జైపూర్ నగరానికి మూడు వైపులా మూడు కొండలు మరియు వాటిమీద కోటలు ఉన్నాయి. ఈ మూడు కోటలు జైపూర్ నగరానికి కాపలాగా ఉన్నాయి. అందులో నాహర్ గర్ కోట కూడా ఒకటి. నాహర్ గర్ కోటను జైపూర్ రాజు సవాయ్ జయ్ సింగ్ నిర్మించారు. ఈ కోట నిర్మాణం 1734 లో పూర్తిచేయ బడింది, ఇక్కడి ప్రసిద్ధ గోడలు, కోట బురుజులను సవాయ్ మాధో సింగ్ మహారాజు 1880 లో పునర్నిర్మించారు. ఈ కోట, ఆరావళీ పర్వత శ్రేణుల మధ్యలో, శాస్త్రీయ అందమైన సమ్మేళనంతో, యూరోపియన్ శైలితో నిర్మించారు. దీనికి జైపూర్ రాకుమారుడు నాహర్ సింగ్ పేరుపెట్టారు. అతని ఆత్మ కోట నిర్మాణ పనికి అడ్డుపడిందని, అతనికి గుర్తుగా కోట ప్రాంగణం లోపల దేవాలయం నిర్మించిన తరువాత ఆత్మ శాంతి౦చిందని నమ్మకం. నాహర్ గర్ అంటే ‘పులుల నివాస స్థలం’ అని అర్ధం. ఈ కోటలో రాజులు, వారి కుటుంబీకులు వేసవి విడిదిగా ఉపయోగించే మాధవేంద్ర భవనం ఉంది. ఇపుడు ఈ ప్రాంతం ప్రసిద్ధ విహార స్థలం.
చూడవలసినవి: కోట, మాధవేంద్ర భవన్
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/nahargarh-fort.html