ఇది ఉప్పల్ లోని స్టేడియంకు దగ్గరలో కలదు. వెలుగు గుట్ట అని అడిగితే ఎవరైనా చెబుతారు. ఇక్కడ శివాలయంతో పాటు ఆంజనేయస్వామి గుడి మరియు అమ్మవారి గుడి కలదు. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉన్నదని ఇక్కడ పూజారి చెప్పారు. అది నిజాం కాలం. ఇప్పుడు ఉప్పల్ ఉన్న ప్రాంతం అప్పుడు అటవీ ప్రాంతం. ఇక్కడికి నిజాం నవాబులు గుర్రం మీద విహారానికి వచ్చేవారట. నిజాం ప్రభువులకు తెలియకుండా కొందరు యాదవులు ఇక్కడ గొర్రెలు కాచుకునేవారట. ఒకరోజు ఇద్దరు యాదవులకు రెండు గుండ్ల మధ్య ఒక శివలింగం కనిపించింది. అప్పటి నుండి ఆ ఇద్దరు యాదవులు సంవత్సరానికి ఒక రోజు అక్కడ దీపం వెలిగించి పూజించేవారట. తదనంతర కాలంలో ఈ ఉప్పల్ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ గా మార్చారు. ఇక్కడ ఉన్న సర్పంచులు ఈ వెలుగు గుట్ట ప్రాంతాన్ని శివుడి ఆలయం కోసం కేటాయించారు. తరవాత కొంత మంది దాతల సహాయంతో ఈ గుడిని నిర్మించారు. ఇక్కడి అమ్మవారి ఆలయంలో అష్టాదశ శక్తి పీఠముల యొక్క దేవతా మూర్తులతో వివరాలను కూడా ఇక్కడ పొందుపరచారు. ఇక్కడ కొండ మీద శ్రీ కోందండ రామస్వామి ఆలయం కూడా కలదు. దీనిని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దాతలు ఎవరైనా ఈ ఆలయపు నిర్మాణానికి సహకరించగలరని మనవి.
0 Comments
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరులోని రేస్ కోర్స్ రోడ్డులో కలదు. దీనిని 1979 లో అప్పటి శృంగేరి శారద మఠం పీఠాధిపతి నిర్మించారు. ఇక్కడ అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి. అమ్మవారి ఆలయానికి చెరొక వైపు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కలవు. ఇక్కడ దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఆ తొమ్మిది రోజులు ఈ ఆలయం బొమ్మల కొలువుతో మరియు భజనలతో చూడ ముచ్చటగా ఉంటుంది.
చూడవలసినవి: శారదాంబల్ కోయిల్, రేస్ కోర్స్ రోడ్డు వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి పొల్లాచ్చికి వెళ్ళే మార్గంలో, 13 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ముందుగా మనకు విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఆలయం ఆవరణలో గణపతి మరియు ఆంజనేయస్వామి దేవాలయాలు కలవు. ఈ ఆలయంలో మనం ముగ్గురు అమ్మలను (సరస్వతి , లక్ష్మి మరియు పార్వతి ) ఒకే చోట చూడవచ్చు. సందర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్ర్రి 8.30 గంటల వరకు.
చూడవలసినవి: మహాలక్ష్మి ఆలయం మరియు ఎచనారి ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 30 కి.మీ దూరంలో కల కార్మడై గ్రామలో కలదు. ఇది రంగనాథర్ కోయిల్ పక్కనే కలదు. ఇక్కడి నంజుడేశ్వరర్ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ గుడి సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయంలోని శివలింగం ఎరుపు రంగులో ఉంటుంది. తమిళంలో నంజు అంటే విషం. అమృత మథనం సమయంలో మొదటగా వచ్చిన హాలాహలాన్ని శివుడు తన గొంతులో ఉంచుకుంటాడు. దానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మించబడినది. సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు.
చూడవలసినవి: నంజుడేశ్వరర్ ఆలయం , రంగనాథర్ కోయిల్ మరియు టెన్ తిరుపతి వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 30 కి.మీ దూరంలో గల కార్మడై అనే గ్రామంలో కలదు. ఇక్కడ ప్రధాన దైవం విష్ణువు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ రథోత్సవం నిర్వహిస్తారు. అప్పుడు చుట్టుపక్కల ప్రదేశాల నుండి చాలా మంది భక్తులు వస్తారు. ఈ గుడి ఆవరణలో ఆది శంకరాచార్యులవారికి కూడా ఒక గుడి కలదు. గుడికి కొంచెం దూరంలో ఒక కొలను కలదు. ఆ కొలనులోని చేపలకు భక్తులు ఆహారాన్ని ఇస్తుంటారు.
చూడవలసినవి: రంగనాథర్ కోయిల్, టెన్ తిరుపతి వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 30 కి.మీ దూరంలో కలదు. మొదటగా పూండి చేరుకోవాలి. అక్కడ ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాక, వెల్లియంగిరి కొండల మీద ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడికి అన్ని సమయాలలో అనుమతి లేదు. కేవలం చైత్రమాసంలో (ఉగాది నుండి ఒక నెల రోజుల వరకు) మాత్రమే అనుమతిస్తారు. మొతం ఏడు కొండలు కలవు. ఏడు కొండల తరవాత శివాలయం వస్తుంది. వెళ్ళడం కొంచెం కష్టమే. చాలా మంది భక్తులు రాత్రివేళ బయలుదేరి, దర్శనం చేసుకొని ఉదయం వరకల్లా కిందికి చేరుకుంటారు. ఎందుకంటే రాత్రి వేళలో వాతావరణం చల్లగా ఉండడం వలన మనకు అంతగా బడలికగా అనిపించదు. ఒకవేళ ఉదయం బయలు దేరినట్లయితే, ప్రయాణం మద్యాహ్నం చేయాల్సి ఉంటుంది, అందులోనూ చాలా వేడిగా ఉండడం వలన, భక్తులు రాత్రివేళల్లో బయలుదేరుతారు. కొండలపైకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఒక వెదురు కర్ర లాంటిది తీసుకెళతారు. ఎందుకంటే కొండలు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ కర్ర సహాయం చాలా అవసరం. భక్తులు శివుడి దర్శనం తరవాత, కిందికి వచ్చాక ఆ కర్రని ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తారు. చూడవలసినవి: శివాలయం, కొండ కింద గల శివాలయం, ధ్యాన లింగ వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 30 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇది వెల్లియంగిరి కొండల అడుగు భాగంలో కలదు. వెల్లియంగిరి కొండల మీద (మొత్తం 7 కొండలు) కూడా ఒక శివాలయం ఉన్నది. మొదటగా దీనిని దర్శించుకున్న తరవాత కొండల మీదున్న శివుడిని దర్శించుకుంటారు. కొండలపైన ఉన్న గుడిని చూసి రావడానికి కనీసం 8-10 గంటల సమయం పడుతుంది. కావున చాలా మంది భక్తులు కొండల కింది భాగంలో ఉన్న శివుని గుడి వద్ద బస చేస్తారు.
చూడవలసినవి: వెల్లియంగిరి ఆండవార్ కోయిల్, కొండలపైన గల దేవాలయం, ధ్యాన లింగ వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది పొల్లాచిలోని ఎస్.ఎస్. కోయిల్ వీధిలో కలదు. ఈ గుడి 300 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెపుతారు. ఈ ఆలయపు గోపురం మీద గాంధీ, రామకృష్ణ పరమహంస మరియు బుద్దుడి ప్రతిమలు కలవు. ఆలయంలోని శిల్ప కళా సంపద మనల్ని ఆకట్టుకుంటుంది. ఆవు మరియు ఏనుగు రెండు ఉన్న ఒకే ప్రతిమలో రెండింటికి కలిపి ఒకే తల ఉండటం విశేషం.
చూడవలసినవి: అమ్మన్ కోయిల్ వసతి: పోల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచిలో లోకల్ బస్సు సౌకర్యం కలదు. ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. పానగల్లు పట్టణం శిల్పకళా సంపదకు నిలయం. కుందూరు చోడుల కాలంలో ఇక్కడ నిర్మించిన ఛాయసోమేశ్వరాలయం ప్రముఖమైనది. ఈ ఆలయం చుట్టూ గర్భగుడిలున్న దేవాలయం ఉన్నది. దీనిని త్రికుటాలయం అని పేర్కొంటారు. గర్భాలయంలో శివలింగం కనిపిస్తుంది. పూర్వం ఈ లింగం చుట్టూ నీరు పారుతూ పొలాలకు వెళ్లేదని పూర్వీకులు చెప్పుకునేవారు. అయితే నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తున్నా ఎక్కడికి వెళ్తుందన్న విషయం అర్థమయ్యేది కాదు. ఈ నీళ్లలో మునిగిన లింగంపై అన్ని కాలాలలో, అన్ని సమయాలలో స్తంభాకారంలో ఒక ఛాయ కనిపి స్తుంది. ఈ నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ మాత్రం కదల కుండా కనిపిస్తుంది. ఈ ఛాయ వలనే ఛాయసోమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది.
ఇదిలా ఉంటే పురాణాలలో ఛాయ అంటే నీడ కాకుండా ఛాయాదేవి సూర్యూడి భార్యగా, శనేశ్వరుడి తల్లి అని చెప్పుకునే వారు. అందుకే ఎక్కువ మంది ఇప్పటికీ ఛాయాసోమశ్వర ఆలయంలో అనేకమంది శనిపూజలు జరిపించుకుంటున్నారు. ఈ దేవాలయంలో పూజలు నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడినాయి. రుద్రమదేవ మహారాజు పుణ్యముకై తాంత్రపాలుడు మల్లినాయకుడు ఉదయాదిత్య సముద్రం వెనుక అభినవ సోమనాథ పూజకై దానం చేసినట్లు ఒక శాసనం కలదు. ఈ అభినవ సోమనాథుడే ఛాయాసోమేశ్వరుడు. కాకతీయుల సామంత రాజైన శరపాణి దేవుడు ఛాయా సోమనాథుడిని అంగరంగ భోగాలకై తమ్మ సముత్రు, ఉదయ సముద్రం వెనుక దానం చేసినట్లుగా ఒక శాసనమున్నది. ఇతడే స్వామికి ద్వాదశ నివర్తనముల భూమినిచ్చినట్లు మరో శాశనంలో ఉంది. కాకతీయకుమార రుద్రమదేవ మహారాజుల రాజ్య కాలంలో సామంతుడగు మల్లికార్జున నాయకుడు తన రాజుకు పుణ్యంగా ఛాయాసోమనాథ దేవరకు ఉదయ సముద్రం దానమిచ్చినట్లు మరో శాసనంలో ఉంది. చూడవలసినవి: ఛాయా సోమేశ్వర ఆలయం , పచ్చల సోమేశ్వరాలయం, మ్యూజియం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. ఇది పానగల్లు మ్యూజియంకు ముందు భాగంలో కలదు.ఇది అన్యమతస్తుల దుశ్చర్యలకు గురైనట్లు తెలుస్తున్నది. దేవాలయం పైభాగం సింహ ద్వారంలోని గజేంవూదుల తొండాలు దెబ్బతిని కనిపిస్తున్నాయి. ఈ ఆలయం నల్లరాతితో నిర్మించబడినది. రామాయణ, మహాభారతాది ఘట్టాలతో సహా ఎన్నో శిల్పాలు ఈ ఆలయ ప్రాకారాలందూ గోడలపై చెక్కబడినాయి. పచ్చల సోమేశ్వ రాలయ పునరుద్ధరణకు 1923లో నిజాం ప్రభువు ప్రధాన మంత్రైన మహారాజు సర్కిషన్ ప్రసాద్ బహుద్దర కృషి చేసినాడు. ఈ ఆలయంలోని లింగమునకు ఒక పెద్ద మచ్చ(రత్నం) పాదగబడి ఉండేనని, దేవుడి ఆలంకరణకు పచ్చల హారాలు వేయించి ఉండే వారని, తద్వారా దీనికి పచ్చల సోమేశ్వర ఆలయమనే పేరు వచ్చిందని తెలుస్తున్నది. ఇక్కడే మరొక వైష్ణవ ఆలయం ఉన్నదు. పైరెండు ఆలయాలకన్నా ఇది కొంచే ఆధునిక తపం. ప్రస్తుతం ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ అష్టధిక్పాలక శిల్పములు, బుగ్వేదమునందు ప్రధాన దేవతలుగా ఇంద్ర, అగ్రి, వర్ణ, కుబేరా, వాయువులు స్తుతించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రాచీన నగరాల్లో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ.శ 11-12 శతాబ్ధాలలో కందూరు చోళుల రాజధానిగా ఉండేది. ఇక్కడ కాకతీయులకు సామంతులైన కందూరు చోళులు పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు. నల్ల శానపు రాళ్ళపై రమ్యంగా మలచిన శిల్పాలు, ఆలయాలు, మధ్యయుగ వాస్తు శిల్ప సాంప్రదాయాలకు అడ్డం పడుతున్నాయి. తూర్పు వైపున ఒకటి, పశ్చిమం వైపున మూడు ఆలయాలను 70 స్తంభాలతో నిర్మించిన మహామండపం కలుపుతూ ఉంది. ఆలయం గోడలపైన, మండపం స్తంభాలపైన చెక్కిన శివ, అష్టదిక్పాల, భారత, రామాయణ గాథలు, సమకాలీన జీవన విదానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. చూడవలసినవి: పచ్చల సోమేశ్వరాలయం,మ్యూజియం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|