చూడవలసినవి: ప్యాలెస్ మరియు మ్యూజియం
వసతి : నాగర్ కోయిల్ లో హోటల్స్ కలవు.
అందుబాటు : తకలే నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లలో కలదు. ఇది నాగర్ కోయిల్ నుండి 20 కి. మీ దూరంలో తుకలే కు దగ్గరలో కలదు. ఇది వెలి కొండలకు అడుగు భాగంలో ఉంది. దీనిని 1601 వ సంవత్సరములో ఇరావి వర్మ కులశేకర పెరుమాళ్ నిర్మించాడు. ఒకప్పుడు ఇది ట్రావెన్ కోర్ లో భాగంగా ఉండేది. తరవాత ట్రావెన్ కోర్ రాజధానిని తిరువనంతపురం కు మార్చడం జరిగింది. భౌగోళికంగా ఇది తమిళనాడులో ఉన్నప్పటికినీ , దీని నిర్వహణను కేరళ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ ప్యాలెస్ మరియు మ్యూజియం మొత్తం చెక్కతోనే నిర్మించబడినది. ఇందులో ఆ కాలనాటి రాజులు వాడిన వివిధ వస్తువులను పదిలంగా భద్రపరిచారు. ఇందులో చెక్కతో చేసిన చాలా నిర్మాణాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. సందర్శన వేళలు ఉదయం 9 నుండి మద్యాహ్నం 1 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4.30 వరకు. ప్రతి సోమవారం సెలవు. సందర్శన రుసుము 25/- ఒక్కరికి. కెమేరాకు 25/- మరియు వీడియో కెమేరాకు 1500/-.
చూడవలసినవి: ప్యాలెస్ మరియు మ్యూజియం వసతి : నాగర్ కోయిల్ లో హోటల్స్ కలవు. అందుబాటు : తకలే నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
హవా మహల్, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్, పాతబస్తీలోని జొహారీ బజార్ లో కలదు. దీన్ని మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ 1799 సంవత్సరంలో నిర్మించాడు. దీని రూపకర్త లాల్‌చంద్ ఉస్తా. శ్రీ కృష్ణుని కిరీటం ఆకారంలో ఉండే విధంగా దీన్ని నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వాళ్ళ కంటపడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చూసేందుకు వీలుగా ఇది నిర్మించబడింది. ఇందులో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తుని శరద్ మందిర్ అనీ, ఇక్కడ శరత్కాలపు ఉత్సవాలను జరుపుకునేవారు. రెండవ అంతస్తుని రతన్ మందిర్ అనీ, ఇక్కడి గోడలకు వివిధ రకాలైన గాజు పని మనం చూడవచ్చు. మూడవ అంతస్తుని విచిత్ర మందిర్ అనీ, ఇక్కడ మహారాజా వారు తమ ఇష్ట దైవమైన శ్రీకృష్ణున్ని కొలిచేవారు. నాలుగవ అంతస్తుని ప్రకాశ్ మందిర్ అనీ అంటారు. ఇక చివరిదైన ఐదవ అంతస్తుని హవా మందిర్ అనీ అంటారు. వీధి వైపు ఉన్న గోడకు 953 చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి. వీటి ద్వారా గాలి సులభంగా ప్రవేశిస్తుంది. ఈ ఐదవ అంతస్తు పేరుమీదుగానే ఈ మొత్తం కట్టడాన్ని హవా మహల్ అని పిలుస్తున్నారు.
చూడవలసినవి: హవా మహల్, గాల్తాజీ మందిరం, సిటీ ప్యాలెస్ , ఆల్బర్ట్ హాల్, ఇసార్ లట్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: http://letustravel.weebly.com/hawa-mahal.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలోని పాత బస్తీలో కలదు. ఇది పాత బస్తీలోని 1/7 వ వంతు భాగాన్ని ఈ ప్యాలెస్ ఆక్రమిచింది. రాజమందిర సముదాయం సవాయి జైసింగ్ చే 1729 మరియు 1732 మధ్య నిర్మించబడినది మరియు తరువాత వివిధ నిర్మాణాలు అతని వారసుల ద్వారా చేర్చబడ్డాయి. ఇది రాజపుత్రుల మరియు మొఘలుల నిర్మాణ శైలి యొక్క ఒక అద్భుతమైన కలయిక. ఈ ప్యాలెస్ నందు పెద్ద పరిమాణంలో మనకు కనిపించే రెండు వెండి పాత్రలు ప్రధానపు ఆకర్షణ . వీటినే గగాజలీస్ అని కూడా పిలుస్తారు. 1902, ఇంగ్లాండ్ లో కింగ్ ఎడ్వర్డ్ VII పట్టాభిషేక మహొత్సవమున, సవాయి మధో సింగ్ తన ఇంగ్లాండ్ పర్యటన సంధర్భంగా వాటిలో గంగా జలాన్ని తీసుకెళ్ళాడు. ఈ రెండు భారీ వెండి పాత్రలు ప్రపంచంలోనే అతి పెద్ద వెండి వస్తువులుగా గిన్నిస్ బుక్ లో చేర్చబడ్డాయి.
సందర్శన వేళలు : ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ప్రవేశ రుసుము: భారాతీయులకు రూ.75 మరియు విదేశీయులకు రూ.150 చూడవలసినవి: ముబారక్ మహల్, చంద్ర మహల్, గోవింద్ దేవ్ జీ ఆలయం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/city-palace.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|