ఇది రాజస్తాన్ రాష్ట్రంలో , జైపూర్ పట్టణానికి నైరుతి దిశగా 96 కి.మీ దూరంలోనూ మరియు అజ్మీర్ నుండి 64 కి.మీ దూరంలోనూ కలదు. ఈ సరస్సు చుట్టుకొలత 96 కి.మీ . ఇక్కడ సముద్రపు నీరు లేకపోయినా ఇక్కడ ఉప్పును తయారు చేస్తారు. ఇది ఆరావళీ కొండల నడుమ ఉన్నది. వర్షములు పడ్డప్పుడు నీరు బాగా నిండుతుంది. కొండల మీద మడులు చేసి నీటిని నిలువ చేసి, నీటి మట్టం తగ్గినప్పుడు ఎండిపోయిన మడి నుండి ఉప్పును తయారుచేస్తారు.
1 Comment
వాస్తు శిల్పానికి శాస్త్రవిజ్ఞానానికి ప్రాచీన భారతావనిలో అవినాభావ సంబంధం ఉండేది. జైసింగ్ వేధశాలలు ఇందుకు ఇటీవలి నిదర్శనాలు. ఖగోళవేత్త మీర్జా ఉలుగ్ బేగ్ పరిశోధనలు 18వ శతాబ్దపు సవాయి జైసింగ్2 ను ఎంతగానో ప్రభావితం చేశాయి. జైపూర్ మహారాజైన జైసింగ్ కూడా స్వయంగా గొప్ప పండితుడు, ఖగోళ శాస్త్రవేత్త. ఉత్తరాది నగరాలైన ఢిల్లీ, ఉజ్జయిని, వారణాసి, మధుర, జైపూర్లలో ఆయన 5 వేధశాలలను నిర్మించాడు. జంతర్ మంతర్లుగా ఇవి బహుళ ప్రాచుర్యం పొందాయి. (జంతర్ మంతర్ అంటే గణక యంత్రం అని అర్థం). పని తీరులోనేగాక నిర్మాణ శైలి పరంగానూ జంతర్ మంతరులు వాటికవేసాటి. పరికరాలను ఉంచే భవనాలుగా కాకుండా, ఆ భవనాలే ఖగోళ పరికరాలుగా ఉపయోగపడేట్లు జైసింగ్ వాటికి రూపకల్పన చేశాడు. అర్ధగోళాలు, విలువంపులు, ఘనాలు, స్థూపాలు, త్రికోణాలు ఇలాంటి రకరకాల రేఖా గణిత ఆకృతుల మేళవింపుతో రూపొందిన జంతర్ మంతర్ లు ఈనాటికీ అత్యాధునిక భవిష్య కాలపు డిజైన్లను తలపిస్తాయి. ఈ విజ్ఞాన సౌధాలు చూడచక్కని నిర్మాణాలు. నిన్నగాక మొన్న ఉపగ్రహాలు వచ్చే వరకూ ఇవే ఖగోళ సంఘటనల కాలాన్ని లెక్కించడానికి ఉపకరించాయి.
జంతర్ మంతర్, జైపూర్ జైసింగ్ నిర్మించిన 5 అబ్జర్వేటరీలలోకీ అతి పెద్దది జైపూర్ లోని జంతర్ మంతర్. 1728-1734 మధ్యకాలంలో దీని నిర్మాణం జరిగింది. సువిశాలమైన ఉద్యానవనంలో ఎర్ర రాతితో కట్టిన ఈ వేదశాల 16 రకాల భారీ పరికరాల (యంత్రాల) సముదాయం. వీటిలో ఒకటైన 'లఘు సామ్రాట్ యంత్రం' జైపూర్ స్థానిక కాలాన్ని (20 సెకండ్ల తేడాతో) ఖచ్చితంగా లెక్కిస్తుంది. భూమధ్యరేఖ నుంచి నక్షత్రాలు, గ్రహాలు, ఎంత కోణంతో ఉన్నాయో 'చక్రయంత్రం'తో గణించేవారు. ఇక్కడ ఉన్న ఇతర పరికరాల ఖచ్చితత్వాన్ని జైప్రకాష్ యంత్రం నిర్థారిస్తుంది. జైసింగ్ తనే స్వయంగా దీన్ని కనిపెట్టాడని విశ్వసిస్తారు.12 భూభాగాలుగా ఉండే రాశి వలయ యంత్రాన్ని జాతక చక్రం వేయడానికి ఉపయోగించేవారు. దీనిలోని ఒక్కోభాగం ఒక్కోరాశికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రామ యంత్రం అనే మరో పరికరంతో ఆకాశమధ్యానికి, భూమ్యాకాశాలు కలిసే చోటుకు మధ్య వంపును కొలిచే వారు. 23 మీటర్ల ఎత్తు ఉండే సామ్రాట్ యంత్రంతో వర్షపాతాన్ని అంచనా వేసేవారు. ఇక్కడి ముఖ్య పరికరాలలో ‘ధ్రువ’, ‘దక్షిణ’, ‘నారివల్య’, ‘రాశివలయాస్’, ‘చిన్న సామ్రాట్’, ‘పెద్ద సామ్రాట్’, ‘పరిశోధక స్థానం’, ‘దిశా’, ‘చిన్న రాం’, ‘పెద్ద రాం’ యంత్రం, చిన్న ‘క్రాంతి’, పెద్ద ‘క్రాంతి’, ‘రాజ్ ఉన్నతాంశ’, ‘జై ప్రకాష్’, ‘దిగంత’ వంటి వాటిని చూడవచ్చు.జైసింగ్ నిర్మిత వేధశాలల్లో జైపూర్ అబ్జర్వేటరీ ఒక్కటే కాస్త దిలంగా ఉంది. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి. మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి: http://letustravel.weebly.com/jantar-mantar.html ఇది రాజస్థాన్, జైపూర్ పట్టణం నుండి 15 కి. మీ దూరంలో కలదు (బస్సు మార్గం). జైపూర్ కి కొత్తగా వచ్చిన ఎవరైనా ఇలాగే వెళతారు. నాహర్ గర్ కోట వెళ్ళడానికి ఒక సత్వర మార్గం (షార్ట్ కట్) కలదు. పాత బస్తీ నుండి ఇది కేవలం 3 కి. మీ దూరంలో కలదు (కేవలం నడక లేదా ద్విచక్ర వాహనం ద్వారా). ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటే పాతబస్తీకి వెళ్ళాక అక్కడ ఉండే బస్తీ వాసులని అడిగితే దారి చెపుతారు. నడుచుకుంటూ వెళ్ళడం మనకు ఒక మరిచిపోరాని అనుభూతి. పైకి వెళ్ళడానికి చక్కని రోడ్డు మార్గం కలదు. పైకి అలా నడుచుకుంటూ వెళుతుంటే సిటీ మొత్తం కొంచెం కొంచెంగా, పైకి వెళ్ళాక సిటీ మొత్తం కనిపిస్తుంది.
జైపూర్ నగరానికి మూడు వైపులా మూడు కొండలు మరియు వాటిమీద కోటలు ఉన్నాయి. ఈ మూడు కోటలు జైపూర్ నగరానికి కాపలాగా ఉన్నాయి. అందులో నాహర్ గర్ కోట కూడా ఒకటి. నాహర్ గర్ కోటను జైపూర్ రాజు సవాయ్ జయ్ సింగ్ నిర్మించారు. ఈ కోట నిర్మాణం 1734 లో పూర్తిచేయ బడింది, ఇక్కడి ప్రసిద్ధ గోడలు, కోట బురుజులను సవాయ్ మాధో సింగ్ మహారాజు 1880 లో పునర్నిర్మించారు. ఈ కోట, ఆరావళీ పర్వత శ్రేణుల మధ్యలో, శాస్త్రీయ అందమైన సమ్మేళనంతో, యూరోపియన్ శైలితో నిర్మించారు. దీనికి జైపూర్ రాకుమారుడు నాహర్ సింగ్ పేరుపెట్టారు. అతని ఆత్మ కోట నిర్మాణ పనికి అడ్డుపడిందని, అతనికి గుర్తుగా కోట ప్రాంగణం లోపల దేవాలయం నిర్మించిన తరువాత ఆత్మ శాంతి౦చిందని నమ్మకం. నాహర్ గర్ అంటే ‘పులుల నివాస స్థలం’ అని అర్ధం. ఈ కోటలో రాజులు, వారి కుటుంబీకులు వేసవి విడిదిగా ఉపయోగించే మాధవేంద్ర భవనం ఉంది. ఇపుడు ఈ ప్రాంతం ప్రసిద్ధ విహార స్థలం. చూడవలసినవి: కోట, మాధవేంద్ర భవన్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/nahargarh-fort.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణం నుండి 12 కి మీ దూరంలో కల సంగనేర్ అనే గ్రామంలో కలదు. ఈ సంగనేర్ అనే గ్రామం చేతితో ముద్రించిన వస్త్రాలు మరియు చేతితో తయారు చేసిన పేపర్ కి ప్రసిద్ధి. ఇక్కడ ఉండే అన్ని షాప్స్ లోనూ ఇవి లభిస్తాయి. ఈ సంగనేర్లో మరొక ప్రధాన ఆకర్షణ దిగంబర్ జైన్ టెంపుల్. ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడి స్థానికులు అంటారు. కాని ఇప్పుడు ఇక్కడ ఉన్న నిర్మాణం మాత్రం 15 వ శతాబ్దానికి చెందినదిగా చెపుతారు. ఈ గుడి లోని శిల్ప కళా చాతుర్యం మనల్ని కట్టి పడేస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
చూడవలసినవి: దిగంబర్ జైన్ టెంపుల్, చేతితో ముద్రించిన వస్త్రాలు వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/sanganer.html హవా మహల్, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్, పాతబస్తీలోని జొహారీ బజార్ లో కలదు. దీన్ని మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ 1799 సంవత్సరంలో నిర్మించాడు. దీని రూపకర్త లాల్‌చంద్ ఉస్తా. శ్రీ కృష్ణుని కిరీటం ఆకారంలో ఉండే విధంగా దీన్ని నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వాళ్ళ కంటపడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చూసేందుకు వీలుగా ఇది నిర్మించబడింది. ఇందులో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తుని శరద్ మందిర్ అనీ, ఇక్కడ శరత్కాలపు ఉత్సవాలను జరుపుకునేవారు. రెండవ అంతస్తుని రతన్ మందిర్ అనీ, ఇక్కడి గోడలకు వివిధ రకాలైన గాజు పని మనం చూడవచ్చు. మూడవ అంతస్తుని విచిత్ర మందిర్ అనీ, ఇక్కడ మహారాజా వారు తమ ఇష్ట దైవమైన శ్రీకృష్ణున్ని కొలిచేవారు. నాలుగవ అంతస్తుని ప్రకాశ్ మందిర్ అనీ అంటారు. ఇక చివరిదైన ఐదవ అంతస్తుని హవా మందిర్ అనీ అంటారు. వీధి వైపు ఉన్న గోడకు 953 చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి. వీటి ద్వారా గాలి సులభంగా ప్రవేశిస్తుంది. ఈ ఐదవ అంతస్తు పేరుమీదుగానే ఈ మొత్తం కట్టడాన్ని హవా మహల్ అని పిలుస్తున్నారు.
చూడవలసినవి: హవా మహల్, గాల్తాజీ మందిరం, సిటీ ప్యాలెస్ , ఆల్బర్ట్ హాల్, ఇసార్ లట్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: http://letustravel.weebly.com/hawa-mahal.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలోని పాత బస్తీ లో కలదు. ఇసార్ లట్, దీనినే స్వర్గసులి అని కూడా అంటారు. దీనిని సవాయి ఈశ్వరీ సింగ్ 1749 లో ఒక యుద్దంలో గెలిచినందుకు సంకేతంగా నిర్మించాడు. ఇది ఏడు అంతస్తులుగా ఉంది. పాతబస్తీ గుండా వెళ్ళేటప్పుడు మనకు ఇది కనిపిస్తుంది. ఎందుకంటే పాతబస్తీలోనే ఇది ఎత్తైన నిర్మాణం. చాలా మందికి దీని పైకి కూడా వెళ్ళవచ్చును అనే విషయం తెలియదు. ఎందుకంటే ఇది సన్నగా ఎత్తుగా ఉండడంవల్ల . అక్కడ ఉండే వాళ్ళని అడిగితే తప్పకుండా దారి చూపెడతారు. లోపలినుండి మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఇరుకుగా అనిపిస్తుంది. పైకి వెళ్ళాక చూస్తే పాత బస్తీ మొత్తం కనిపిస్తుంది. మనం ఆకాశంలో నిలబడి చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సారి జైపూర్ వెళ్ళినప్పుడు దీనిని తప్పకుండా దర్శించండి.
చూడవలసినవి: ఇసార్ లట్ , సిటీ ప్యాలెస్ , గాల్టాజీ మందిరం, ఆల్బర్ట్ హాల్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/isar-lat.html ఇది రాజస్థాన్, జైపూర్ లో కలదు. ఈ పురాతన హిందూ దేవాలయం జైపూర్ లోని కొండల నడుమ ఉన్నది. ఇది జైపూర్ లోని ఓల్డ్ సిటీకి దగ్గరలో కలదు. కొండ ఎక్కుతుంటూనే మనకు చాలా కోతులు దర్శనమిస్తాయి. దీనినే ఇక్కకడి ప్రజలు కోతుల దేవాలయం అని కూడా పిలుస్తారు. ముందుగా కొండ ఎక్కిన తరవాత మళ్లీ కిందికి దిగాలి. అక్కడనుండి అసలైన ప్రయాణం మొదలవుతుంది. ప్రశాంతమైన వాతావరణం , చుట్టూ కొండలు మనల్ని పరవశింపజేస్తాయి. మొదటగా ఆంజనేయస్వామి దేవాలయం వస్తుంది. కొంచెం ముందుగా వెళితే గాల్త దేవాలయం వస్తుంది. దీని ముందు ఒక గుండం ఉంది. ఇక్కడ కోతులు ఈత కొడుతుంటే చూడటానికి భలే ముచ్చటేస్తుంది. ఇంకొంచెం ముందుగా వెళితే గోవు నోరు ఆకారం లో నుండి సన్నని నీళ్ళ ధారా కింద ఉన్న కొలనులో పడుతుంది. భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు. ఇంకా కొంచెం కిందిగా వెళితే విష్ణువు దేవాలయం ఉంది.ఇక్కడికి రావాలనుకునేవారు నీళ్ళు, ఆహారం వెంట తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తినుభండారాలు లభ్యం కావు.
చూడవలసినవి: గాల్ట మందిరం , సూర్య దేవాలయం, విష్ణువు దేవాలయం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కొండ కింది వరకు బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/galtaji.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలోని పాత బస్తీలో కలదు. ఇది పాత బస్తీలోని 1/7 వ వంతు భాగాన్ని ఈ ప్యాలెస్ ఆక్రమిచింది. రాజమందిర సముదాయం సవాయి జైసింగ్ చే 1729 మరియు 1732 మధ్య నిర్మించబడినది మరియు తరువాత వివిధ నిర్మాణాలు అతని వారసుల ద్వారా చేర్చబడ్డాయి. ఇది రాజపుత్రుల మరియు మొఘలుల నిర్మాణ శైలి యొక్క ఒక అద్భుతమైన కలయిక. ఈ ప్యాలెస్ నందు పెద్ద పరిమాణంలో మనకు కనిపించే రెండు వెండి పాత్రలు ప్రధానపు ఆకర్షణ . వీటినే గగాజలీస్ అని కూడా పిలుస్తారు. 1902, ఇంగ్లాండ్ లో కింగ్ ఎడ్వర్డ్ VII పట్టాభిషేక మహొత్సవమున, సవాయి మధో సింగ్ తన ఇంగ్లాండ్ పర్యటన సంధర్భంగా వాటిలో గంగా జలాన్ని తీసుకెళ్ళాడు. ఈ రెండు భారీ వెండి పాత్రలు ప్రపంచంలోనే అతి పెద్ద వెండి వస్తువులుగా గిన్నిస్ బుక్ లో చేర్చబడ్డాయి.
సందర్శన వేళలు : ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ప్రవేశ రుసుము: భారాతీయులకు రూ.75 మరియు విదేశీయులకు రూ.150 చూడవలసినవి: ముబారక్ మహల్, చంద్ర మహల్, గోవింద్ దేవ్ జీ ఆలయం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/city-palace.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలో కలదు. దీని సందర్శన మనకు ఒక ప్రత్యేక అనుభవాన్ని మిగిలుస్తుంది.ఆధునిక కంప్యూటరైజ్డ్ ప్రొజెక్షన్ వ్యవస్థ సహాయంతో దృశ్య ప్రదర్శన విద్యా విషయకంగా మరియు వినోదాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇంటరాక్టివ్ సైన్స్ మ్యూజియం, గ్రంధాలయం, కంప్యూటర్ సెంటర్, సమాచార ప్రాసెసింగ్ మరియు ఎనిమిది పరిశోధన విభాగాలను గురించిన ప్రచార సెల్, ఒక ప్రాసెసింగ్ ప్లానిటోరియం మరియు ఒక ఆడిటోరియం ఉంది. ఇక్కడన ఉన్న ఆడిటోరియం దేశంలోనే అతి పెద్ద ఆడిటోరియంలలో ఒకటి. దీని సామర్ధ్యం 1,350 మంది.
చూడవలసినవి: ప్లానిటోరియం, బిర్లా మందిర్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/birla-planetarium.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలో మోతి డోంగ్రీ కోట కింద ఉన్నది. దీనినే లక్ష్మీనారాయణ మందిరం అని కూడా అంటారు. దీనిని తెల్ల పాలరాతితో నిర్మించారు. పౌర్ణమి రోజున ఈ మందిరాన్ని నిండు వెన్నెల్లో చూడటానికి మన రెండు కండ్లు చాలవంటే నమ్మండి. ఈ మందిరంలోని లోపలి గోడల మీద భగవద్గీత మరియు ఉపనిషత్తులలోని శ్లోకాలను చెక్కిన తీరు అబ్బుర పరుస్తుంది. అంతే కాకుండా పురాణ గాథలను కూడా చిత్రాల రూపంలో ఆలయ లోపలిగోడల మీద మనం చూడవచ్చు. ఈ ఆలయానికి మూడు డోములు కలవు. ఒక్కొక్క డోము ఒక్కొక్క మతాన్ని (హిందూ , ముస్లిం, క్రిస్టియన్) సూచిస్తుంది. దీని దర్శించటానికి అనువైన సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు.
సందర్శన వేళలు : ఉదయం 8 నుండి మద్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు . చూడవలసినవి: మందిరం , ప్లానిటోరియం వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/birla-mandir.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|