ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. ఇది బద్రినాథ్ నుండి 3 కి.మీ దూరంలో కలదు. బద్రినాథ్ నుండి ఇక్కడికి వాహనాలలో చేరుకోవచ్చు. ఈ గ్రామంయొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశం యొక్క చిట్టచివరి గ్రామం. దీని తరవాత టిబెట్ భూభాగం ప్రారంభం అవుతుంది. ఇక్కడ మంగోలియన్ ట్రైబల్ వారు నివసిస్తారు. మిలిటరీ పర్మిషన్ తోనే ఈ మాణా గ్రామంలోకి ప్రవేశించగలం. వసుధార జలపాతం ఇక్కడి నుండి 6 కి.మీ దూరంలో కలదు.
0 Comments
ఇది రాజస్తాన్ రాష్ట్రంలో , జైపూర్ పట్టణానికి నైరుతి దిశగా 96 కి.మీ దూరంలోనూ మరియు అజ్మీర్ నుండి 64 కి.మీ దూరంలోనూ కలదు. ఈ సరస్సు చుట్టుకొలత 96 కి.మీ . ఇక్కడ సముద్రపు నీరు లేకపోయినా ఇక్కడ ఉప్పును తయారు చేస్తారు. ఇది ఆరావళీ కొండల నడుమ ఉన్నది. వర్షములు పడ్డప్పుడు నీరు బాగా నిండుతుంది. కొండల మీద మడులు చేసి నీటిని నిలువ చేసి, నీటి మట్టం తగ్గినప్పుడు ఎండిపోయిన మడి నుండి ఉప్పును తయారుచేస్తారు.
ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు గోనాగ చతుర్ముఖుడుగా రూపుదిద్దుకున్నాడు. ఈ సారి సామివారి విగ్రహానికి ఇరువైపులా రెండు విగ్రహాలను ఏర్పాటు చేసారు. స్వామివారి కుడి వైపు రాములవారి విగ్రహం మరియు ఎడమవైపు భువనేశ్వరి మాత విగ్రహాలు కలవు. ఈ రెండు విగ్రహాలను యాదగిరి గుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లోటస్ ఆలయంలో ఏర్పాటు చేసే మ్యూజియంలో ఉంచేందుకు తరలిస్తున్నారు.
ఇది ఉప్పల్ లోని స్టేడియంకు దగ్గరలో కలదు. వెలుగు గుట్ట అని అడిగితే ఎవరైనా చెబుతారు. ఇక్కడ శివాలయంతో పాటు ఆంజనేయస్వామి గుడి మరియు అమ్మవారి గుడి కలదు. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉన్నదని ఇక్కడ పూజారి చెప్పారు. అది నిజాం కాలం. ఇప్పుడు ఉప్పల్ ఉన్న ప్రాంతం అప్పుడు అటవీ ప్రాంతం. ఇక్కడికి నిజాం నవాబులు గుర్రం మీద విహారానికి వచ్చేవారట. నిజాం ప్రభువులకు తెలియకుండా కొందరు యాదవులు ఇక్కడ గొర్రెలు కాచుకునేవారట. ఒకరోజు ఇద్దరు యాదవులకు రెండు గుండ్ల మధ్య ఒక శివలింగం కనిపించింది. అప్పటి నుండి ఆ ఇద్దరు యాదవులు సంవత్సరానికి ఒక రోజు అక్కడ దీపం వెలిగించి పూజించేవారట. తదనంతర కాలంలో ఈ ఉప్పల్ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ గా మార్చారు. ఇక్కడ ఉన్న సర్పంచులు ఈ వెలుగు గుట్ట ప్రాంతాన్ని శివుడి ఆలయం కోసం కేటాయించారు. తరవాత కొంత మంది దాతల సహాయంతో ఈ గుడిని నిర్మించారు. ఇక్కడి అమ్మవారి ఆలయంలో అష్టాదశ శక్తి పీఠముల యొక్క దేవతా మూర్తులతో వివరాలను కూడా ఇక్కడ పొందుపరచారు. ఇక్కడ కొండ మీద శ్రీ కోందండ రామస్వామి ఆలయం కూడా కలదు. దీనిని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దాతలు ఎవరైనా ఈ ఆలయపు నిర్మాణానికి సహకరించగలరని మనవి.
ఉప్పల్ లోని వెలుగు గుట్ట మీద శ్రీ దుర్గా మల్లిఖార్జున స్వామి దేవాలయం కలదు. ఈ రోజు సాయంత్రం ఆ గుట్ట మీద నుండి కనిపించిన సూర్యాస్తమయం.
మనదేశంలోని అద్భుతమైన కట్టడాల్లో ఒకటి రాష్ట్రపతి భవన్ . బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ప్రత్యేక నిర్మాణశైలి, విశాలమైన గదులు, రంగురంగుల పూలమొక్కలు, ఆకట్టుకునే గార్డెన్, ఫౌoటెయిన్లు .... ఇలా ఎన్నో వింతలూ విశేషాలకు పెట్టింది పేరు. ఇంకా చదవండి.
జంటనగరాల నుంచి తొలిసారిగా భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) వారణాసి, అలహాబాద్ వంటి యాత్రా స్థలాలకు ప్రత్యేక ప్యాకేజి యాత్రలు సిద్ధం చేసింది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు వారణాసి, సారనాథ్, అలహాబాద్ లో పర్యటనకు ఏర్పాటు చేస్తారు. కాశీ క్షేత్ర దర్శనంతో పాటు అలహాబాద్ త్రివేణి సంగమం, సారనాధ్ బౌద్ధ క్షేత్ర సందర్శనం ఈ యాత్రలో ఉంటాయి.
Read more........ ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరులోని రేస్ కోర్స్ రోడ్డులో కలదు. దీనిని 1979 లో అప్పటి శృంగేరి శారద మఠం పీఠాధిపతి నిర్మించారు. ఇక్కడ అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి. అమ్మవారి ఆలయానికి చెరొక వైపు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కలవు. ఇక్కడ దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఆ తొమ్మిది రోజులు ఈ ఆలయం బొమ్మల కొలువుతో మరియు భజనలతో చూడ ముచ్చటగా ఉంటుంది.
చూడవలసినవి: శారదాంబల్ కోయిల్, రేస్ కోర్స్ రోడ్డు వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి పొల్లాచ్చికి వెళ్ళే మార్గంలో, 13 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ముందుగా మనకు విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఆలయం ఆవరణలో గణపతి మరియు ఆంజనేయస్వామి దేవాలయాలు కలవు. ఈ ఆలయంలో మనం ముగ్గురు అమ్మలను (సరస్వతి , లక్ష్మి మరియు పార్వతి ) ఒకే చోట చూడవచ్చు. సందర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్ర్రి 8.30 గంటల వరకు.
చూడవలసినవి: మహాలక్ష్మి ఆలయం మరియు ఎచనారి ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 30 కి.మీ దూరంలో కల కార్మడై గ్రామలో కలదు. ఇది రంగనాథర్ కోయిల్ పక్కనే కలదు. ఇక్కడి నంజుడేశ్వరర్ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ గుడి సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయంలోని శివలింగం ఎరుపు రంగులో ఉంటుంది. తమిళంలో నంజు అంటే విషం. అమృత మథనం సమయంలో మొదటగా వచ్చిన హాలాహలాన్ని శివుడు తన గొంతులో ఉంచుకుంటాడు. దానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మించబడినది. సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు.
చూడవలసినవి: నంజుడేశ్వరర్ ఆలయం , రంగనాథర్ కోయిల్ మరియు టెన్ తిరుపతి వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|