ఆంధ్రప్రదేశ్ ప్రాచీన నగరాల్లో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ.శ 11-12 శతాబ్ధాలలో కందూరు చోళుల రాజధానిగా ఉండేది. ఇక్కడ కాకతీయులకు సామంతులైన కందూరు చోళులు పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు. నల్ల శానపు రాళ్ళపై రమ్యంగా మలచిన శిల్పాలు, ఆలయాలు, మధ్యయుగ వాస్తు శిల్ప సాంప్రదాయాలకు అడ్డం పడుతున్నాయి. తూర్పు వైపున ఒకటి, పశ్చిమం వైపున మూడు ఆలయాలను 70 స్తంభాలతో నిర్మించిన మహామండపం కలుపుతూ ఉంది. ఆలయం గోడలపైన, మండపం స్తంభాలపైన చెక్కిన శివ, అష్టదిక్పాల, భారత, రామాయణ గాథలు, సమకాలీన జీవన విదానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.
చూడవలసినవి: పచ్చల సోమేశ్వరాలయం,మ్యూజియం
వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు.