేది. త్రిమూర్తి అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు . తదనంతర కాలంలో అదే తిరుమూర్తిగా ప్రాచుర్యం పొందింది. ఈ గుడికి సంబంధించిన ఒక కథ మనకు వినిపిస్తుంది.
ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్రి మహర్షి, తన భార్య అనసూయతో కలిసి ఇక్కడ నివసించేవారు. ఒకనాడు నారదుడు అనసూయ యొక్క పాతివ్రత్యం గురించి బ్రహ్మ, విష్ణు మరియు ఈశ్వరుడి ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి దగ్గర ప్రస్తావించాడు. దీనితో ఆ ముగ్గురు దేవతలు అసూయ చెందారు. ఎలాగైనా అనసూయ యొక్క పాతివ్రత్యం తగ్గించమని తమ భర్తలను వేడుకుంటారు . ఒకనాడు అత్రి మహర్షి లేని సమయంలో త్రిమూర్తులు వెళ్లి అనసూయను భిక్ష అడుగుతారు. కాని వారు ఒక షరతు విధిస్తారు. అనసూయ వివస్త్రగా భిక్ష వేస్తేనే స్వీకరిస్తామని. దీనితో అనసూయకు ఏమి చేయాలో మొదట పాలుపోదు. తరవాత బాగా అలోచించి అనసూయ , మనసులో తన భర్తను తలచుకొని భిక్ష వేయడానికి సిద్ధమవుతుంది. అనసూయ పాతివ్రత్య ప్రభావం చేత త్రిమూర్తులు ముగ్గురు చిన్న పసిపాపలుగా మారిపోతారు. అప్పుడు వాళ్లకు పాలు పట్టి పడుకోబెడుతుంది. తన భర్త వచ్చిన తరవాత జరిగినదంతా చెబుతుంది. జరిగిన దానికి అత్రి మహర్షి చాలా సంతోషిస్తాడు. కొద్దిసేపటి తరవాత త్రిమూర్తులు మేలుకొని, అనసూయ పాతివ్రత్య మహిమను అభినందిస్తారు. ఏదైనా వరం కోరుకొమ్మని అనసూయను అడుగుతారు త్రిమూర్తులు. అనసూయ త్రిమూర్తులను తన బిడ్డలుగా జన్మించాలనే వరాన్ని కోరుకుంటుంది. అది ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర. చూడవలసినవి: తిరుమూర్తి గుడి, తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి జలపాతం వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 23 కి.మీ దూరంలో కలదు. ఇది తిరుమూర్తి గుడికి దగ్గరలో కలదు. తిరుమూర్తి గుడి నుండి ఒక 20 నిమిషాల నడక ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు చేతిలో ఏదైనా కర్ర లాంటిది దగ్గర ఉంచుకుంటే కోతులు దగ్గరికి రావు. లేదంటే మనదగ్గర బ్యాగులను బలవంతంగా లాక్కోవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఇక్కడ స్నానం చేసిన తరవాత భక్తులు తిరుమూర్తిలోని గుడికి వెళతారు.
చూడవలసినవి: తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి గుడి, తిరుమూర్తి జలపాతం వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : తిరుమూర్తి గుడి నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 20 కి.మీ దూరంలో కలదు. ఇది తిరుమూర్తి కొండల పాద భాగంలో కలదు. దీనికి దగ్గరలోనే తిరుమూర్తి ఆలయం మరియు తిరుమూర్తి జలపాతం కూడా కలదు.
చూడవలసినవి: తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి గుడి, తిరుమూర్తి జలపాతం వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. విశాల భారతదేశమందు శ్రీ రామేశ్వర క్షేత్రం ప్రఖ్యాతి గాంచినది. ఇటువంటి క్షేత్రములు భారత దేశములో 4 కలవు. ఉత్తరాన బద్రినాథ్, తూర్పున పూరి , పడమర ద్వారక మరియు దక్షిణమున రామేశ్వరము. ఈ నాలుగు క్షేత్రాలు భారతదేశానికి నాలుగు వైపులా ఉండి మన దేశాన్ని ఎల్ల వేళల కాపాడుతుంటాయి. రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
శ్రీ రామనాథ స్వామి ఆలయం - రామేశ్వరం రాముని చేత ప్రతిష్టించబడి, ఈశ్వరుడు కలడు కనుక ఈ ప్రదేశమునకు రామేశ్వరమనే పేరు వచ్చింది. లంకాధిపతియైన రావణుడు సీతను లంక యందుoచగా, ఆమెను రక్షించుటకు శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు వెళ్లినట్లుగా రామాయణ ఇతిహాసం తెల్పుచున్నది. శ్రీ రాముడు సముద్ర దేవుడిని హనుమంతునికి దారి ఇమ్మని కోరెను. ఆంజనేయుడు తన వానర సైన్యముచేత పెద్ద పెద్ద బండలతో వారధి కట్టించి లంకకు మార్గం ఏర్పరచెను. రావణ బారి నుండి సీతను రాముడు విడిపించుకొని, రామేశ్వరం వచ్చి తాను రావణుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టమని మునులను అడుగగా వారు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేయమని చెప్పినారు. హిమాలయాలలోని కైలాస పర్వతము నుండి శివ లింగమును తెమ్మని హనుమంతుడిని పంపించెను. సకాలములో ఆంజనేయుడు శివలింగమును తేలేకపోయెను. అంతట సీతాదేవి ఇసుకతో లింగమును తయారు చేసెను. ఆమె పవిత్ర హస్త స్పర్శచే లింగము గట్టిపడి నిలిచెను. ప్రతిష్ట జరిగిన తరువాత వాయుపుత్రుడు లింగముతో వచ్చెను. అంతకు ముందరనే ఒక లింగము ప్రతిషించబడి యుండుట చూసి కోపోద్రిక్తమానసుడై , తనతోకతో లింగమును పెకలింప జూచెను. కాని విఫలుడాయెను. వెంటనే శ్రీరాముడు హనుమoతుని బుజ్జగించి, సీతాదేవి ప్రతిష్టించిన లింగము పక్కనే హనుమంతుడు తెచ్చిన లింగమును ప్రతిష్టించి, హనుమా! మొదట నీవు తెచ్చిన లింగమునకే పూజా - పునస్కారాలు జరిపి, తరవాత రామనాథ లింగమును పూజింతురు అనెను. హనుమంతుడు తెచ్చిన లింగమును విశ్వ లింగమని, సీత చేసిన లింగమును రామ లింగమని పిలుతురు. రామనాథస్వామిని దర్శించుకొనుటకు ముందుగా అగ్ని తీర్థంలో స్నానమాచరించాలి. తరవాత గుడిలోని 22 తీర్థంలలో గల పవిత్ర జలాలతో స్నానం చేయాలి. అవి 1) మహాలక్ష్మి తీర్థం 2) సావిత్రి తీర్థం 3)గాయత్రి తీర్థం 4)సరస్వతీ తీర్థం 5)సేతు మాధవ తీర్థం 6)గండ మాధన తీర్థం 7)కవచ తీర్థం 8)గవయ తీర్థం 9)నల తీర్థం 10)నీల తీర్థం 11)శంకర తీర్థం 12)చక్ర తీర్థం 13) బ్రహ్మ హత్యా పాతక విమోచన తీర్థం 14)సూర్య తీర్థం 15)చంద్ర తీర్థం 16)గంగా తీర్థం 17)యమునా తీర్థం 18)గయా తీర్థం 19)శివ తీర్థం 20)సత్యామృత తీర్థం 21)సర్వ తీర్థం 22)కోటి తీర్థం . ఇవి అన్నియు గుడిలోనే కలవు. కావున గుడి ఎల్లప్పుడూ తడిగానే ఉంటుంది. చూడవలసినవి: రామనాథస్వామి గుడి, అగ్ని తీర్థం వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రామేశ్వరంలో లోకల్ బస్సులు కలవు. ఇది తమిళనాడు, రామంతాపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరంలోని రామనాథ స్వామి గుడి ముందుగా 100 మీటర్ల దూరంలో కలదు. రామేశ్వరం చేరుకున్న భక్తులు ముందుగా అగ్నితీర్థంలో స్నానమాచరించాలి. (అగ్ని తీర్థం అనగా గుడి ముందుగా ఉన్న సముద్రం). తరవాత గుడిలో ఉన్న 22 బావులలోని పవిత్ర జలాలతోని స్నానం చేసిన తరవాతనే స్వామి వారిని దర్శించుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.
చూడవలసినవి: అగ్ని తీర్థం వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రామేశ్వరం గుడి నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, రామంతాపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరం నుండి 10 కి. మీ దూరంలో కలదు. శ్రీ రామచంద్రుడిని విభీషణుడు శరణు వేడింది ఇక్కడనే. అదియునుగాక, విభీషణుని తాత్కాలిక పట్టాభిషేకము కూడా లక్ష్మణునిచె ఇక్కడనే జరిగినది. రామేశ్వరము నందలి రామలింగ ప్రతిష్టాపన ఉత్సవము రోజున ఉత్సవరులను కేడియం (మనుష్యులు బారుకొయ్యలతో మోయుట) నందు నిలిపి , రామేశ్వరం నుండి ఇచ్చటికి ఉత్సవముతో వచ్చుదురు. రావణ వధానంతరము విభీషణుని పట్టాభిషేకము జరిగి, మరునాడు రామలింగ ప్రతిష్టాపన మహోత్సవము రామేశ్వరము నందు జరుపబడును.
చూడవలసినవి: కోదండ రామస్వామి ఆలయం వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : రామేశ్వరం నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, రామంతపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరం నుండి 2.5 కి.మీ దూరములో కలదు. శ్రీ రాముని పాదములు ఈ గుడి యందు కలవు. ఇక్కడ రెండు అంతస్తుల దేవాలయం కలదు. పై నుండి చూస్తే రామేశ్వర పట్టణం, రామేశ్వరం ద్వీపంలోని కొన్ని భాగములు కనబడును. శ్రీ రామ చంద్రుడు రావణ సంహారం తర్వాత బ్రహ్మ హత్యా పాతకం పోవడానికి మార్గం ఆలోచించింది ఈ గంధమాధన పర్వతం మీదే.
చూడవలసినవి: రాముని పాదాలు, రామేశ్వర ద్వీపంలోని కొన్ని భాగాలు. వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : రామేశ్వరం నుండి ఆటోలు లభించును. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|