చూడవలసినవి: వెల్లియంగిరి ఆండవార్ కోయిల్, కొండలపైన గల దేవాలయం, ధ్యాన లింగ
వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 30 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇది వెల్లియంగిరి కొండల అడుగు భాగంలో కలదు. వెల్లియంగిరి కొండల మీద (మొత్తం 7 కొండలు) కూడా ఒక శివాలయం ఉన్నది. మొదటగా దీనిని దర్శించుకున్న తరవాత కొండల మీదున్న శివుడిని దర్శించుకుంటారు. కొండలపైన ఉన్న గుడిని చూసి రావడానికి కనీసం 8-10 గంటల సమయం పడుతుంది. కావున చాలా మంది భక్తులు కొండల కింది భాగంలో ఉన్న శివుని గుడి వద్ద బస చేస్తారు.
చూడవలసినవి: వెల్లియంగిరి ఆండవార్ కోయిల్, కొండలపైన గల దేవాలయం, ధ్యాన లింగ వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
Leave a Reply. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|