జైనిమేడు తరవాత మలంపురా డ్యాం దగ్గరకు చేరుకున్నాం. ముందుగా రోప్ వేకి టికెట్స్ తీసుకున్నాం. రోప్ వే మీదినుంచి మలంపురా డ్యాం మరియు గార్డెన్ మొత్తం కనిపిస్తుంది. రోప్ వే మీద వెళ్తుంటే గాలిలో తేలుతున్నట్లు అనిపించిది. రోప్ వే మీద మొత్తంగా ఒక పదిహేను నిమిషాలు ఉంటాము. కిందికి వచ్చిన తరవాత గార్డెన్ లోకి వెళ్ళాము. ఇక్కడ ఉన్న గార్డెన్ చాలా పెద్దది. అలా నడుస్తూ డ్యాం మీదికి చేరుకున్నాం. అక్కడనుండి వెనక ఉన్న కొండలు మరియు నీళ్ళను చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపించింది. కాని దగ్గరలో చూడదగ్గ ప్రదేశాలు ఉండడంతో బయటికి వచ్చాము. పక్కనే ఉన్న అక్వేరియం , స్నేక్ పార్క్ మరియు రాక్ గార్డెన్ చూసి కోయంబత్తూర్ బయలుదేరాం.
(సశేషం)