జంటనగరాల నుంచి తొలిసారిగా భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) వారణాసి, అలహాబాద్ వంటి యాత్రా స్థలాలకు ప్రత్యేక ప్యాకేజి యాత్రలు సిద్ధం చేసింది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు వారణాసి, సారనాథ్, అలహాబాద్ లో పర్యటనకు ఏర్పాటు చేస్తారు. కాశీ క్షేత్ర దర్శనంతో పాటు అలహాబాద్ త్రివేణి సంగమం, సారనాధ్ బౌద్ధ క్షేత్ర సందర్శనం ఈ యాత్రలో ఉంటాయి. రైలు రిజర్వేషన్ , రోడ్డు మార్గంలో ప్రయాణ సౌకర్యం , బస ఏర్పాట్లన్నీ వారే చూస్తారు. "ఆవో ఛలో కాశీ దర్శన్ కరే" పేరిట రూపొందించే ఈ యాత్రను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నంబర్ 12791 పాట్నా ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రారంభించనున్నామని IRCTC సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయం అధికారులు తెలిపారు. రూ. 7170 కనీస ఛార్జీగా ఈ ప్యాకేజి టూర్లు ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు సికింద్రాబాద్ లోని IRCTC కార్యాలయంలో లేదా 040-66201263, 97013 60690 నంబర్లలో సంప్రదించాలన్నారు.
|
Vihaarayaatra
ArchivesCategories
All
|