ఇదిలా ఉంటే పురాణాలలో ఛాయ అంటే నీడ కాకుండా ఛాయాదేవి సూర్యూడి భార్యగా, శనేశ్వరుడి తల్లి అని చెప్పుకునే వారు. అందుకే ఎక్కువ మంది ఇప్పటికీ ఛాయాసోమశ్వర ఆలయంలో అనేకమంది శనిపూజలు జరిపించుకుంటున్నారు. ఈ దేవాలయంలో పూజలు నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడినాయి.
రుద్రమదేవ మహారాజు పుణ్యముకై తాంత్రపాలుడు మల్లినాయకుడు ఉదయాదిత్య సముద్రం వెనుక అభినవ సోమనాథ పూజకై దానం చేసినట్లు ఒక శాసనం కలదు. ఈ అభినవ సోమనాథుడే ఛాయాసోమేశ్వరుడు. కాకతీయుల సామంత రాజైన శరపాణి దేవుడు ఛాయా సోమనాథుడిని అంగరంగ భోగాలకై తమ్మ సముత్రు, ఉదయ సముద్రం వెనుక దానం చేసినట్లుగా ఒక శాసనమున్నది. ఇతడే స్వామికి ద్వాదశ నివర్తనముల భూమినిచ్చినట్లు మరో శాశనంలో ఉంది. కాకతీయకుమార రుద్రమదేవ మహారాజుల రాజ్య కాలంలో సామంతుడగు మల్లికార్జున నాయకుడు తన రాజుకు పుణ్యంగా ఛాయాసోమనాథ దేవరకు ఉదయ సముద్రం దానమిచ్చినట్లు మరో శాసనంలో ఉంది.
చూడవలసినవి: ఛాయా సోమేశ్వర ఆలయం , పచ్చల సోమేశ్వరాలయం, మ్యూజియం
వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు.