జంతర్ మంతర్, జైపూర్
జైసింగ్ నిర్మించిన 5 అబ్జర్వేటరీలలోకీ అతి పెద్దది జైపూర్ లోని జంతర్ మంతర్. 1728-1734 మధ్యకాలంలో దీని నిర్మాణం జరిగింది. సువిశాలమైన ఉద్యానవనంలో ఎర్ర రాతితో కట్టిన ఈ వేదశాల 16 రకాల భారీ పరికరాల (యంత్రాల) సముదాయం. వీటిలో ఒకటైన 'లఘు సామ్రాట్ యంత్రం' జైపూర్ స్థానిక కాలాన్ని (20 సెకండ్ల తేడాతో) ఖచ్చితంగా లెక్కిస్తుంది. భూమధ్యరేఖ నుంచి నక్షత్రాలు, గ్రహాలు, ఎంత కోణంతో ఉన్నాయో 'చక్రయంత్రం'తో గణించేవారు. ఇక్కడ ఉన్న ఇతర పరికరాల ఖచ్చితత్వాన్ని జైప్రకాష్ యంత్రం నిర్థారిస్తుంది. జైసింగ్ తనే స్వయంగా దీన్ని కనిపెట్టాడని విశ్వసిస్తారు.12 భూభాగాలుగా ఉండే రాశి వలయ యంత్రాన్ని జాతక చక్రం వేయడానికి ఉపయోగించేవారు. దీనిలోని ఒక్కోభాగం ఒక్కోరాశికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రామ యంత్రం అనే మరో పరికరంతో ఆకాశమధ్యానికి, భూమ్యాకాశాలు కలిసే చోటుకు మధ్య వంపును కొలిచే వారు. 23 మీటర్ల ఎత్తు ఉండే సామ్రాట్ యంత్రంతో వర్షపాతాన్ని అంచనా వేసేవారు. ఇక్కడి ముఖ్య పరికరాలలో ‘ధ్రువ’, ‘దక్షిణ’, ‘నారివల్య’, ‘రాశివలయాస్’, ‘చిన్న సామ్రాట్’, ‘పెద్ద సామ్రాట్’, ‘పరిశోధక స్థానం’, ‘దిశా’, ‘చిన్న రాం’, ‘పెద్ద రాం’ యంత్రం, చిన్న ‘క్రాంతి’, పెద్ద ‘క్రాంతి’, ‘రాజ్ ఉన్నతాంశ’, ‘జై ప్రకాష్’, ‘దిగంత’ వంటి వాటిని చూడవచ్చు.జైసింగ్ నిర్మిత వేధశాలల్లో జైపూర్ అబ్జర్వేటరీ ఒక్కటే కాస్త దిలంగా ఉంది. మిగిలినవి శిథిలావస్థకు చేరాయి.
మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి:
http://letustravel.weebly.com/jantar-mantar.html