పదండి ప్రపంచాన్ని చుట్టేద్దాం.............
  • పర్యాటక ప్రదేశాలు
  • నేను
  • యాత్రా వార్తలు
  • తెలుగు తరుణి

కాశీ యాత్రకు IRCTC వారి ప్రత్యేక ప్యాకేజీలు 

8/23/2013

0 Comments

 
జంటనగరాల నుంచి తొలిసారిగా భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్  (IRCTC) వారణాసి, అలహాబాద్ వంటి యాత్రా స్థలాలకు ప్రత్యేక ప్యాకేజి యాత్రలు సిద్ధం చేసింది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు వారణాసి, సారనాథ్, అలహాబాద్ లో పర్యటనకు ఏర్పాటు చేస్తారు. కాశీ క్షేత్ర దర్శనంతో పాటు అలహాబాద్ త్రివేణి సంగమం, సారనాధ్ బౌద్ధ క్షేత్ర సందర్శనం ఈ యాత్రలో ఉంటాయి.
Read more........

0 Comments

శారదాంబల్ కోయిల్

8/19/2013

0 Comments

 
                               ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరులోని రేస్ కోర్స్ రోడ్డులో కలదు. దీనిని 1979 లో అప్పటి శృంగేరి శారద మఠం పీఠాధిపతి  నిర్మించారు. ఇక్కడ అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి. అమ్మవారి ఆలయానికి చెరొక వైపు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కలవు. ఇక్కడ దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఆ తొమ్మిది రోజులు ఈ ఆలయం బొమ్మల కొలువుతో మరియు భజనలతో చూడ ముచ్చటగా ఉంటుంది.

చూడవలసినవి: శారదాంబల్ కోయిల్, రేస్ కోర్స్ రోడ్డు
వసతి :  కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు .

Picture
0 Comments

మహాలక్ష్మి టెంపుల్, మదుక్కరై

8/17/2013

0 Comments

 
                  ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి పొల్లాచ్చికి వెళ్ళే మార్గంలో,  13 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ముందుగా మనకు విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఆలయం ఆవరణలో గణపతి మరియు ఆంజనేయస్వామి దేవాలయాలు కలవు. ఈ ఆలయంలో మనం ముగ్గురు అమ్మలను (సరస్వతి , లక్ష్మి  మరియు పార్వతి ) ఒకే చోట చూడవచ్చు. సందర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్ర్రి 8.30 గంటల వరకు.

చూడవలసినవి: మహాలక్ష్మి ఆలయం  మరియు ఎచనారి ఆలయం
వసతి :  కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు .


Picture
మహాలక్ష్మి ఆలయం
Picture
మహావిష్ణువు
0 Comments

నంజుడేశ్వరర్ కోయిల్, కార్మడై 

8/16/2013

0 Comments

 
                    ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 30 కి.మీ దూరంలో కల కార్మడై గ్రామలో కలదు. ఇది రంగనాథర్ కోయిల్ పక్కనే కలదు. ఇక్కడి నంజుడేశ్వరర్ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ గుడి సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయంలోని శివలింగం ఎరుపు  రంగులో ఉంటుంది. తమిళంలో నంజు అంటే విషం. అమృత మథనం సమయంలో మొదటగా వచ్చిన హాలాహలాన్ని శివుడు తన గొంతులో ఉంచుకుంటాడు. దానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మించబడినది. సందర్శన వేళలు ఉదయం 6 గంటల  నుండి మద్యాహ్నం 12 గంటల  వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు.

చూడవలసినవి: నంజుడేశ్వరర్  ఆలయం ,  రంగనాథర్ కోయిల్ మరియు   టెన్ తిరుపతి
వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు నుండి  బస్సు సౌకర్యం కలదు.

Picture
Picture
గుడి ముందు కల ధ్వజ స్థంబం
Picture
0 Comments

రంగనాథర్ కోయిల్, కార్మడై 

8/16/2013

0 Comments

 
                                       ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 30 కి.మీ దూరంలో గల కార్మడై అనే గ్రామంలో కలదు. ఇక్కడ ప్రధాన దైవం విష్ణువు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ రథోత్సవం నిర్వహిస్తారు. అప్పుడు చుట్టుపక్కల ప్రదేశాల నుండి చాలా మంది భక్తులు వస్తారు. ఈ గుడి ఆవరణలో ఆది శంకరాచార్యులవారికి కూడా ఒక గుడి కలదు. గుడికి కొంచెం దూరంలో ఒక కొలను కలదు. ఆ కొలనులోని చేపలకు భక్తులు ఆహారాన్ని ఇస్తుంటారు.

చూడవలసినవి: రంగనాథర్ కోయిల్, టెన్ తిరుపతి
వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు నుండి  బస్సు సౌకర్యం కలదు.

Picture
రంగనాథర్ కోయిల్
Picture
నూతనంగా నిర్మిస్తున్న గోపురం
Picture
Picture
గుడికి దగ్గరలో కల కొలను
0 Comments

వెల్లియంగిరి కొండలు

8/15/2013

0 Comments

 
          
    ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 30 కి.మీ దూరంలో కలదు. మొదటగా పూండి చేరుకోవాలి. అక్కడ ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాక, వెల్లియంగిరి  కొండల మీద ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడికి  అన్ని సమయాలలో అనుమతి లేదు. కేవలం చైత్రమాసంలో (ఉగాది నుండి ఒక నెల రోజుల వరకు) మాత్రమే అనుమతిస్తారు. మొతం ఏడు కొండలు కలవు. ఏడు కొండల తరవాత శివాలయం వస్తుంది. వెళ్ళడం కొంచెం కష్టమే. చాలా మంది భక్తులు రాత్రివేళ బయలుదేరి, దర్శనం చేసుకొని ఉదయం వరకల్లా కిందికి చేరుకుంటారు. ఎందుకంటే రాత్రి వేళలో వాతావరణం చల్లగా ఉండడం వలన మనకు అంతగా బడలికగా  అనిపించదు. ఒకవేళ ఉదయం బయలు దేరినట్లయితే, ప్రయాణం మద్యాహ్నం చేయాల్సి ఉంటుంది, అందులోనూ చాలా వేడిగా ఉండడం వలన, భక్తులు రాత్రివేళల్లో బయలుదేరుతారు. కొండలపైకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఒక వెదురు కర్ర లాంటిది తీసుకెళతారు. ఎందుకంటే కొండలు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ కర్ర సహాయం చాలా అవసరం. భక్తులు శివుడి దర్శనం తరవాత, కిందికి వచ్చాక ఆ కర్రని ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తారు.

చూడవలసినవి:  శివాలయం, కొండ కింద గల శివాలయం,  ధ్యాన లింగ
వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు నుండి  బస్సు సౌకర్యం కలదు.

Picture
పైకి వెళ్ళడానికి ఈ గేటు గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. దీనిని కేవలం చైత్ర మాసంలోనే తెరుస్తారు.
Picture
ఇలాంటి దారిలో కొంచెం జాగ్రత్త సుమా ..
Picture
కర్ర సహాయంతో నడుస్తున్న భక్తులు
Picture
ఇలాంటి దారిలో మనకు కర్ర సహాయం చాలా అవసరం.
Picture
కొండపైన కల దేవాలయపు చిత్రం
0 Comments

వెల్లియంగిరి ఆండవార్ కోయిల్

8/13/2013

0 Comments

 
                          ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 30 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇది వెల్లియంగిరి కొండల అడుగు భాగంలో కలదు. వెల్లియంగిరి కొండల మీద (మొత్తం 7 కొండలు) కూడా ఒక శివాలయం ఉన్నది. మొదటగా దీనిని దర్శించుకున్న తరవాత కొండల మీదున్న శివుడిని దర్శించుకుంటారు. కొండలపైన ఉన్న గుడిని చూసి రావడానికి కనీసం 8-10 గంటల సమయం పడుతుంది. కావున చాలా మంది భక్తులు కొండల కింది భాగంలో ఉన్న శివుని గుడి వద్ద బస చేస్తారు.

చూడవలసినవి:  వెల్లియంగిరి ఆండవార్ కోయిల్, కొండలపైన గల దేవాలయం, ధ్యాన లింగ
వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు నుండి  బస్సు సౌకర్యం కలదు.

Picture
ముఖ ద్వారం
Picture
కొండ కింద గల దేవాలయం
Picture
Picture
Picture
ఏడు కొండలకు వెళ్ళడానికి ప్రవేశ ద్వారం
0 Comments

క్రోకొడైల్ ఫాం

8/12/2013

0 Comments

 
                   ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది అమరావతి డ్యాం మరియు రిజర్వాయర్కు దగ్గరలోనే కలదు. ఇందులో చాలా మొసళ్ళు కలవు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మొసళ్ళకు ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వకండి. ఎందుకంటే మన చేతుల్ని మొసలి కోరికే ప్రమాదం ఉంది. మొసళ్ళు కదలకుండా చాలా సేపటివరకు అలాగే ఉంటాయి. కొన్ని సార్లు చూస్తున్న మనకు ఇవి నిజంగా మొసల్లేనా లేక బొమ్మలా అని అనిపిస్తాయి.  అవి కదలట్లేదు కదా అని మీరు వాటిని కదిలించే ప్రయత్నం మాత్రం చేయకండి.

చూడవలసినవి:  క్రోకొడైల్ ఫాం మరియు  అమతావతి రిజర్వాయర్
వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి  బస్సు సౌకర్యం కలదు.

Picture
Picture
Picture
0 Comments

అమరావతి డ్యాం మరియు రిజర్వాయర్ 

8/10/2013

0 Comments

 
           ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 25 కి.మీ దూరంలో కలదు. డ్యాం కింది భాగంలో అమరావతి అమ్మవారి చిన్న గుడి కలదు. ఈ డ్యాంని ముఖ్యంగా వ్యవసాయం కోసం మరియు వరదలను నివారించడానికి కట్టబడినది. దీనిని 1957 లో కామరాజర్ హయాంలో నిర్మించారు. గత 2 సంవత్సరముల నుండి యాత్రికులకు బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తేబడినది.

చూడవలసినవి:  అమతావతి రిజర్వాయర్, క్రోకొడైల్ ఫాం
వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి  బస్సు సౌకర్యం కలదు.
Picture
అమరావతి డ్యాం
Picture
అమరావతి అమ్మవారు
Picture
Picture
రిజర్వాయర్
0 Comments

మారియమ్మన్ కోయిల్, పొల్లాచి 

8/8/2013

0 Comments

 
            ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది పొల్లాచిలోని ఎస్.ఎస్. కోయిల్ వీధిలో కలదు. ఈ గుడి 300 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెపుతారు. ఈ ఆలయపు గోపురం మీద గాంధీ, రామకృష్ణ పరమహంస మరియు బుద్దుడి ప్రతిమలు కలవు. ఆలయంలోని శిల్ప కళా సంపద మనల్ని ఆకట్టుకుంటుంది. ఆవు మరియు ఏనుగు రెండు ఉన్న ఒకే ప్రతిమలో రెండింటికి కలిపి ఒకే తల ఉండటం విశేషం.

చూడవలసినవి:  అమ్మన్ కోయిల్
వసతి: పోల్లాచిలో  చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పొల్లాచిలో లోకల్ బస్సు సౌకర్యం కలదు.


Picture
గోపురం మీద గాంధీ, రామకృష్ణ పరమహంస మరియు బుద్దుడి ప్రతిమలు
Picture
ఆవు మరియు ఏనుగు రెండింటికి ఒకే తల
Picture
మూడు సింహాలు
Picture
భరతమాత ప్రతిమ
0 Comments
<<Previous

    విహారయాత్రకు స్వాగతం. ఇందులోని పోస్టులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మీ మిత్రులతో వాటిని పంచుకోవాలంటే పేస్ బుక్ ఓపెన్ చేసినతరవాత సెర్చ్ ఐటమ్స్ లో "vihaarayaatra" అని టైప్ చేయండి. విహారయాత్ర యొక్క ఫేస్ బుక్ హోమ్ పేజి వస్తుంది. అక్కడ మీకు కావలసిన వాటిని షేర్ చేయండి. …….. మీ విహారయాత్ర

    నా గురించి

    నా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా  చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ ....   మీ బద్రి  


    vihaarayaatra.weebly.com

    Promote Your Page Too
    Foreign Languages Institute

    Promote Your Page Too
    Telugutaruni

    Promote Your Page Too
    letustravel.weebly.com

    Promote Your Page Too

    Archives

    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    Andhra Pradesh
    Aquarium
    Church
    Dam
    Fort
    Garden
    Karnataka
    Kerala
    Lake
    Memorial
    Miscellaneous
    Mosque
    Mountain
    Museum
    Palace
    Park
    Rajasthan
    Tamilnadu
    Temple
    Travel News
    Uttarakhand
    Waterfall
    Zoo

    Enter your email address:

    Delivered by FeedBurner

    Picture
    ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.

    Picture
    పండ్ల ప్రదర్శన - 2013

    Picture
    శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం

    Picture
    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture





    Picture
    Picture
    Picture
    Picture
    poodanda
    Blaagulokam logo
    మొత్తం పేజీ వీక్షణలు
    vihaarayaatra.weebly.com
Powered by Create your own unique website with customizable templates.