చూడవలసినవి: మారియమ్మన్ తిరుకోయిల్
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/sulakkal.html
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. కోయంబత్తూర్ నుండి 40కి. మీ దూరంలో సూలక్కల్ అనే గ్రామంలో కలదు. మూడు వందల సంవత్సరాల క్రితం సూలక్కల్, ప్రమాదకరమైన జంతువులు మరియు విష సరీసృపాలు ఉండే అడవి నడుమ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళు తమ పశువుల గ్రాసం కోసం ఇక్కడికి వస్తుండేవారు. ఒకానొక యజమాని యొక్క ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించాడు. ఒక రోజు ఆ యజమాని ఆ ఆవును అనుసరించగా, ఆ ఆవు ఒక సాండ్ హిల్ మీద పాలు కార్చడం చూసాడు. ఆ ఆవు తన యజమానిని గమనించి అక్కడినుండి త్వరగా వెళ్ళే క్రమంలో ఆవు కాళ్ళు సాండ్ హిల్ మీద పడటం, ఆ సాండ్ హిల్ నుండి రక్తం బయటకి చిమ్మడం చూసి ఆ యజమాని ఆశ్చర్యపోయాడు. అక్కడ వారికి ఒక అమ్మవారి విగ్రహం కనిపించింది. అదే రోజు రాత్రి ఆ యజమానికి కలలో అమ్మవారు కనిపించి తనకు అక్కడ గుడి కట్టించమని ఆదేశించిందట. అలా అమ్మవారికి ఆలయం నిర్మించడం, సూలక్కల్ మారియమ్మన్ గా ప్రసిద్ధి చెందడం జరిగింది . ఈ రోజు వరకు ఈ ఆలయం, ఈ ప్రాంతంలో ఒక సాంస్కృతిక చిహ్నంగా నిలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి కలిపి మొత్తం మూడు కుటుంబాలు ఈ ఆలయ సంరక్షణ భారాన్ని వహిస్తున్నాయి.
చూడవలసినవి: మారియమ్మన్ తిరుకోయిల్ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/sulakkal.html
0 Comments
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. కోయంబత్తూర్ నుండి 50 కి. మీ (కోయంబత్తూర్ -కార్మడై - టెన్ తిరుపతి) దూరంలో కలదు. ఇది KG DENIM LIMITED వారి ఆధ్వర్యంలో కలదు. గుడిలోనికి మొబైల్స్, కెమేరాలు వేటిని అనుమతించరు. ఈ గుడిని చిన్న తిరుపతి అని అనవచ్చు. ఎందుకంటే తిరుపతిలో ఉండే స్వామి వారికి ఏవైతే కార్యక్రమాలు జరిపిస్తారో ఇక్కడ ఉండే స్వామి వారికి కూడా అలాంటి కార్యక్రమాలే జరిపిస్తారు. తిరుపతిలోని స్వామివారిని కన్నులారా దర్శించుకోలేని వారు ఇక్కడ ఉన్న స్వామి వారిని కన్నులారా దర్శించుకోవచ్చు. ఇక్కడి లడ్డు కూడ తిరుపతి లడ్డుకు ఏ మాత్రం తీసిపోదు.
చూడవలసినవి: టెన్ తిరుపతి వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://www.thenthirumalai.com/ ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. ఇది అలియార్ నది ఒడ్డున , పొల్లాచ్చికి 8 కి. మీ దూరంలో కలదు. ఈ మధ్యనే ఈ గుడిని పునరుద్ధరించి 2007 లో కుంభాబిషేకం జరిపించారు. ఇది మొదటగా శివుడి కోసం నిర్మించారట కాని ఎందువల్ల దీనిని వినాయకుని గుడిగా మార్చారో ఎవరికీ తెలియని విషయం. ఇక్కడున్న వినాయకుని విగ్రహం 500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ గుడి ముందున్న నంది విగ్రహం 1000 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడి వారు చెబుతారు.
చూడవలసినవి: వినాయకర్ టెంపుల్ వసతి : పొల్లాచ్చిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచ్చి నుండి బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/prasanda-vinayagar-temple.html ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణానికి 72 కి.మీ (కోయంబత్తూర్ -కార్మడై -పిల్లూర్ డ్యాం రోడ్ -బార్లికడు ) దూరంలో కలదు. బార్లికడు పిల్లూర్ డ్యాంకి దగ్గరలో కలదు. ఇక్కడ దోనె లో విహారం ప్రత్యేకం. ఇక్కడకి చేరుకోవడానికి అడవి గుండా ప్రయాణించాలి. కాబట్టి ఆటవీశాక అధికారుల అనుమతి తప్పనిసరి. బార్లికడు వెళ్ళే దారిలో కెమ్మరంపాలయం దాటిన తరవాత రెండు చెక్ పోస్ట్ లు కలవు. మొదటి చెక్ పోస్ట్ లో అనుమతిని పొందడం కొంచెం తేలికే. రెండవ చెక్ పోస్ట్ ని దాటాలంటే మాత్రం ముందస్తు అనుమతి తప్పనిసరి. ప్రయాణం మొత్తం అడవిగుండా కావడం చేత చాలా మలుపులు కలవు. ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి తినుభండారాలు లభించవు. మీవెంట వాటిని తీసుకెళ్లడం మరచిపోకండి.
చూడవలసినవి: పిల్లూర్ డ్యాం, బార్లికడు వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి ఊటీ వెళ్ళే బస్సు (కీల్ కుందా) మాత్రమే ఈ అడవిగుండా పోతుంది. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/barlikadu.html ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణానికి పశ్చిమాన 7 కి.మీ దూరంలో కలదు. దీనినే మేల్ చిదంబరం అని కూడా అంటారు. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఇక్కడి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని జనన మరణ కాల చక్రం నుండి శివుడు విముక్తి కలిగిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం నొయ్యల్ నదికి దగ్గరలో కలదు. ఈ ఆలయాన్ని కరికాల చోరన్ అనే రాజు నిర్మించాడు. ఈ ఆలయానికి ముందర ఒక చిన్న కొలను లాంటిది కలదు. దానిని తెప్పకులం అని పిలుస్తారు. ఈ తెప్పకులం 16 కోణాలు మరియు 8 మూలలతో ఉంది. ఇది 15 వ శతాబ్దంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినది.
చూడవలసినవి: పెరూర్ పట్టీశ్వరర్ ఆలయం, ఎచనారి వినాయగర్ ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/perur.html ఇది తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లాలో కలదు. ఇది హొసూరు నుండి 10 కి.మీ దూరంలో ఒన్నల్ వాడికి సమీపంలో, తోరపల్లి గ్రామంలో కలదు. ఇది చక్రవర్తి రాజాజీ పుట్టిన ఇల్లు. రాజాజీ అంటే రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. రాజాజీ గారు వకీలుగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయనాయకుడిగా, రచయితగా మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కూడా పనిచేసారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి మఖ్యమంత్రిగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పనిచేసారు. రాజాజీ గారు స్వాతంత్ర పార్టీ అనే దానిని స్థాపించారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందుకున్నవారిలో ప్రథముడు. రాజాజీగారు పుట్టిన ఇల్లును తమిళనాడు ప్రభుత్వంవారు రాజాజీ మెమోరియల్ గా మార్చారు. ఇందులో రాజాజీ గారి జీవత కాలంలో వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు ఉన్నాయి. ఈ ఇంటిలో రాజాజీ గారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనం చూడొచ్చు.
చూడవలసినవి: రాజాజీ మెమోరియల్ వసతి : హొసూరు లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : హొసూరు నుండి ఒన్నల్ వాడికి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/thorapalli.html వాస్తు శిల్పానికి శాస్త్రవిజ్ఞానానికి ప్రాచీన భారతావనిలో అవినాభావ సంబంధం ఉండేది. జైసింగ్ వేధశాలలు ఇందుకు ఇటీవలి నిదర్శనాలు. ఖగోళవేత్త మీర్జా ఉలుగ్ బేగ్ పరిశోధనలు 18వ శతాబ్దపు సవాయి జైసింగ్2 ను ఎంతగానో ప్రభావితం చేశాయి. జైపూర్ మహారాజైన జైసింగ్ కూడా స్వయంగా గొప్ప పండితుడు, ఖగోళ శాస్త్రవేత్త. ఉత్తరాది నగరాలైన ఢిల్లీ, ఉజ్జయిని, వారణాసి, మధుర, జైపూర్లలో ఆయన 5 వేధశాలలను నిర్మించాడు. జంతర్ మంతర్లుగా ఇవి బహుళ ప్రాచుర్యం పొందాయి. (జంతర్ మంతర్ అంటే గణక యంత్రం అని అర్థం). పని తీరులోనేగాక నిర్మాణ శైలి పరంగానూ జంతర్ మంతరులు వాటికవేసాటి. పరికరాలను ఉంచే భవనాలుగా కాకుండా, ఆ భవనాలే ఖగోళ పరికరాలుగా ఉపయోగపడేట్లు జైసింగ్ వాటికి రూపకల్పన చేశాడు. అర్ధగోళాలు, విలువంపులు, ఘనాలు, స్థూపాలు, త్రికోణాలు ఇలాంటి రకరకాల రేఖా గణిత ఆకృతుల మేళవింపుతో రూపొందిన జంతర్ మంతర్ లు ఈనాటికీ అత్యాధునిక భవిష్య కాలపు డిజైన్లను తలపిస్తాయి. ఈ విజ్ఞాన సౌధాలు చూడచక్కని నిర్మాణాలు. నిన్నగాక మొన్న ఉపగ్రహాలు వచ్చే వరకూ ఇవే ఖగోళ సంఘటనల కాలాన్ని లెక్కించడానికి ఉపకరించాయి.
జంతర్ మంతర్, జైపూర్ జైసింగ్ నిర్మించిన 5 అబ్జర్వేటరీలలోకీ అతి పెద్దది జైపూర్ లోని జంతర్ మంతర్. 1728-1734 మధ్యకాలంలో దీని నిర్మాణం జరిగింది. సువిశాలమైన ఉద్యానవనంలో ఎర్ర రాతితో కట్టిన ఈ వేదశాల 16 రకాల భారీ పరికరాల (యంత్రాల) సముదాయం. వీటిలో ఒకటైన 'లఘు సామ్రాట్ యంత్రం' జైపూర్ స్థానిక కాలాన్ని (20 సెకండ్ల తేడాతో) ఖచ్చితంగా లెక్కిస్తుంది. భూమధ్యరేఖ నుంచి నక్షత్రాలు, గ్రహాలు, ఎంత కోణంతో ఉన్నాయో 'చక్రయంత్రం'తో గణించేవారు. ఇక్కడ ఉన్న ఇతర పరికరాల ఖచ్చితత్వాన్ని జైప్రకాష్ యంత్రం నిర్థారిస్తుంది. జైసింగ్ తనే స్వయంగా దీన్ని కనిపెట్టాడని విశ్వసిస్తారు.12 భూభాగాలుగా ఉండే రాశి వలయ యంత్రాన్ని జాతక చక్రం వేయడానికి ఉపయోగించేవారు. దీనిలోని ఒక్కోభాగం ఒక్కోరాశికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రామ యంత్రం అనే మరో పరికరంతో ఆకాశమధ్యానికి, భూమ్యాకాశాలు కలిసే చోటుకు మధ్య వంపును కొలిచే వారు. 23 మీటర్ల ఎత్తు ఉండే సామ్రాట్ యంత్రంతో వర్షపాతాన్ని అంచనా వేసేవారు. ఇక్కడి ముఖ్య పరికరాలలో ‘ధ్రువ’, ‘దక్షిణ’, ‘నారివల్య’, ‘రాశివలయాస్’, ‘చిన్న సామ్రాట్’, ‘పెద్ద సామ్రాట్’, ‘పరిశోధక స్థానం’, ‘దిశా’, ‘చిన్న రాం’, ‘పెద్ద రాం’ యంత్రం, చిన్న ‘క్రాంతి’, పెద్ద ‘క్రాంతి’, ‘రాజ్ ఉన్నతాంశ’, ‘జై ప్రకాష్’, ‘దిగంత’ వంటి వాటిని చూడవచ్చు.జైసింగ్ నిర్మిత వేధశాలల్లో జైపూర్ అబ్జర్వేటరీ ఒక్కటే కాస్త దిలంగా ఉంది. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి. మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి: http://letustravel.weebly.com/jantar-mantar.html ఇది తమిళనాడు, ధర్మపురి జిల్లాలో కలదు. ఇది భౌగోళికంగా తమిళనాడులో ఉంది కాని బెంగళూరు నుండి వెళ్ళడం సులభం. ఇది ధర్మపురి నుండి 50 కి. మీ, సేలం నుండి 114 కి. మీ, బెంగళూరు నుండి 133 కి. మీ దూరంలో కలదు. ఇది నిజానికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది.
ఆకాశం నుండి దూకుతున్నట్లుండే ఈ జలపాతం, చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించడం దీని ప్రత్యేకత. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే ఈ ప్రదేశం సహజత్వానికి చేరువగా ఉంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. హోగెనక్కల్ కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. దాదాపుగా దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించదు. జలపాతానికి కిలోమీటర్ దూరంనుండే ఝుమ్మనే శబ్ధం వినిపిస్తుంది. ఆ శబ్ధం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడే. ముందుకెళ్ళే కొద్దీ శబ్ధం ఎక్కువవుతుంది. అప్పుడే మన మనోఫలకం మీద ఒక రూపం లీలగా రూపుదిద్దుకుంటుంది. తీరా దగ్గరికి వెళ్తే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. మనమేదో భ్రాంతిలో ఉన్నామా? శబ్ధంతాలూకు ట్రాన్స్ లో ఒక రూపాన్ని ఊహించుకుంటున్నామా? నిజంగా జలపాతాన్ని చూస్తున్నామా? అని గిల్లుకొని చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒకటి, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతున్నాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. హోగేనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్ కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు. ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ. హోగెనక్కల్ ట్రిప్ లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపున్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇది రాజస్థాన్, జైపూర్ పట్టణం నుండి 15 కి. మీ దూరంలో కలదు (బస్సు మార్గం). జైపూర్ కి కొత్తగా వచ్చిన ఎవరైనా ఇలాగే వెళతారు. నాహర్ గర్ కోట వెళ్ళడానికి ఒక సత్వర మార్గం (షార్ట్ కట్) కలదు. పాత బస్తీ నుండి ఇది కేవలం 3 కి. మీ దూరంలో కలదు (కేవలం నడక లేదా ద్విచక్ర వాహనం ద్వారా). ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటే పాతబస్తీకి వెళ్ళాక అక్కడ ఉండే బస్తీ వాసులని అడిగితే దారి చెపుతారు. నడుచుకుంటూ వెళ్ళడం మనకు ఒక మరిచిపోరాని అనుభూతి. పైకి వెళ్ళడానికి చక్కని రోడ్డు మార్గం కలదు. పైకి అలా నడుచుకుంటూ వెళుతుంటే సిటీ మొత్తం కొంచెం కొంచెంగా, పైకి వెళ్ళాక సిటీ మొత్తం కనిపిస్తుంది.
జైపూర్ నగరానికి మూడు వైపులా మూడు కొండలు మరియు వాటిమీద కోటలు ఉన్నాయి. ఈ మూడు కోటలు జైపూర్ నగరానికి కాపలాగా ఉన్నాయి. అందులో నాహర్ గర్ కోట కూడా ఒకటి. నాహర్ గర్ కోటను జైపూర్ రాజు సవాయ్ జయ్ సింగ్ నిర్మించారు. ఈ కోట నిర్మాణం 1734 లో పూర్తిచేయ బడింది, ఇక్కడి ప్రసిద్ధ గోడలు, కోట బురుజులను సవాయ్ మాధో సింగ్ మహారాజు 1880 లో పునర్నిర్మించారు. ఈ కోట, ఆరావళీ పర్వత శ్రేణుల మధ్యలో, శాస్త్రీయ అందమైన సమ్మేళనంతో, యూరోపియన్ శైలితో నిర్మించారు. దీనికి జైపూర్ రాకుమారుడు నాహర్ సింగ్ పేరుపెట్టారు. అతని ఆత్మ కోట నిర్మాణ పనికి అడ్డుపడిందని, అతనికి గుర్తుగా కోట ప్రాంగణం లోపల దేవాలయం నిర్మించిన తరువాత ఆత్మ శాంతి౦చిందని నమ్మకం. నాహర్ గర్ అంటే ‘పులుల నివాస స్థలం’ అని అర్ధం. ఈ కోటలో రాజులు, వారి కుటుంబీకులు వేసవి విడిదిగా ఉపయోగించే మాధవేంద్ర భవనం ఉంది. ఇపుడు ఈ ప్రాంతం ప్రసిద్ధ విహార స్థలం. చూడవలసినవి: కోట, మాధవేంద్ర భవన్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/nahargarh-fort.html ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణం నుండి 15 కి. మీ దూరంలో కలదు. ఇక్కడి ప్రధాన దైవం సుబ్రమణ్యస్వామి. మరుదమలై చేరుకున్నాక కొండ పైకి వెళ్ళడానికి రెండు మార్గాలు కలవు. ఒకటి రోడ్డు మార్గం మరియు రెండవది మెట్ల ద్వారా. మెట్ల ద్వారా వెళ్లాలనుకునే భక్తులు సుమారుగా 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. తమిళంలో మరుద అనేది చెట్టు మరియు మలై అంటే కొండ . ఇక్కడ ఉన్న కొండ ఎక్కువగా మరుద చెట్లతో ఉండడంవల్ల దీనికి మరుదమలై అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉండే సుబ్రమణ్యస్వామికి మరుదజలాపతి అనే పేరు కలదు. ఇక్కడ చూడవలసినది మరొకటి కూడా కలదు. అదే పామ్ బట్టి సిద్ధార్ గుహ. ఇది మరుదమలై గుడికి ఆగ్నేయ దిశగా కొంచెం కిందికి వెళితే వస్తుంది. ఈ గుహలోనే ఒక పాము సుబ్రమణ్యస్వామిని పూజిస్తూ, ధ్యానం చేస్తూ సిద్ధిని పొందిందని ఇక్కడి వారి విశ్వాసం. ఇక్కడ ఉన్న ఒక రాతి మీద పాము ఆకారం మనం చూడవచ్చు.
చూడవలసినవి: మరుదమలై గుడి, పామ్ బట్టి సిద్ధార్ గుహ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/maruthamalai-temple.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|