పదండి ప్రపంచాన్ని చుట్టేద్దాం.............
  • పర్యాటక ప్రదేశాలు
  • నేను
  • యాత్రా వార్తలు
  • తెలుగు తరుణి

రాష్ట్రపతి భవన్ ను  చూడాలని  ఉందా?

9/2/2013

0 Comments

 
మనదేశంలోని అద్భుతమైన కట్టడాల్లో ఒకటి  రాష్ట్రపతి భవన్ . బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ప్రత్యేక నిర్మాణశైలి, విశాలమైన గదులు, రంగురంగుల పూలమొక్కలు, ఆకట్టుకునే గార్డెన్, ఫౌoటెయిన్లు .... ఇలా ఎన్నో వింతలూ విశేషాలకు పెట్టింది పేరు.

ఎన్నో ప్రత్యేకతలు :
మన రాష్ట్రపతి భవన్ ను 1912-1929 మధ్య కాలంలో 17 ఏళ్ల పాటు నిర్మించారు. అప్పట్లో రూ. 1.40 కోట్లను ఖర్చుచేసి నిర్మించిన ఈ కట్టడంలో మొదట లార్డ్  ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివాసం ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1950 లో దానిని రాష్ట్రపతి భవన్ గా మార్చారు. 330 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనంలో మొత్తం 340 గదులు ఉండగా వాటిలో 64 లివింగ్ రూమ్స్ ఉన్నాయి. అంతేకాదు మార్బల్ హాల్, కిచెన్ మ్యూజియం, చిల్డ్రెన్ గ్యాలరీ, గిఫ్ట్  మ్యూజియం, దర్బార్ హాల్, లైబ్రరీ, అశోక హాల్, మొఘల్ గార్డెన్ వంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రంగురంగుల చలువ రాళ్ళతో మనోరంజకంగా ఈ భవనం రూపుదిద్దుకుంది. ఈ కట్టడంలో భారతీయ మొఘల్ నిర్మాణ రీతులు కనిపిస్తాయి. అలాగే భౌద్ధ నిర్మాణాలను తలపిస్తుంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి:


అంతర్జాలంలో గూగుల్ ఓపెన్ చేసి హౌ టు విజిట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా  అని సెర్చ్ చేయాలి. రాష్ట్రపతి  వివరాలతో పాటు రాష్ట్రపతి ప్రసంగాలు, చిత్రాలు, రాష్ట్రపతి భవనం ప్రత్యేకతలకు సంబంధించి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఉండే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.ఎన్ఐసి .ఇన్ క్లిక్ చేస్తే చాలు రాష్ట్రపతి భవన్ సందర్శనకు ఆన్ లైన్లో నమోదుకు సంబంధించిన వివరాలు అడుగుతూ పేజీ ప్రత్యక్షమవుతుంది. ఇక ప్రవేశ రుసుం 25/- ను డీడీ, చలానా, మొబైల్ బ్యాంకింగ్ రూపంలో చెల్లించాలి. పూర్తి వివవరాలు నమోదు చేశాక అధికారులనుండి అనుమతికి సంబంధించిన సమాచారం సెల్ ఫోన్ కు వస్తుంది.

మరిన్ని వివరాలకు:

మానేజ్ మెంట్ సెల్ నెంబర్ :011-23013287, 23015321 లో సంప్రదించవచ్చు.

పిల్లలకు ప్రవేశం ఉచితం :

12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. ఇక 30 మంది బృందంగా వెళితే రూ 600/- చెల్లించాల్సి ఉంటుంది.

0 Comments



Leave a Reply.

    Vihaarayaatra

    Archives

    September 2013
    August 2013

    Categories

    All
    కాశీ యాత్రకు IRCTC వారి ప్రత్యేక ప్యాకేజీలు
    రాష్ట్రపతి భవన్ ను చూడాలని ఉందా?

    RSS Feed

Powered by Create your own unique website with customizable templates.