ప్రపంచాన్ని చూసినట్లే
కోవై నగరవాసులకు ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. అదేమంటే ఏ రోజైతే కోవై పూర్తి కట్టడాలతో మారిపోతుందో.. అప్పుడు శ్రీకృష్ణుడు తిరిగి జన్మించి అలాంటి నిర్మాణాలు చేసిన వారిని శిక్షిస్తాడని, ఈ నమ్మకం ఉండబట్టే ఇంకా కోవై పచ్చని చెట్లతో అలరారుతోందని వారి విశ్వాసం.
సరే ఇక ఈ రోడ్డుకు వస్తే ప్రపంచాన్ని ఎలా చూసినట్లు అవుతుందో చెప్పుకుందాం. వాకర్లు నడిచే కుడి-ఎడమ వైపు పెంచిన పచ్చిక బయళ్ళలో ప్రపంచంలోని అతి సుప్రసిద్దమైన భవంతుల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేసారు. ఎర్రకోట (రెడ్ ఫోర్ట్ ), సెల్యూలర్ జైలు, బహాయి టెంపుల్, ఒక పక్కకు ఒరిగి ఉన్న పీసా గోపురం,హవా మహల్ , ఈఫిల్ టవర్, రాష్ట్రపతి భవనం ఇలా అనేక ప్రముఖ కట్టడాల నమూనాలు ఈ పచ్చిక బయళ్ళలో అందంగా అలంకరించారు. వీటిని చూస్తుంటే ఆయా దేశాలకు వెళ్లి వాటి ముందు నిల్చొని చూస్తున్న భావన కల్గేలా వీటిని నిర్మించారు. కోవై వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ రేస్ కోర్స్ రోడ్ లో ఒకసారి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరిగి చూడాల్సిందే. అంతటి సౌందర్యం కోయంబత్తూర్ లోని ఈ రోడ్డుకు మాత్రమే సొంతం.