తిరువల్లువార్ తమిళనాడుకు చెందిన సుప్రసిద్ధ కవి, తిరుక్కురళ్ ను రచించినవాడు. తిరువల్లువార్ విగ్రహ పీఠభాగం 38 అడుగుల ఎత్తు, తిరువల్లువార్ విగ్రహం 95 అడుగుల ఎత్తు , మొత్తంగా 133 అడుగుల ఎత్తులో ఇది మనకు దర్శనమిస్తుంది. విగ్రహ పీఠభాగాన్ని లోపల మూడు అంతస్తులుగా నిర్మించారు. లోపల నుండి విగ్రహం దగ్గరకు వెళ్ళడానికి వీలుగా 140 మెట్లు ( 70 పైకి ఎక్కడానికి, 70 కిందికి దిగడానికి ) నిర్మించారు. విగ్రహం బరువు 2000 టన్నులు మరియు మొత్తం నిర్మాణం బరువు 7000 టన్నులు.
సందర్శన వేళలు: ఉదయం 8 నుండి సాయంతం 4 గం వరకు మాత్రమే.
చూడవలసినవి: వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కన్యాకుమారి నుండి ఫెర్రీ సౌకర్యం కలదు