చూడవలసినవి: భగవతి అమ్మన్ టెంపుల్, వాండరింగ్ మాంక్ ప్రదర్శన, మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. కన్యాకుమారి అనే పేరు కన్యాకుమారి అమ్మన్ పేరు మీదుగా వచ్చింది. భగవతి అమ్మన్ గుడి కుమారి పార్వతికి అంకితమీయబదినది. ఈ గుడి కన్యాకుమారి పట్టణం నందు త్రివేణి సంగమం వద్ద కలదు. పూర్వం బాణాసురుడనే రాక్షసుడు దేవతల మీద ఆధిక్యం సంపాధించి వారిని అనేక బాధలకు గురి చేస్తుండేవాడు. దేవతలు అందరూ బాణాసురుడి వినాశనం కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆదిపరాశక్తి ప్రభావంతో అందులోనుండి ఒక కన్య జనిస్తుంది. ఇంతలో పరమశివుడు ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. శివుడు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోగోరి అన్ని ఏర్పాట్లను చేయమని ఆదేశిస్తాడు. నారదుడి వలన శివుడు తన మార్గం నుండి పెండ్లిచేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతాడు.( ఒక కన్య మాత్రమే బాణాసురుడిని చంపగలదు. ఒక వేళ శివుడు ఆ కన్యను పెండ్లి చేసుకుంటే ఆ యజ్ఞ ఫలం వృధా అవుతుందని నారదుడు అలా శివుడిని వెళ్ళిపోయేటట్లుగా చేస్తాడు.) తర్వాత ఆ అమ్మాయి శివుడికోసం ఎదురుచూస్తూ అలా కన్యగానే ఉండిపోతుంది. తర్వాత కాలంలో బాణాసురుడిని సంహరించి దేవతలకు ఆ రాక్షస పీడ లేకుండా చేస్తుంది.
చూడవలసినవి: భగవతి అమ్మన్ టెంపుల్, వాండరింగ్ మాంక్ ప్రదర్శన, మ్యూజియం , వాచ్ టవర్, గాంధీజీ మండపం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ విగ్రహం వసతి : కన్యాకుమారి లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|