పదండి ప్రపంచాన్ని చుట్టేద్దాం.............
  • పర్యాటక ప్రదేశాలు
  • నేను
  • యాత్రా వార్తలు
  • తెలుగు తరుణి

బిర్లా మందిర్, జైపూర్

5/31/2013

0 Comments

 
Picture
ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలో మోతి డోంగ్రీ కోట కింద ఉన్నది. దీనినే లక్ష్మీనారాయణ మందిరం అని కూడా అంటారు. దీనిని తెల్ల పాలరాతితో నిర్మించారు. పౌర్ణమి రోజున ఈ మందిరాన్ని నిండు వెన్నెల్లో చూడటానికి మన రెండు కండ్లు చాలవంటే నమ్మండి. ఈ మందిరంలోని లోపలి గోడల మీద భగవద్గీత మరియు ఉపనిషత్తులలోని శ్లోకాలను చెక్కిన తీరు అబ్బుర పరుస్తుంది. అంతే కాకుండా పురాణ గాథలను కూడా చిత్రాల రూపంలో ఆలయ లోపలిగోడల మీద మనం చూడవచ్చు. ఈ ఆలయానికి మూడు డోములు కలవు. ఒక్కొక్క డోము ఒక్కొక్క మతాన్ని (హిందూ , ముస్లిం, క్రిస్టియన్) సూచిస్తుంది. దీని దర్శించటానికి అనువైన సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు.
సందర్శన వేళలు : ఉదయం 8 నుండి మద్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు .

చూడవలసినవి: మందిరం , ప్లానిటోరియం
వసతి :   జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం  కలదు .

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/birla-mandir.html

0 Comments

ఆల్బర్ట్ హాల్, జైపూర్ 

5/30/2013

0 Comments

 
Picture
మ్యూజియం ముఖ ద్వారం
ఇది రాజస్థాన్, జైపూర్  పట్టణంలో టాంక్ రోడ్ నందు రామ్ నివాస్ గార్డెన్ కి దగ్గరలో కలదు. ఇది 1863 లో ప్రిన్స్ ఆల్బర్ట్ చేత ప్రారంభించబడినది. ఇది సర్ స్వింటన్ జాకబ్ చేత డిజైన్ చేయబడినది. దీనిని 1887 లో పబ్లిక్ మ్యూజియంగా ప్రజల సందర్శనార్ధం తెరువబడినది. ఇది రాజస్తాన్ రాష్టంలోనే పురాతన మ్యూజియం. దీనినే గవర్నమెంట్ సెంట్రల్ మ్యూజియం అని కూడా పిలుస్తారు.  ఇందులో ఇక్కడి రాజుల వాడిన ఖడ్గాలు, దుస్తులు మరియు వస్తువులు భద్రపరచబడ్డాయి.

చూడవలసినవి: మ్యూజియం
వసతి :   జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/albert-hall.html

0 Comments

శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం

5/29/2013

0 Comments

 
Picture
శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయ ముఖ ద్వారం
ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గోపలాయపల్లి గ్రామంలో కొండపైన  ఉన్నది. ఇది హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాలకు మరియు నార్కెట్ పల్లి మద్యన ఉన్నది. మెయిన్ రోడ్ నుండి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు. ఇక్కడ ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. ఈ ఆలయం పచ్చని ప్రకృతి మద్య మనసుకు హాయి గొల్పుతుంది. ఈ ఆలయం ముందు సహజ సిద్దమైన  కోనేరు కలదు.ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జాతర జరుగుతుంది. అప్పుడు చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు మరియు హైదరాబాద్ నుండి కూడా చాలా మంది భక్తులు దీనిని దర్శిస్తారు. 

చూడవలసినవి: వేణుగోపాలస్వామి ఆలయం ,శివాలయం , శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం
వసతి :   కొండపైన ఉండడానికి వసతి సౌకర్యం కలదు.
అందుబాటు : చిట్యాల మరియు నార్కెట్ పల్లి నుండి గోపాలాయపల్లి మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/gopalayapalli.html


0 Comments

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం

5/28/2013

0 Comments

 
Picture
మూడు గుండ్లు
ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో కొండపైన  ఉన్నది. ఇది హైదరాబాద్-  నల్లగొండ రహదారిపై నార్కెట్ పల్లి  నుండి  6 కి.మీ దూరంలో ఉన్నది. ఎల్లారెడ్డిగూడెం  మెయిన్ రోడ్ నుండి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ మూడు గుండ్లు. మూడు గుండ్ల పైన శివుడు, లింగాకార రూపంలో మనకు దర్శనమిస్తాడు. ప్రతి సోమవారం ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జాతర జరుగుతుంది.

చూడవలసినవి: శివాలయం , మూడుగుండ్లు, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం
వసతి :   కొండపైన ఉండడానికి వసతి సౌకర్యం కలదు.
అందుబాటు : నల్లగొండ మరియు నార్కెట్ పల్లి నుండి ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు.అక్కడి నుండి కొండపైకి వెళ్ళడానికి ఆటోలు లభిస్తాయి.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/cheruvugattu.html

0 Comments

ఏకాంబరీశ్వర  ఆలయం 

5/27/2013

0 Comments

 
Picture
ఇది కర్ణాటక తమిళనాడు సరిహద్దులో, బెంగళూరు అర్బన్ జిల్లాలో , బాగలూరు సమీపంలో మేల్ చూడాపూరం లో ఉన్నది. ఈ పురాతన ఏకాంబరీశ్వర  ఆలయంలో మూల విగ్రహం శిథిలావస్తకు చేరుకుంది. ఈ ఆలయం చోళ రాజుల పాలనలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని పూర్తిగా ఎర్రతివాచితో నిర్మించడంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇది ఊరి చివర ఉండడం వల్ల ఇక్కడ జనాలు అంతగా కనిపించరు .

చూడవలసినవి: గుడి
వసతి :   బెంగళూరు లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బెంగళూరు నుండి హోసూరు మరియు హోసూరు నుండి బాగలూరు కు బస్సులు కలవు. .

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/melchudapuram.html

0 Comments

G D నాయుడు మ్యూజియం

5/26/2013

0 Comments

 
Picture
G D నాయుడు మ్యూజియం  కోయంబత్తూర్ లో , అవినాశి రోడ్డులో గాంధీపురం వెళ్ళే వైపు  లక్ష్మి మిల్స్ తరువాత ఎడమచేయి వైపు ఉన్నది. ఈ మ్యూజియంలో ఇంజనీరింగ్ వస్తువులు మరియు ఆసక్తి కలిగించే చాలా వస్తువులు  ఉన్నాయి. అందులో చాలా వస్తువులు నాయుడు గారు కనిపెట్టినవే. కొన్ని నాయుడు గారు సేకరించినవి. వాటిలో రేజర్లు , కెమేరాలు, పెన్నులు, బైనాక్యులర్లు మొదలగునవి.

చిన్న పిల్లలకు సైన్సు పట్ల ఆసక్తిని రేకెత్తించడానికి ఈ మ్యూజియం సందర్శన ఉపయోగపడుతుంది.

సందర్శన వేళలు : ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు
రెండవ శనివారాలు మరియు ఆదివారాలు సెలవు.

చూడవలసినవి: మ్యూజియం
వసతి :   కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు .

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/gd-naidu-museum.html

0 Comments

పండ్ల ప్రదర్శన, కూనూర్ -2013 

5/26/2013

0 Comments

 
Picture
Welcome arch weighed 3,500 kg .
55వ సంవత్సరపు పండ్ల ప్రదర్శన కూనూర్ లోని సిమ్స్ పార్క్ లో వేలాది మంది ప్రజలు మరియు యాత్రికుల మద్య అట్టహాసంగా ప్రారంభమైనది. స్వాగత ద్వారాన్ని వివిధ రకాల పండ్లతో తయారు చేశారు. ఈ ప్రదర్శనకు  ముఖ్య ఆకర్షణ 24 ఫీట్ల ఎత్తు మరియు 34 ఫీట్ల వెడల్పు కల్గిన సీతాకోక చిలుక . దీని తయారీకి 3,500 కిలోల వివిధ రకాల పండ్లను ఉపయోగించారు. అందులో ద్రాక్ష, ఆపిల్, బత్తాయి, పైన్ ఆపిల్ మొదలైన పండ్లు కలవు. 

మనకు పండ్లతో జ్యూస్ చేసుకోవడము లేదా వాటిని అలాగే తినడం తెలుసు. కాని పండ్లతో వివిధ రకాల ఆకృతులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అందులో సీతాకోక చిలుక, డ్రాగన్ , పాము, కుందేలు, పెంగ్విన్  మొదలుగునవి. 

చూడవలసినవి: పండ్ల ప్రదర్శన  
వసతి : కూనూర్ లో  చాలా హోటల్స్ కలవు. 
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. 

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/miscellaneous.html
0 Comments

V.O.C పార్క్ మరియు జూ 

5/23/2013

2 Comments

 
Picture
ఇది కోయంబత్తూర్, గాంధీపురం లో నెహ్రు స్టేడియం పక్కన ఉన్నది. ఈ పార్కుకు  స్వాతంత్ర్య సమరయోధుడైన  వి. ఓ . చిదంబరం  గారి పేరు పెట్టబడినది. దీనిని కోయంబత్తూర్ మున్సిపాలిటీ వాళ్ళ నిర్వహణలో ఉన్నది. ఇక్కడ రకరకాల జంతువులను మరియు  పక్షులను చూడవచ్చు. ఈ పార్క్ లో ఉన్న టాయ్ ట్రైన్ పిల్లలకు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఉన్న పార్క్ లో హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ యొక్క నకలు ఉన్నది.

చూడవలసినవి: జూ మరియు పార్కు
వసతి :   కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : గాంధీపురం నుండి 10 నిమిషాల నడక.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/voc-park.html



2 Comments

జైన్ మందిరం 

5/22/2013

0 Comments

 
Picture
కొలనుపాక జైన్ మందిరం
ఇది నల్లగొండ మరియు వరంగల్ సరిహద్దులో ఉన్నది. ఇది నల్లగొండ నుండి 110 కి.మీ, వరంగల్ నుండి 80 కి.మీ దూరంలోను ఉన్నది. ఇది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రహదారిపై ఆలేర్ నుండి 8 కి.మీ దూరంలో ఉన్నది. జైనులు ఈ ప్రాంతాన్ని తమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇంకా ఇక్కడ పలు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఇది  2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుని విగ్రహం చూడొచ్చు. ఇంకా జైన మతం ఆంధ్రప్రదేశ్ లో ఎంతగా గుర్తింపు పొందిందో ఈ కొలనుపాకలో తెలుసుకోవచ్చు. 

చూడవలసినవి: జైన్ మందిరం
వసతి   : జైన్ మందిరంలో ఉండటానికి వసతి కలదు.
అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఆలేర్ వరకు బస్సులో చేరుకోవచ్చు. ఆలేర్ నుండి కొలనుపాకకు ఆటోలు లభిస్తాయి.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/kolanupaka.html



0 Comments

భువనగిరి కోట 

5/21/2013

0 Comments

 
Picture
కోటపైన మనకు ఇలా కనిపిస్తుంది .
ఇది భువనగిరి పట్టణంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 51 కి.మీ దూరంలో ఉన్నది.భువనగిరి బస్సు స్టాండ్ వెనకాల ఈ కోట మనకు దర్శనమిస్తుంది. అక్కడినుండి 5 నిమిషాల నడకతో కోటను చేరుకోవచ్చు.   ఎత్తయిన కొండపై నిర్మితమైనది . ఈ కోట 40 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడి ఉన్నది. చాళుక్య వంశస్తుడైన త్రిభువనముల్లు విక్రమాదిత్యుడు ఈ కోట నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

చూడవలసినవి: కోట
వసతి   :  ఈ పట్టణంలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఇక్కడికి బస్సులో వెళ్ళడం చాలా సులభం.

మరిన్ని ఫోటోలకు మరియు  వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/bhuvanagiri.html
0 Comments
<<Previous

    విహారయాత్రకు స్వాగతం. ఇందులోని పోస్టులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మీ మిత్రులతో వాటిని పంచుకోవాలంటే పేస్ బుక్ ఓపెన్ చేసినతరవాత సెర్చ్ ఐటమ్స్ లో "vihaarayaatra" అని టైప్ చేయండి. విహారయాత్ర యొక్క ఫేస్ బుక్ హోమ్ పేజి వస్తుంది. అక్కడ మీకు కావలసిన వాటిని షేర్ చేయండి. …….. మీ విహారయాత్ర

    నా గురించి

    నా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా  చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ ....   మీ బద్రి  


    vihaarayaatra.weebly.com

    Promote Your Page Too
    Foreign Languages Institute

    Promote Your Page Too
    Telugutaruni

    Promote Your Page Too
    letustravel.weebly.com

    Promote Your Page Too

    Archives

    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    Andhra Pradesh
    Aquarium
    Church
    Dam
    Fort
    Garden
    Karnataka
    Kerala
    Lake
    Memorial
    Miscellaneous
    Mosque
    Mountain
    Museum
    Palace
    Park
    Rajasthan
    Tamilnadu
    Temple
    Travel News
    Uttarakhand
    Waterfall
    Zoo

    Enter your email address:

    Delivered by FeedBurner

    Picture
    ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.

    Picture
    పండ్ల ప్రదర్శన - 2013

    Picture
    శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం

    Picture
    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture





    Picture
    Picture
    Picture
    Picture
    poodanda
    Blaagulokam logo
    మొత్తం పేజీ వీక్షణలు
    vihaarayaatra.weebly.com
Powered by Create your own unique website with customizable templates.