చూడవలసినవి: మ్యూజియం, పచ్చల సోమేశ్వరాలయం
వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. దీనిని 1994 లో పురావస్తు శాఖవారు పచ్చల సోమేశ్వరాలయం వెనుక భాగంలో నెలకొల్పారు. జిల్లాలో లభ్యమయిన శిలాసంపదను సేకరించి మ్యూజియంలో ఉంచారు. ముఖ్యంగా ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, వంటపాత్రలు, లిపి , దేవతా విగ్రహాలు, అప్పటి నాణేలు మొదలగునవి ఇక్కడ కళ్లకు కట్టినట్లు దర్శమిస్తాయి. ఈ మ్యూజియంలో 1 వ శతాబ్ధం నుండి 18 వ శతాబ్ధం వరకు శిలాశాసనాలు, ఆయుధాలు, శిల్పాలు పొందుపరచడం జరిగింది. ప్రతి సోమవారం సెలవు దినం. సందర్శన వేళలు : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు.
చూడవలసినవి: మ్యూజియం, పచ్చల సోమేశ్వరాలయం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లలో కలదు. ఇది నాగర్ కోయిల్ నుండి 20 కి. మీ దూరంలో తుకలే కు దగ్గరలో కలదు. ఇది వెలి కొండలకు అడుగు భాగంలో ఉంది. దీనిని 1601 వ సంవత్సరములో ఇరావి వర్మ కులశేకర పెరుమాళ్ నిర్మించాడు. ఒకప్పుడు ఇది ట్రావెన్ కోర్ లో భాగంగా ఉండేది. తరవాత ట్రావెన్ కోర్ రాజధానిని తిరువనంతపురం కు మార్చడం జరిగింది. భౌగోళికంగా ఇది తమిళనాడులో ఉన్నప్పటికినీ , దీని నిర్వహణను కేరళ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ ప్యాలెస్ మరియు మ్యూజియం మొత్తం చెక్కతోనే నిర్మించబడినది. ఇందులో ఆ కాలనాటి రాజులు వాడిన వివిధ వస్తువులను పదిలంగా భద్రపరిచారు. ఇందులో చెక్కతో చేసిన చాలా నిర్మాణాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. సందర్శన వేళలు ఉదయం 9 నుండి మద్యాహ్నం 1 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4.30 వరకు. ప్రతి సోమవారం సెలవు. సందర్శన రుసుము 25/- ఒక్కరికి. కెమేరాకు 25/- మరియు వీడియో కెమేరాకు 1500/-.
చూడవలసినవి: ప్యాలెస్ మరియు మ్యూజియం వసతి : నాగర్ కోయిల్ లో హోటల్స్ కలవు. అందుబాటు : తకలే నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. ఇందులో స్వామి వివేకానంద వివిధ ప్రదేశాలను దర్శించినప్పటి చిత్రాలు మరియు వాటి వర్ణన సవివరంగా హిందీ, ఇంగ్లీష్ మరియు తమిళ భాషలలో పొందుపరచడం జరిగింది. సందర్శన వేళలు ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ప్రవేశ రుసుము 10/-.
చూడవలసినవి: వాండరింగ్ మాంక్ ప్రదర్శన, మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. ఇందులో దక్షిణ భారత దేశానికి చెందిన వివిధ గుడుల యొక్క చిత్ర పటాలు మరియు పురాతన శిలా రూపాలు ఉన్నాయి. సందర్శన వేళలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు. అన్ని శుక్రవారాలు మరియు రెండవ శనివారాలు సెలవు దినాలు. ప్రవేశ రుసుము 5/-.
చూడవలసినవి: మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, తంజావూరులో కలదు. ఇందులో ఎంతో పురాతన కాలంనాటి తాళపత్ర గ్రంథాలున్నాయి. పురాతన కాలం నాటి ఆయుధాలు , కిరీటాలు , కృపాణాలు లాంటివి ఎన్నో భద్రం చేయబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యిదో విజ్ఞాన భాండాగారం. సంస్కృత గ్రంథాలు అనేకం గల ఇక్కడి సంగీత మహల్లో రాతి స్తంభాలు సరిగమ పదనిసలు తాకగానే వినిపిస్తాయి. 30 వేల వ్రాత ప్రతులు గల ఈ సరస్వతి మహల్ గ్రంథాలయంలో భారతీయ, యూరోపియన్ల భాషలకు సంబంధించిన ఆముద్రిత గ్రంథాలు వున్నాయి.
చూడవలసినవి: సరస్వతి మహల్, తంజావూర్ ప్యాలెస్ మ్యూజియం వసతి : తంజావూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : తంజావూర్ లో లోకల్ బస్సులు కలవు. వాస్తు శిల్పానికి శాస్త్రవిజ్ఞానానికి ప్రాచీన భారతావనిలో అవినాభావ సంబంధం ఉండేది. జైసింగ్ వేధశాలలు ఇందుకు ఇటీవలి నిదర్శనాలు. ఖగోళవేత్త మీర్జా ఉలుగ్ బేగ్ పరిశోధనలు 18వ శతాబ్దపు సవాయి జైసింగ్2 ను ఎంతగానో ప్రభావితం చేశాయి. జైపూర్ మహారాజైన జైసింగ్ కూడా స్వయంగా గొప్ప పండితుడు, ఖగోళ శాస్త్రవేత్త. ఉత్తరాది నగరాలైన ఢిల్లీ, ఉజ్జయిని, వారణాసి, మధుర, జైపూర్లలో ఆయన 5 వేధశాలలను నిర్మించాడు. జంతర్ మంతర్లుగా ఇవి బహుళ ప్రాచుర్యం పొందాయి. (జంతర్ మంతర్ అంటే గణక యంత్రం అని అర్థం). పని తీరులోనేగాక నిర్మాణ శైలి పరంగానూ జంతర్ మంతరులు వాటికవేసాటి. పరికరాలను ఉంచే భవనాలుగా కాకుండా, ఆ భవనాలే ఖగోళ పరికరాలుగా ఉపయోగపడేట్లు జైసింగ్ వాటికి రూపకల్పన చేశాడు. అర్ధగోళాలు, విలువంపులు, ఘనాలు, స్థూపాలు, త్రికోణాలు ఇలాంటి రకరకాల రేఖా గణిత ఆకృతుల మేళవింపుతో రూపొందిన జంతర్ మంతర్ లు ఈనాటికీ అత్యాధునిక భవిష్య కాలపు డిజైన్లను తలపిస్తాయి. ఈ విజ్ఞాన సౌధాలు చూడచక్కని నిర్మాణాలు. నిన్నగాక మొన్న ఉపగ్రహాలు వచ్చే వరకూ ఇవే ఖగోళ సంఘటనల కాలాన్ని లెక్కించడానికి ఉపకరించాయి.
జంతర్ మంతర్, జైపూర్ జైసింగ్ నిర్మించిన 5 అబ్జర్వేటరీలలోకీ అతి పెద్దది జైపూర్ లోని జంతర్ మంతర్. 1728-1734 మధ్యకాలంలో దీని నిర్మాణం జరిగింది. సువిశాలమైన ఉద్యానవనంలో ఎర్ర రాతితో కట్టిన ఈ వేదశాల 16 రకాల భారీ పరికరాల (యంత్రాల) సముదాయం. వీటిలో ఒకటైన 'లఘు సామ్రాట్ యంత్రం' జైపూర్ స్థానిక కాలాన్ని (20 సెకండ్ల తేడాతో) ఖచ్చితంగా లెక్కిస్తుంది. భూమధ్యరేఖ నుంచి నక్షత్రాలు, గ్రహాలు, ఎంత కోణంతో ఉన్నాయో 'చక్రయంత్రం'తో గణించేవారు. ఇక్కడ ఉన్న ఇతర పరికరాల ఖచ్చితత్వాన్ని జైప్రకాష్ యంత్రం నిర్థారిస్తుంది. జైసింగ్ తనే స్వయంగా దీన్ని కనిపెట్టాడని విశ్వసిస్తారు.12 భూభాగాలుగా ఉండే రాశి వలయ యంత్రాన్ని జాతక చక్రం వేయడానికి ఉపయోగించేవారు. దీనిలోని ఒక్కోభాగం ఒక్కోరాశికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రామ యంత్రం అనే మరో పరికరంతో ఆకాశమధ్యానికి, భూమ్యాకాశాలు కలిసే చోటుకు మధ్య వంపును కొలిచే వారు. 23 మీటర్ల ఎత్తు ఉండే సామ్రాట్ యంత్రంతో వర్షపాతాన్ని అంచనా వేసేవారు. ఇక్కడి ముఖ్య పరికరాలలో ‘ధ్రువ’, ‘దక్షిణ’, ‘నారివల్య’, ‘రాశివలయాస్’, ‘చిన్న సామ్రాట్’, ‘పెద్ద సామ్రాట్’, ‘పరిశోధక స్థానం’, ‘దిశా’, ‘చిన్న రాం’, ‘పెద్ద రాం’ యంత్రం, చిన్న ‘క్రాంతి’, పెద్ద ‘క్రాంతి’, ‘రాజ్ ఉన్నతాంశ’, ‘జై ప్రకాష్’, ‘దిగంత’ వంటి వాటిని చూడవచ్చు.జైసింగ్ నిర్మిత వేధశాలల్లో జైపూర్ అబ్జర్వేటరీ ఒక్కటే కాస్త దిలంగా ఉంది. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి. మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి: http://letustravel.weebly.com/jantar-mantar.html పొక్కిషం అంటే తమిళంలో ఖజానా అని అర్ధం. కానీ కోయంబత్తూర్ పొక్కిషంలో ఉన్నది బంగారమూ, వజ్రవైడూర్యాలూ , రత్నాలూ కాదు. పురాతన వస్తు సంపద . కోయంబత్తూర్ నగర శివారులోని ఈ మ్యూజియాన్నే స్థానికులు పొక్కిషంగా పిలుస్తారు. కోవై (కోయంబత్తూర్) లోని ఈ మ్యూజియం దేశంలోనే విశాలమైన ప్రాచీనమైన వాటిలో ఒకటిగా ప్రసిద్ధి. కోయంబత్తూర్ అర్ ఎస్ పురంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (IFGTB) 155 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలో 110 సంవత్సరాల చరిత్ర ఉన్న మ్యూజియం ఉంది. అదే పొక్కిషం మ్యూజియం. 19వ శతాబ్ధం తొలి రోజుల్లో ఆంగ్లేయ అటవీ అధికారి జె ఎస్ గాంపల్ పురాతన వస్తువులని సేకరించి చెన్నై లోని తన కార్యాలయంలోని ఓ గదిలో పెట్టేవాడు. కొద్దిరోజులకు అది ఒక చిన్నపాటి మ్యూజియంగా మారింది. కానీ ఆయన తరవాత వచ్చిన అధికారులెవరూ ఆ వస్తువుల గురించి పట్టించుకోలేదు. దాంతో ఆ మ్యూజియం కొద్ది రోజులకే మరుగున పడిపోయింది.
గాంపల్ తరవాత చాలా రోజులకు వచ్చిన ఫారెస్ట్ కన్జర్వేటర్ హారెస్ ఆర్చిబాల్డ్ గాస్ (హెచ్. ఎ . గాస్) మ్యూజియం పునరుద్దరణకు ఆసక్తి చూపాడు. అయితే ఆ మ్యూజియం ఏర్పాటుకు చెన్నై కంటే కోవై (కోయంబత్తూర్) అనువైన ప్రాంతమని గుర్తించాడు గాస్. దీనికి కారణం కోవై పరిసరాల్లో ఉండే వైవిధ్యమైన ప్రకృతి. దాంతో మ్యూజియాన్ని చెన్నై నుండి కోవైకి మార్చాడు. అప్పటినుండి తనకు కనిపించిన పురాతన వస్తువులన్నీ తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టేవాడు. రాళ్ళు. శిల్పాలు, కొయ్య బొమ్మలు, మొక్కలు, జంతు కళేబరాలు, సర్పాల చర్మాలు ...... ఇలా ఆయన సేకరించినవి వేల సంఖ్యలోనే ఉన్నాయి. మొదట వాటిని ఆటవీశాక కార్యాలయంలోనే పెట్టి ఉంచేవాడు. కానీ వస్తు సంపద పెరుగుతుండడంతో 1920లో ప్రస్తతం ఉన్న భవనాన్ని నిర్మించారు. గాస్ తరవాత వచ్చిన అధికారులు కూడా దీని అభివృద్ధికి కృషి చేసినప్పటికీ గాస్ సేవలకు గుర్తింపుగా ఈ మ్యూజియానికి ఆయన పేరే పెట్టారు. ఈ మ్యూజియాన్ని ప్రధానంగా జంతు, వృక్ష శాస్త్ర విభాలుగా విభజించవచ్చు. సాధు జంతువుల నుండి క్రూర మృగాలు , పురుగులూ , పక్షులూ.. ఇలా అన్ని రకాల ప్రాణుల అస్థిపంజరాలు , కళేబరాలు దీనిలో మనకు దర్శనమిస్తాయి. మొత్తం 456 రకాల చెట్లు ఈ మ్యూజియం ప్రాంగణంలో పెరుగుతున్నాయి. ఇవన్నీ మనదేశానికి చెందిన వృక్ష జాతులే కావడం మరో విశేషం. వందల ఏళ్ల కిందట ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతుల్ని తెలుసుకోవడానికి ఈ మ్యూజియం సందర్శన ఉపయోగపడుతుంది. ఇది కోయంబత్తూర్ లో , అవినాశి రోడ్డులో కలదు. ఇందులో భారత దేశం లోని వివిధ ప్రాంతాల వారు ఉపయోగించిన చేతి మగ్గాల వస్తువులు కలవు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు నూలు ఎలా వడికేవారో, బట్టలు ఎలా తయారు చేసేవారో చిత్రాల రూపంలో మనం ఇక్కడ చూడవచ్చు. ఆర్ట్ గాలరీ లో చూడ చక్కని కళాఖండాలు కలవు. ఫోటోలు తీసుకోవడం నిషేధం.
సందర్శన వేళలు : ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు రెండవ శనివారాలు మరియు ఆదివారాలు సెలవు. చూడవలసినవి: G D నాయుడు మ్యూజియం, V.O.C పార్క్ మరియు జూ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/kasturi-sreenivasan-trust-art-gallery-and-textile-museum.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలో కలదు. దీని సందర్శన మనకు ఒక ప్రత్యేక అనుభవాన్ని మిగిలుస్తుంది.ఆధునిక కంప్యూటరైజ్డ్ ప్రొజెక్షన్ వ్యవస్థ సహాయంతో దృశ్య ప్రదర్శన విద్యా విషయకంగా మరియు వినోదాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇంటరాక్టివ్ సైన్స్ మ్యూజియం, గ్రంధాలయం, కంప్యూటర్ సెంటర్, సమాచార ప్రాసెసింగ్ మరియు ఎనిమిది పరిశోధన విభాగాలను గురించిన ప్రచార సెల్, ఒక ప్రాసెసింగ్ ప్లానిటోరియం మరియు ఒక ఆడిటోరియం ఉంది. ఇక్కడన ఉన్న ఆడిటోరియం దేశంలోనే అతి పెద్ద ఆడిటోరియంలలో ఒకటి. దీని సామర్ధ్యం 1,350 మంది.
చూడవలసినవి: ప్లానిటోరియం, బిర్లా మందిర్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/birla-planetarium.html ఇది రాజస్థాన్, జైపూర్ పట్టణంలో టాంక్ రోడ్ నందు రామ్ నివాస్ గార్డెన్ కి దగ్గరలో కలదు. ఇది 1863 లో ప్రిన్స్ ఆల్బర్ట్ చేత ప్రారంభించబడినది. ఇది సర్ స్వింటన్ జాకబ్ చేత డిజైన్ చేయబడినది. దీనిని 1887 లో పబ్లిక్ మ్యూజియంగా ప్రజల సందర్శనార్ధం తెరువబడినది. ఇది రాజస్తాన్ రాష్టంలోనే పురాతన మ్యూజియం. దీనినే గవర్నమెంట్ సెంట్రల్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇందులో ఇక్కడి రాజుల వాడిన ఖడ్గాలు, దుస్తులు మరియు వస్తువులు భద్రపరచబడ్డాయి.
చూడవలసినవి: మ్యూజియం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/albert-hall.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|