ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు గోనాగ చతుర్ముఖుడుగా రూపుదిద్దుకున్నాడు. ఈ సారి సామివారి విగ్రహానికి ఇరువైపులా రెండు విగ్రహాలను ఏర్పాటు చేసారు. స్వామివారి కుడి వైపు రాములవారి విగ్రహం మరియు ఎడమవైపు భువనేశ్వరి మాత విగ్రహాలు కలవు. ఈ రెండు విగ్రహాలను యాదగిరి గుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లోటస్ ఆలయంలో ఏర్పాటు చేసే మ్యూజియంలో ఉంచేందుకు తరలిస్తున్నారు.
0 Comments
ఉప్పల్ లోని వెలుగు గుట్ట మీద శ్రీ దుర్గా మల్లిఖార్జున స్వామి దేవాలయం కలదు. ఈ రోజు సాయంత్రం ఆ గుట్ట మీద నుండి కనిపించిన సూర్యాస్తమయం.
ఇది తమిళనాడు, రామంతాపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరంలోని రామనాథ స్వామి గుడి ముందుగా 100 మీటర్ల దూరంలో కలదు. రామేశ్వరం చేరుకున్న భక్తులు ముందుగా అగ్నితీర్థంలో స్నానమాచరించాలి. (అగ్ని తీర్థం అనగా గుడి ముందుగా ఉన్న సముద్రం). తరవాత గుడిలో ఉన్న 22 బావులలోని పవిత్ర జలాలతోని స్నానం చేసిన తరవాతనే స్వామి వారిని దర్శించుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.
చూడవలసినవి: అగ్ని తీర్థం వసతి : రామేశ్వరంలో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రామేశ్వరం గుడి నుండి నడక ద్వారా చేరుకోవచ్చు. సంధ్యా సమయంలో మలి సంధ్య వెలుగులో గంగమ్మ తల్లికి ఇచ్చే హారతిని దర్శించుటకు భక్తులు ఆ సమయానికి అసంఖ్యాకంగా వచ్చి చేరుతారు. హరి-కి పైరీ ఘాట్ వద్ద నున్న ఆలయంలోనే కాక వరుసగా నది ఒడ్డున బారుతీరి ఉన్న దేవాలయములు, హరిద్వార్ లో ఉన్న ప్రతి దేవాలయం వారు ఇదే సమయానికి హారతిని ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఉదయం, సాయంత్రం ఇచ్చే గంగా హారతి జీవుల యొక్క మానసిక, ఆత్మశక్తులను ఉద్దరిస్తుందని, మరియు దినారంభానికి ఈ హారతి అత్యంత శుభశూచకమని భక్తుల విశ్వాసం. ఇక మలిసంధ్య సమయంలో జరిగే మహాహారతి తల్లికి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వబడుతుందని చెబుతారు.
హరిద్వార్ యొక్క పవిత్రతను సంధ్యాసమయములలో ఇచ్చే హారతి మరింత ఇనుమడింప చేస్తుంది. ఆ సమయంలో భక్తులు చేసే ప్రార్థనలతో, హారతి ఇస్తూ, పూజారులు చేసే ఘంటరావాలతో ఆ ప్రాంగణం ఒక వింతైన, భక్తిపారవశ్యమైన స్థితిలో ఉండి భక్తుల ఒడలను గగర్పోడుస్తుంటుంది. 'ఈ మహాహారతిని' దర్శించే దృశ్యం వర్ణనాతీతంగా, అపూర్వమైన ఆధ్యాత్మిక సన్నివేశాలుగా వివరణ చేయవచ్చు. ఆధ్యాత్మిక పారవశ్యానికి, ఆత్మప్రక్షాళనను, భగవంతుని కటాక్షాన్ని భక్తునిపై ప్రసరింపచేసే ఈ అద్భుతమైన, 'మహాహారతిని ' ప్రతి భక్తుడు వీక్షించి ధన్యుడవవలసిందే. భక్తులు పూలసజ్జలో జ్యోతిని వెలిగించి సజ్జను గంగానది నీటిపై వదులుతారు. వేలమంది భక్తులు నిర్వహించే ఈ దృశ్యం స్వయంగా నక్షత్రాలే సామూహికంగా తరలివచ్చి గంగమ్మ తల్లి కాలికి నమస్కరించుతున్నాయా అన్నట్లుగా ఆ ప్రదేశం మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. చూడవలసినవి: దక్ష ప్రజాపతి ఆలయం, గంగా మాత ఆలయం, మానసా దేవి ఆలయం వసతి : హరిద్వార్ లో చాలా హోటల్స్ మరియు సత్రాలు కూడా కలవు. అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి ఆటోలు మరియు రిక్షాలు లభించును. 55వ సంవత్సరపు పండ్ల ప్రదర్శన కూనూర్ లోని సిమ్స్ పార్క్ లో వేలాది మంది ప్రజలు మరియు యాత్రికుల మద్య అట్టహాసంగా ప్రారంభమైనది. స్వాగత ద్వారాన్ని వివిధ రకాల పండ్లతో తయారు చేశారు. ఈ ప్రదర్శనకు ముఖ్య ఆకర్షణ 24 ఫీట్ల ఎత్తు మరియు 34 ఫీట్ల వెడల్పు కల్గిన సీతాకోక చిలుక . దీని తయారీకి 3,500 కిలోల వివిధ రకాల పండ్లను ఉపయోగించారు. అందులో ద్రాక్ష, ఆపిల్, బత్తాయి, పైన్ ఆపిల్ మొదలైన పండ్లు కలవు.
మనకు పండ్లతో జ్యూస్ చేసుకోవడము లేదా వాటిని అలాగే తినడం తెలుసు. కాని పండ్లతో వివిధ రకాల ఆకృతులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అందులో సీతాకోక చిలుక, డ్రాగన్ , పాము, కుందేలు, పెంగ్విన్ మొదలుగునవి. చూడవలసినవి: పండ్ల ప్రదర్శన వసతి : కూనూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/miscellaneous.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|