చూడవలసినవి: మంకీ జలపాతాలు, అరియార్ డ్యాం
వసతి: పోల్లాచిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. ఇది పొల్లాచి నుండి 30 కి.మీ దూరంలోను మరియు అరియార్ డ్యాం నుండి 6 కి.మీ దూరంలోను కలదు. ఇది పొల్లాచి నుండి వాల్పరైకి వెళ్ళేదారిలో కలదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు జలపాతాల దగ్గరికి అనుమతించరు. అరియార్ డ్యాం నుండి 3 కి.మీ దూరం వెళ్ళిన తరవాత అటవీశాఖ వారి చెక్ పోస్ట్ కలదు. జలపాతాలకు వెళ్ళడానికి టికెట్ అక్కడే ఇస్తారు. ప్రవేశ రుసుము 15/-. జలపాతాల దగ్గర కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. దగ్గర ఒక కట్టె లాంటిది ఉంచుకుంటే మంచిది. లేకపోతే కోతులు బలవంతంగా మన దగ్గర ఉన్న వస్తువులను లాక్కుంటాయి. ఇక్కడి జలపాతాలు కొండల నడుమ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. వారాంతాల్లో చాలా మంది తమిళనాడు నుండే కాక కేరళ నుండి కూడా ఈ జలపాతాలను సందర్శిస్తారు.
చూడవలసినవి: మంకీ జలపాతాలు, అరియార్ డ్యాం వసతి: పోల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 23 కి.మీ దూరంలో కలదు. ఇది తిరుమూర్తి గుడికి దగ్గరలో కలదు. తిరుమూర్తి గుడి నుండి ఒక 20 నిమిషాల నడక ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు చేతిలో ఏదైనా కర్ర లాంటిది దగ్గర ఉంచుకుంటే కోతులు దగ్గరికి రావు. లేదంటే మనదగ్గర బ్యాగులను బలవంతంగా లాక్కోవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఇక్కడ స్నానం చేసిన తరవాత భక్తులు తిరుమూర్తిలోని గుడికి వెళతారు.
చూడవలసినవి: తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి గుడి, తిరుమూర్తి జలపాతం వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : తిరుమూర్తి గుడి నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలోని తిరుపరప్పు అనే గ్రామంలో కలదు. ఇది కన్యాకుమారి నుండి 60 కి. మీ దూరంలో కలదు. కన్యాకుమారి నుండి ముందుగా నాగర్ కోయిల్ చేరుకోవాలి. అక్కడి నుండి తకలే మరియు తకలే నుండి తిరుపరప్పు చేరుకోవాలి. తకలే నుండి తిరుపరప్పు వెళ్ళే దారిలో రోడ్డు కిరివైపులా రబ్బరు చెట్లు దర్శనమిస్తాయి. తిరుపరప్పు గ్రామం చేరుకున్నాక, అక్కడి నుండి ఒక పది నిమిషాల నడక ద్వారా తిరుపరప్పు జలపాతాలను చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న నీటి ప్రవాహం కొడయార్ నది నీటి ప్రవాహం. ఈ జలపాతాలు 50 అడుగుల ఎత్తునుండి పడుతున్నాయి. ఇక్కడికి తమిళనాడు నుండే కాక కేరళ నుండి కూడా చాలా సందర్శకులు వస్తుంటారు. జలపాతాల పక్కనుండి కొంచెం పైకి వెళితే బోటింగ్ చేయవచ్చు. బోటింగ్ గంటకి 100/-. ఇక్కడ ఒక శివుని దేవాలయం కూడా కలదు.
చూడవలసినవి: తిరుపరప్పు జలపాతాలు , శివాలయం వసతి : తిరుపరప్పు లో హోటల్స్ కలవు. అందుబాటు : తకలే నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, ధర్మపురి జిల్లాలో కలదు. ఇది భౌగోళికంగా తమిళనాడులో ఉంది కాని బెంగళూరు నుండి వెళ్ళడం సులభం. ఇది ధర్మపురి నుండి 50 కి. మీ, సేలం నుండి 114 కి. మీ, బెంగళూరు నుండి 133 కి. మీ దూరంలో కలదు. ఇది నిజానికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది.
ఆకాశం నుండి దూకుతున్నట్లుండే ఈ జలపాతం, చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించడం దీని ప్రత్యేకత. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే ఈ ప్రదేశం సహజత్వానికి చేరువగా ఉంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం. హోగెనక్కల్ కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్ళాలి. దాదాపుగా దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించదు. జలపాతానికి కిలోమీటర్ దూరంనుండే ఝుమ్మనే శబ్ధం వినిపిస్తుంది. ఆ శబ్ధం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడే. ముందుకెళ్ళే కొద్దీ శబ్ధం ఎక్కువవుతుంది. అప్పుడే మన మనోఫలకం మీద ఒక రూపం లీలగా రూపుదిద్దుకుంటుంది. తీరా దగ్గరికి వెళ్తే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. మనమేదో భ్రాంతిలో ఉన్నామా? శబ్ధంతాలూకు ట్రాన్స్ లో ఒక రూపాన్ని ఊహించుకుంటున్నామా? నిజంగా జలపాతాన్ని చూస్తున్నామా? అని గిల్లుకొని చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒకటి, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతున్నాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. హోగేనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్ కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు. ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ. హోగెనక్కల్ ట్రిప్ లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది. నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపున్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది. చాలా రోజుల నుండి కోవై కుట్రాలం వెళ్ళాలని అనుకున్నా, వేరే వేరే కారణాలవల్ల వెళ్ళలేక పోయాము. ఒకరోజు పేపర్ చదువుతుంటే ఈ సీజన్ లో ఈరోజు నుండే కోవై కుట్రాలంకు సందర్శుకులను అనుమతిస్తున్నారని తెలిసింది. (అంతకు మునుపు ఎందుకు సందర్శుకులను అనుమతించలేదంటే నీళ్ళు లేనందున. ఋతుపవనాలు మొదలవడం వల్ల ఈ మధ్య వర్షాలు పడడంతో నీటి ప్రవాహం పెరిగింది.) ఆరోజు బుధవారం కావడంతో వారాంతంలో వెళ్ళొచ్చు అని శనివారం ప్లాన్ చేసుకున్నాం. ఇది కోయంబత్తూర్ నుండి 30 కి.మీ దూరంలో కలదు. శనివారం ఉదయం బయల్దేరి అక్కడికి చేరుకునే సరికి 9 గంటలు అయింది.
అక్కడికి వెళ్ళాక తెలిసిందేమంటే ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 3.30 వరకు మాత్రమే సందర్శుకులకు ప్రవేశం. అప్పటికే అక్కడికి చేరుకున్న సందర్శుకులతో మాటలు కలిపాను. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు మరియు తినుభండారాలు సైతం ప్లాస్టిక్ ప్యాకింగ్ తో ఉంటే వాటిని లోనికి అనుమతించరు. అక్కడి నుండి ఒక 100 మీ. దూరంలో అటవీ శాఖ వారి చెక్ పోస్ట్ ఉందని, వాహనాలు అక్కడే పార్క్ చేయాలని, అక్కడి నుండి అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్ళాలని తెలిసింది. సరిగ్గా పది గంటలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు (ఒక్కరికి 50/-, కెమెరాకి 25/-). టిక్కెట్ తీసుకొని ముందుకు (100 మీ.) వెళ్లి అక్కడ బండి పార్క్ చేసాం. అక్కడ చిన్న చెక్ పోస్ట్ కలదు. అక్కడ మన వెంట తెచ్చుకున్న బ్యాగ్ లను మరియు ఇతర వస్తువులను చెక్ చేసారు. ఏవైనా ప్లాస్టిక్ కు సంబందించిన వస్తువులు ఉంటే అవి వల్ల దగ్గర ఉంచుకొని తిరిగి మనం వెళ్ళేటపుడు వారి దగ్గరి నుండి తీసుకోవచ్చు. మా బ్యాగ్ చెక్ చేసిన తర్వాత వెళ్లి బస్సులో కూర్చున్నాము. ఐదు నిమిషాల్లో బస్సు బయల్దేరింది. మార్గ మధ్యంలో అక్కడక్కడ చిన్న గుడిసెల సమూహాలు కనిపించాయి. ఇవి ఇక్కడ నివసించే ఆది వాసీలవి. బస్సు ఒక పది నిమిషాల్లో ఒక దగ్గర ఆగింది. అక్కడి నుండి ముందుకు బస్సు వెళ్ళడానికి మార్గం లేదు. అక్కడ నుండి ఒక అర కిలో మీటర్ నడిస్తే కోవై కుట్రాలం వాటర్ ఫాల్స్ వస్తాయి. బస్సు దిగి వడివడిగా నడక ప్రారంభించాం. ఆరోజు మేము వచ్చిన బస్సే మొదటిది. అందుకని ముందుగా వెళ్తే జన సాంద్రత తక్కువగా ఉంటుందని, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని త్వరత్వరగా వెళ్ళాము. కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక కొండ మీద నుండి నీళ్ళు ప్రవాహంలాగా వస్తున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కిందుగా నీళ్ళ ప్రవాహం. బ్రిడ్జ్ దాటి కుడి చేతి వైపు కిందికి మెట్లు దిగగానే కోవై కుట్రాలం కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడకు స్నానం చేయడానికి వస్తారు ఎందుకంటే ఈ నీటిలో ఔషద గుణాలు ఉంటాయని, వాటితో స్నానం చేస్తే చాలా రోగాలు నయమవుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇది బెంగలూర్ కి దగ్గరలో ఉంది . ఎలక్ట్రానిక్ సిటీ నుండి హోసూర్ వైపు వెళ్ళే దారిలో చందాపూర్ ఫ్లైఓవర్ దాటాక కుడి చేయి వైపు అనెకల్ వెళ్ళే దారి ఉంటుంది. అక్కడి నుండి ఒక 5-6 కి.మీ ప్రయాణం చేసాక ముత్యాలమడువు వస్తుంది.
ఇక్కడికి వెళ్ళాలని అనుకునేవాళ్ళు ఉదయం 7 లోపు వెళితే బాగుంటుంది. ఇక్కడ ప్రకృతి చాలా ప్రశాంతంగా, పక్షుల కిల కిల రావాలతో మసను హాయి గొలుపుతుంది. ముత్యాలమడువు చేరుకున్నాక ట్రెక్కింగ్ చేయాలనుకునేవారు పక్కనే ఉన్న కొండ పైకి ట్రెక్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చేవారు తమవెంట నీళ్ళు , ఆహారపదార్ధాలు తెచ్చుకుంటే మంచిది. చూడవలసినవి: ముత్యాలమడువు వాటర్ ఫాల్ వసతి : KSTDC వాళ్ళ రెస్టారెంట్ ఉంది. ముందుగా బుక్ చేసుకుంటే రూమ్స్ లభించవచ్చు. అందుబాటు : ఇక్కడికి బస్సు సౌకర్యం లేదు. సొంత వాహనాల మీద లేదా క్యాబ్స్ బుక్ చేసుకొని రావచ్చు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/muthyalamaduvu.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|