చూడవలసినవి: వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. ఇది ఆరు అంతస్తులుగా ఉంది. వాచ్ టవర్ పై నుండి చూస్తే కన్యాకుమారి చివరి భాగాన్ని మొత్తం ఒకేసారి చూడవచ్చు. సందర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. ప్రవేశ రుసుము 3/-.
చూడవలసినవి: వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
0 Comments
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. కామరాజర్ అస్తికలను కన్యాకుమారిలోని త్రివేణి సంగమంలో కలిపే ముందు ప్రజల సందర్శనార్ధం ఇక్కడ ఉంచారు.దానికి గుర్తుగా ఇక్కడ కామరాజర్ మెమోరియల్ నిర్మించడం జరిగింది. కామరాజర్ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పాలనలో ఇతనిని నల్ల గాంధీ అని పిలిచేవారు. ఇందులో కామరాజర్ జీవితంలోని వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు కలవు. ప్రవేశ సమయము ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు. ప్రవేశం ఉచితం.
చూడవలసినవి: కామరాజర్ మండపం, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు బీచ్ రోడ్ లో కలదు. దీనిని 1956 లో జాతిపిత అయిన మహాత్మాగాంధి జ్ఞాపకార్ధంగా దీనిని నిర్మించారు. మహాత్మాగాంధి అస్తికలను కన్యాకుమారిలోని త్రివేణి సంగమంలో కలిపే ముందు ప్రజల సందర్శనార్ధం ఇక్కడ ఉంచారు. మహాత్మాగాంధి 1925 లో మరియు 1937 లో, రెండు సార్లు కన్యాకుమరిని దర్శించారు. 1948 లో గాంధిజీ అస్తికలను కన్యాకుమారిలోని సముద్రజలాలో కలిపారు. దానికి గుర్తుగా ఇక్కడ మహాత్మాగాంధి మెమోరియల్ నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణపు ఆకారం యొక్క పైకప్పు 78 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఇది (79) గాంధీజీ యొక్క వయసును (చనిపోయేనాటికి) సూచిస్తుంది. ఇందులో గాంధీజీ జీవితంలోని వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు కలవు. ప్రవేశ సమయము ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు. ప్రవేశం ఉచితం.
చూడవలసినవి: గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో వివేకానంద రాక్ మెమోరియల్ పక్కన ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ సౌకర్యం కలదు (ఉదయం 8 నుండి సాయత్రం 4 వరకు మాత్రమే). వివేకానంద రాక్ మెమోరియల్ దర్శించుకున్న తరవాత యాత్రికులను ఫెర్రీలో తిరువల్లువార్ విగ్రహం దగ్గరికి తీసుకువెళ్తారు. ఇది సముద్ర తీరంనుండి 200 మీటర్ల దూరంలో, సముద్రంలో ఒక పెద్ద రాయిపైన దీనిని నిర్మించారు.
తిరువల్లువార్ తమిళనాడుకు చెందిన సుప్రసిద్ధ కవి, తిరుక్కురళ్ ను రచించినవాడు. తిరువల్లువార్ విగ్రహ పీఠభాగం 38 అడుగుల ఎత్తు, తిరువల్లువార్ విగ్రహం 95 అడుగుల ఎత్తు , మొత్తంగా 133 అడుగుల ఎత్తులో ఇది మనకు దర్శనమిస్తుంది. విగ్రహ పీఠభాగాన్ని లోపల మూడు అంతస్తులుగా నిర్మించారు. లోపల నుండి విగ్రహం దగ్గరకు వెళ్ళడానికి వీలుగా 140 మెట్లు ( 70 పైకి ఎక్కడానికి, 70 కిందికి దిగడానికి ) నిర్మించారు. విగ్రహం బరువు 2000 టన్నులు మరియు మొత్తం నిర్మాణం బరువు 7000 టన్నులు. సందర్శన వేళలు: ఉదయం 8 నుండి సాయంతం 4 గం వరకు మాత్రమే. చూడవలసినవి: వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కన్యాకుమారి నుండి ఫెర్రీ సౌకర్యం కలదు ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి పట్టణము నందు అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ సౌకర్యం కలదు (ఉదయం 8 నుండి సాయత్రం 4 వరకు మాత్రమే). ఇది సముద్ర తీరంనుండి 200 మీటర్ల దూరంలో, సముద్రంలో ఒక పెద్ద రాయిపైన కలదు.
స్వామి వివేకానంద తనకు కాళికాదేవిపైన భక్తి ప్రేరణతో తపస్సు చేయుటకు కన్యాకుమారి ఒడ్డుకు చేరినాడు. సముద్రంపై అక్కడ ఉన్న రాయిని చేరాడు. అక్కడ మూడు రాత్రుళ్లు, మూడు పగళ్ళు ధ్యానంలో కూర్చొనినాడు. అక్కడ ఉన్న శ్రీ పాదశిల క్రమముగా వివేకానంద శిలగా మారింది. వివేకానంద మండపము ప్రధాన ద్వారములకు రెండు ప్రక్కలా నల్లరాతి ఏనుగులు, దూలములపై సాంప్రదాయక చిహ్నమైన గజపూర్ణ కుంభం చెక్కినారు. మండపములోని గదులలో శ్రీ రామకృష్ణ పరమహంస , శ్రీ శారదాదేవి యొక్క సజీవం అనిపించే చిత్ర పటములు కలవు. ధ్యాన మందిరంలో ఓం గుర్తును ప్రణవ పీఠంపై ప్రతిష్టించబడినది. ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రకృతి అందాలను చూసి ఆనందించవలసిందే కాని వర్ణించరానిది. చూడవలసినవి: వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కన్యాకుమారి నుండి ఫెర్రీ సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లాలో కలదు. ఇది హొసూరు నుండి 10 కి.మీ దూరంలో ఒన్నల్ వాడికి సమీపంలో, తోరపల్లి గ్రామంలో కలదు. ఇది చక్రవర్తి రాజాజీ పుట్టిన ఇల్లు. రాజాజీ అంటే రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. రాజాజీ గారు వకీలుగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయనాయకుడిగా, రచయితగా మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కూడా పనిచేసారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి మఖ్యమంత్రిగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పనిచేసారు. రాజాజీ గారు స్వాతంత్ర పార్టీ అనే దానిని స్థాపించారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందుకున్నవారిలో ప్రథముడు. రాజాజీగారు పుట్టిన ఇల్లును తమిళనాడు ప్రభుత్వంవారు రాజాజీ మెమోరియల్ గా మార్చారు. ఇందులో రాజాజీ గారి జీవత కాలంలో వివిధ ఘట్టాలను తెలిపే ఫోటోలు ఉన్నాయి. ఈ ఇంటిలో రాజాజీ గారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనం చూడొచ్చు.
చూడవలసినవి: రాజాజీ మెమోరియల్ వసతి : హొసూరు లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : హొసూరు నుండి ఒన్నల్ వాడికి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/thorapalli.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|