చూడవలసినవి: అమతావతి రిజర్వాయర్, క్రోకొడైల్ ఫాం
వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 25 కి.మీ దూరంలో కలదు. డ్యాం కింది భాగంలో అమరావతి అమ్మవారి చిన్న గుడి కలదు. ఈ డ్యాంని ముఖ్యంగా వ్యవసాయం కోసం మరియు వరదలను నివారించడానికి కట్టబడినది. దీనిని 1957 లో కామరాజర్ హయాంలో నిర్మించారు. గత 2 సంవత్సరముల నుండి యాత్రికులకు బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తేబడినది.
చూడవలసినవి: అమతావతి రిజర్వాయర్, క్రోకొడైల్ ఫాం వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 65 కి.మీ దూరంలో కలదు. ఇది వాల్పరైకు అడుగుభాగంలో కలదు. దీనిని 1959-1969 మధ్యన అలియార్ నది మీద నిర్మించారు. సెప్టెంబర్ 2002 నుండి ఇక్కడ జల విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నారు. డ్యాం కింది భాగంలో పార్క్, గార్డెన్, అక్వేరియం మరియు చిన్న థీమ్ పార్క్ ఉన్నాయి. ఈ రిజర్వాయర్ కొండల నడుమ ఉండడం వలన ఇక్కడికి చాలా మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ ఉండాలనుకునేవారు అటవీశాఖ వారి విశ్రాంతి గృహంలో ఉండవచ్చు. చెట్ల మీద కట్టిన గదులలాంటి వాటిలో బస చేయడం మరచిపోలేని అనుభూతి.
చూడవలసినవి: అరియార్ డ్యాం,మంకీ జలపాతాలు మరియు అంబరం పాలయం దర్గా వసతి: పోల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు. ఈరోడ్ జిల్లాలో కలదు. దీనినే లోయర్ భవాని డ్యాం అని కూడా అంటారు. ఈ డ్యాంను భవాని నది మీద కట్టారు. ఈ డ్యాం మెట్టుపాలయం మరియు సత్యమంగళం మధ్యన కలదు. ఇది సత్యమంగళం నుండి 16 కి.మీ దూరంలో కలదు. ఈ డ్యాం కు ముందు భాగంలో ఒక గార్డెన్ కలదు. ఇక్కడికి వారాంతాల్లో చాలా మంది తమ కుటుంబాలతో విహారానికి వస్తుంటారు.
చూడవలసినవి: భవాని సాగర్ డ్యాం వసతి : సత్యమంగలంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు మరియు ఈరోడ్ నుండి ఆటోలు లభించును. ఇది తమిళనాడు, ఈరోడ్ జిల్లాలో కలదు. దీనిని 1980 లో నిర్మించారు. ఈ డ్యాం 2 కి.మీ పొడవు, 40 మీటర్ల ఎత్తులో కలదు. ఈ డ్యాం కాదంబుర్ పర్వత శ్రేణి అడుగు భాగంలో కలదు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల పంటపొలాలకు ఈ నీరే ఆధారం.
చూడవలసినవి: పెరుంపల్లం డ్యాం వసతి: సత్యమంగలంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు మరియు ఈరోడ్ నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 20 కి.మీ దూరంలో కలదు. ఇది తిరుమూర్తి కొండల పాద భాగంలో కలదు. దీనికి దగ్గరలోనే తిరుమూర్తి ఆలయం మరియు తిరుమూర్తి జలపాతం కూడా కలదు.
చూడవలసినవి: తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి గుడి, తిరుమూర్తి జలపాతం వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణానికి 72 కి.మీ (కోయంబత్తూర్ -కార్మడై -పిల్లూర్ డ్యాం రోడ్ -బార్లికడు ) దూరంలో కలదు. బార్లికడు పిల్లూర్ డ్యాంకి దగ్గరలో కలదు. ఇక్కడ దోనె లో విహారం ప్రత్యేకం. ఇక్కడకి చేరుకోవడానికి అడవి గుండా ప్రయాణించాలి. కాబట్టి ఆటవీశాక అధికారుల అనుమతి తప్పనిసరి. బార్లికడు వెళ్ళే దారిలో కెమ్మరంపాలయం దాటిన తరవాత రెండు చెక్ పోస్ట్ లు కలవు. మొదటి చెక్ పోస్ట్ లో అనుమతిని పొందడం కొంచెం తేలికే. రెండవ చెక్ పోస్ట్ ని దాటాలంటే మాత్రం ముందస్తు అనుమతి తప్పనిసరి. ప్రయాణం మొత్తం అడవిగుండా కావడం చేత చాలా మలుపులు కలవు. ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి తినుభండారాలు లభించవు. మీవెంట వాటిని తీసుకెళ్లడం మరచిపోకండి.
చూడవలసినవి: పిల్లూర్ డ్యాం, బార్లికడు వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూర్ నుండి ఊటీ వెళ్ళే బస్సు (కీల్ కుందా) మాత్రమే ఈ అడవిగుండా పోతుంది. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/barlikadu.html మలంపురా డ్యాం మరియు గార్డెన్
జైనిమేడు తరవాత మలంపురా డ్యాం దగ్గరకు చేరుకున్నాం. ముందుగా రోప్ వేకి టికెట్స్ తీసుకున్నాం. రోప్ వే మీదినుంచి మలంపురా డ్యాం మరియు గార్డెన్ మొత్తం కనిపిస్తుంది. రోప్ వే మీద వెళ్తుంటే గాలిలో తేలుతున్నట్లు అనిపించిది. రోప్ వే మీద మొత్తంగా ఒక పదిహేను నిమిషాలు ఉంటాము. కిందికి వచ్చిన తరవాత గార్డెన్ లోకి వెళ్ళాము. ఇక్కడ ఉన్న గార్డెన్ చాలా పెద్దది. అలా నడుస్తూ డ్యాం మీదికి చేరుకున్నాం. అక్కడనుండి వెనక ఉన్న కొండలు మరియు నీళ్ళను చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపించింది. కాని దగ్గరలో చూడదగ్గ ప్రదేశాలు ఉండడంతో బయటికి వచ్చాము. పక్కనే ఉన్న అక్వేరియం , స్నేక్ పార్క్ మరియు రాక్ గార్డెన్ చూసి కోయంబత్తూర్ బయలుదేరాం. (సశేషం) ఇది నల్లగొండ జిల్లాలో కలదు. హైదరాబాద్ నుండి 150 కి.మీ దూరంలో ఉన్నది. పూర్వం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి పట్టణంలో కలసి ఉండేది. . ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అతి విశాలమైన నాగార్జునసాగర్ డ్యాంను చూసి భావుకత్వంతో "ఆధునిక దేవాలయంగా" అభివర్ణించాడు. ఈ జలాశయం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకొని పరవళ్ళు త్రొక్కుతూ ఉంది. వర్షాకాలంలో కృష్ణవేణమ్మ మరింతగా ఉప్పొంగి పొరలుతుంది.
చూడవలసినవి: డ్యాం, నాగార్జున కొండ వసతి : నాగార్జునసాగర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/nagarjuna-sagar.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|