చూడవలసినవి: హవా మహల్, గాల్తాజీ మందిరం, సిటీ ప్యాలెస్ , ఆల్బర్ట్ హాల్, ఇసార్ లట్
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి:
http://letustravel.weebly.com/hawa-mahal.html
హవా మహల్, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్, పాతబస్తీలోని జొహారీ బజార్ లో కలదు. దీన్ని మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ 1799 సంవత్సరంలో నిర్మించాడు. దీని రూపకర్త లాల్‌చంద్ ఉస్తా. శ్రీ కృష్ణుని కిరీటం ఆకారంలో ఉండే విధంగా దీన్ని నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వాళ్ళ కంటపడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చూసేందుకు వీలుగా ఇది నిర్మించబడింది. ఇందులో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తుని శరద్ మందిర్ అనీ, ఇక్కడ శరత్కాలపు ఉత్సవాలను జరుపుకునేవారు. రెండవ అంతస్తుని రతన్ మందిర్ అనీ, ఇక్కడి గోడలకు వివిధ రకాలైన గాజు పని మనం చూడవచ్చు. మూడవ అంతస్తుని విచిత్ర మందిర్ అనీ, ఇక్కడ మహారాజా వారు తమ ఇష్ట దైవమైన శ్రీకృష్ణున్ని కొలిచేవారు. నాలుగవ అంతస్తుని ప్రకాశ్ మందిర్ అనీ అంటారు. ఇక చివరిదైన ఐదవ అంతస్తుని హవా మందిర్ అనీ అంటారు. వీధి వైపు ఉన్న గోడకు 953 చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి. వీటి ద్వారా గాలి సులభంగా ప్రవేశిస్తుంది. ఈ ఐదవ అంతస్తు పేరుమీదుగానే ఈ మొత్తం కట్టడాన్ని హవా మహల్ అని పిలుస్తున్నారు.
చూడవలసినవి: హవా మహల్, గాల్తాజీ మందిరం, సిటీ ప్యాలెస్ , ఆల్బర్ట్ హాల్, ఇసార్ లట్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: http://letustravel.weebly.com/hawa-mahal.html
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|