ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. ఇది బద్రినాథ్ నుండి 3 కి.మీ దూరంలో కలదు. బద్రినాథ్ నుండి ఇక్కడికి వాహనాలలో చేరుకోవచ్చు. ఈ గ్రామంయొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశం యొక్క చిట్టచివరి గ్రామం. దీని తరవాత టిబెట్ భూభాగం ప్రారంభం అవుతుంది. ఇక్కడ మంగోలియన్ ట్రైబల్ వారు నివసిస్తారు. మిలిటరీ పర్మిషన్ తోనే ఈ మాణా గ్రామంలోకి ప్రవేశించగలం. వసుధార జలపాతం ఇక్కడి నుండి 6 కి.మీ దూరంలో కలదు.
0 Comments
సంధ్యా సమయంలో మలి సంధ్య వెలుగులో గంగమ్మ తల్లికి ఇచ్చే హారతిని దర్శించుటకు భక్తులు ఆ సమయానికి అసంఖ్యాకంగా వచ్చి చేరుతారు. హరి-కి పైరీ ఘాట్ వద్ద నున్న ఆలయంలోనే కాక వరుసగా నది ఒడ్డున బారుతీరి ఉన్న దేవాలయములు, హరిద్వార్ లో ఉన్న ప్రతి దేవాలయం వారు ఇదే సమయానికి హారతిని ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఉదయం, సాయంత్రం ఇచ్చే గంగా హారతి జీవుల యొక్క మానసిక, ఆత్మశక్తులను ఉద్దరిస్తుందని, మరియు దినారంభానికి ఈ హారతి అత్యంత శుభశూచకమని భక్తుల విశ్వాసం. ఇక మలిసంధ్య సమయంలో జరిగే మహాహారతి తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వబడుతుందని చెబుతారు.
హరిద్వార్ యొక్క పవిత్రతను సంధ్యాసమయములలో ఇచ్చే హారతి మరింత ఇనుమడింప చేస్తుంది. ఆ సమయంలో భక్తులు చేసే ప్రార్థనలతో, హారతి ఇస్తూ, పూజారులు చేసే ఘంటరావాలతో ఆ ప్రాంగణం ఒక వింతైన, భక్తిపారవశ్యమైన స్థితిలో ఉండి భక్తుల ఒడలను గగర్పోడుస్తుంటుంది. 'ఈ మహాహారతిని' దర్శించే దృశ్యం వర్ణనాతీతంగా, అపూర్వమైన ఆధ్యాత్మిక సన్నివేశాలుగా వివరణ చేయవచ్చు. ఆధ్యాత్మిక పారవశ్యానికి, ఆత్మప్రక్షాళనను, భగవంతుని కటాక్షాన్ని భక్తునిపై ప్రసరింపచేసే ఈ అద్భుతమైన, 'మహాహారతిని ' ప్రతి భక్తుడు వీక్షించి ధన్యుడవవలసిందే. భక్తులు పూలసజ్జలో జ్యోతిని వెలిగించి సజ్జను గంగానది నీటిపై వదులుతారు. వేలమంది భక్తులు నిర్వహించే ఈ దృశ్యం స్వయంగా నక్షత్రాలే సామూహికంగా తరలివచ్చి గంగమ్మ తల్లి కాలికి నమస్కరించుతున్నాయా అన్నట్లుగా ఆ ప్రదేశం మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును. ఇది ఉత్తరాఖండ్, హరిద్వార్ జిల్లాలో కలదు. హరిద్వార్ కి 4 కి. మీ దూరంలో ఉన్న కన్ ఖాల్ ప్రదేశంలో శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వత శిఖరాన నెలకొని ఉన్నది ఈ మానసాదేవి అమ్మవారి ఆలయం. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహిస్తూ అల్లుడయిన పరమేశ్వరుడిని ఆహ్వానించుట జరగలేదు. సతీదేవి తండ్రి చేసిన అవమానానికి తట్టుకొనలేక ఆగ్రహావేశములతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకున్నది. అంతట శంకరుని శిష్యులు రౌద్రులై దక్షుడిని హతమార్చారు. అయితే పరమదయాళువు అయిన ముక్కంటి దక్షుడిని పునరుజ్జీవింప చేసిన చోటు. సతీదేవి ఆత్మాహుతి స్మారకంగా ఈ ఆలయం నిర్మించబడినది. నాగరాజు వాసుకి సతీమణి అయిన మానసాదేవికి ఈ ఆలయం అంకితమైనది. "మానస" అనగా "కోరిక". కోరికలు తీర్చే దేవతగా మానసాదేవి ప్రసిద్ధి చెంది ఉన్నది.
ఇంకా ఈ ఆలయం సమీపంలో అతి పురాతనమైన వృక్షములకు తోరాలు కట్టి తమ కోర్కెలు తీర్చమని దేవిని భక్తులు వేడుకుంటారు. భక్తులు ఈ ఆలయాన్ని నడక ద్వారా లేదా రోప్ వే ద్వారా చేరుకోవచ్చు. చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును. ఇది ఉత్తరాఖండ్, హరిద్వార్ జిల్లాలో కలదు. చాలా పురాతనమైన ఈ కన్ ఖాల్ హరిద్వార్ పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి 4 కి. మీ దూరంలో కలదు. దక్ష ప్రజాపతి ఆలయం, సతీ కుండంతో పాటు మహా వీరాంజనేయ ఆలయం ఉంది. స్థలమహత్యం ప్రకారం ..... దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెట్టి అందరినీ పిలిచి, తనని వ్యతిరేకించి వెళ్ళిన కూతురు సతీదేవిని, అల్లుడు శివుడ్ని పిలువకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. పుట్టింటి మీద మమకారంతో శివుడు వద్దంటున్నా వెళ్ళిన సతీదేవికి భంగపాటే జరిగింది. తండ్రి ఆగ్రహించి అల్లుడయిన శివుడ్ని ఘోరంగా దూషించాడు. అది విని భరించలేక యజ్ఞ కుండం లోకి దూకింది సతీదేవి. అది తెలిసిన శివుడు కాలరుద్రుడై యజ్ఞాన్ని ధ్వంసం చేసి మృతురాలైన సతీదేవి దేహాన్ని తీసుకొని శోకతప్త- హృదయుడై తిరగడంతో లోకాలు అల్లకల్లోలమయ్యాయి. ఆ ప్రళయాన్ని ఆపే ఉద్దేశ్యముతో శ్రీ మహా విష్ణువు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు సతీదేవి దేహం 52 శకలాలుగా చేధించబడినది. ఈ ఆలయ ప్రాంగణంలో సతీదేవి మృతదేహాన్ని మోసుకొని వెళ్తున్న శంకరుని విగ్రహం భక్తులని అమితంగా ఆకర్షిస్తుంది.
చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|