చూడవలసినవి: మహాలక్ష్మి ఆలయం మరియు ఎచనారి ఆలయం
వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు .
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి పొల్లాచ్చికి వెళ్ళే మార్గంలో, 13 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ముందుగా మనకు విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఆలయం ఆవరణలో గణపతి మరియు ఆంజనేయస్వామి దేవాలయాలు కలవు. ఈ ఆలయంలో మనం ముగ్గురు అమ్మలను (సరస్వతి , లక్ష్మి మరియు పార్వతి ) ఒకే చోట చూడవచ్చు. సందర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్ర్రి 8.30 గంటల వరకు.
చూడవలసినవి: మహాలక్ష్మి ఆలయం మరియు ఎచనారి ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు .
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|