చూడవలసినవి: క్రోకొడైల్ ఫాం మరియు అమతావతి రిజర్వాయర్
వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది అమరావతి డ్యాం మరియు రిజర్వాయర్‌కు దగ్గరలోనే కలదు. ఇందులో చాలా మొసళ్ళు కలవు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మొసళ్ళకు ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వకండి. ఎందుకంటే మన చేతుల్ని మొసలి కోరికే ప్రమాదం ఉంది. మొసళ్ళు కదలకుండా చాలా సేపటివరకు అలాగే ఉంటాయి. కొన్ని సార్లు చూస్తున్న మనకు ఇవి నిజంగా మొసల్లేనా లేక బొమ్మలా అని అనిపిస్తాయి. అవి కదలట్లేదు కదా అని మీరు వాటిని కదిలించే ప్రయత్నం మాత్రం చేయకండి.
చూడవలసినవి: క్రోకొడైల్ ఫాం మరియు అమతావతి రిజర్వాయర్ వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
ఇది కోయంబత్తూర్, గాంధీపురం లో నెహ్రు స్టేడియం పక్కన ఉన్నది. ఈ పార్కుకు స్వాతంత్ర్య సమరయోధుడైన వి. ఓ . చిదంబరం గారి పేరు పెట్టబడినది. దీనిని కోయంబత్తూర్ మున్సిపాలిటీ వాళ్ళ నిర్వహణలో ఉన్నది. ఇక్కడ రకరకాల జంతువులను మరియు పక్షులను చూడవచ్చు. ఈ పార్క్ లో ఉన్న టాయ్ ట్రైన్ పిల్లలకు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఉన్న పార్క్ లో హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ యొక్క నకలు ఉన్నది.
చూడవలసినవి: జూ మరియు పార్కు వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి 10 నిమిషాల నడక. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/voc-park.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|