చూడవలసినవి: రంగనాథర్ కోయిల్, టెన్ తిరుపతి
వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు.
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 30 కి.మీ దూరంలో గల కార్మడై అనే గ్రామంలో కలదు. ఇక్కడ ప్రధాన దైవం విష్ణువు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ రథోత్సవం నిర్వహిస్తారు. అప్పుడు చుట్టుపక్కల ప్రదేశాల నుండి చాలా మంది భక్తులు వస్తారు. ఈ గుడి ఆవరణలో ఆది శంకరాచార్యులవారికి కూడా ఒక గుడి కలదు. గుడికి కొంచెం దూరంలో ఒక కొలను కలదు. ఆ కొలనులోని చేపలకు భక్తులు ఆహారాన్ని ఇస్తుంటారు.
చూడవలసినవి: రంగనాథర్ కోయిల్, టెన్ తిరుపతి వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు.
0 Comments
ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 30 కి.మీ దూరంలో కలదు. మొదటగా పూండి చేరుకోవాలి. అక్కడ ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాక, వెల్లియంగిరి కొండల మీద ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడికి అన్ని సమయాలలో అనుమతి లేదు. కేవలం చైత్రమాసంలో (ఉగాది నుండి ఒక నెల రోజుల వరకు) మాత్రమే అనుమతిస్తారు. మొతం ఏడు కొండలు కలవు. ఏడు కొండల తరవాత శివాలయం వస్తుంది. వెళ్ళడం కొంచెం కష్టమే. చాలా మంది భక్తులు రాత్రివేళ బయలుదేరి, దర్శనం చేసుకొని ఉదయం వరకల్లా కిందికి చేరుకుంటారు. ఎందుకంటే రాత్రి వేళలో వాతావరణం చల్లగా ఉండడం వలన మనకు అంతగా బడలికగా అనిపించదు. ఒకవేళ ఉదయం బయలు దేరినట్లయితే, ప్రయాణం మద్యాహ్నం చేయాల్సి ఉంటుంది, అందులోనూ చాలా వేడిగా ఉండడం వలన, భక్తులు రాత్రివేళల్లో బయలుదేరుతారు. కొండలపైకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఒక వెదురు కర్ర లాంటిది తీసుకెళతారు. ఎందుకంటే కొండలు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ కర్ర సహాయం చాలా అవసరం. భక్తులు శివుడి దర్శనం తరవాత, కిందికి వచ్చాక ఆ కర్రని ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తారు. చూడవలసినవి: శివాలయం, కొండ కింద గల శివాలయం, ధ్యాన లింగ వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 30 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇది వెల్లియంగిరి కొండల అడుగు భాగంలో కలదు. వెల్లియంగిరి కొండల మీద (మొత్తం 7 కొండలు) కూడా ఒక శివాలయం ఉన్నది. మొదటగా దీనిని దర్శించుకున్న తరవాత కొండల మీదున్న శివుడిని దర్శించుకుంటారు. కొండలపైన ఉన్న గుడిని చూసి రావడానికి కనీసం 8-10 గంటల సమయం పడుతుంది. కావున చాలా మంది భక్తులు కొండల కింది భాగంలో ఉన్న శివుని గుడి వద్ద బస చేస్తారు.
చూడవలసినవి: వెల్లియంగిరి ఆండవార్ కోయిల్, కొండలపైన గల దేవాలయం, ధ్యాన లింగ వసతి: కోయంబత్తూరులో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది అమరావతి డ్యాం మరియు రిజర్వాయర్‌కు దగ్గరలోనే కలదు. ఇందులో చాలా మొసళ్ళు కలవు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మొసళ్ళకు ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వకండి. ఎందుకంటే మన చేతుల్ని మొసలి కోరికే ప్రమాదం ఉంది. మొసళ్ళు కదలకుండా చాలా సేపటివరకు అలాగే ఉంటాయి. కొన్ని సార్లు చూస్తున్న మనకు ఇవి నిజంగా మొసల్లేనా లేక బొమ్మలా అని అనిపిస్తాయి. అవి కదలట్లేదు కదా అని మీరు వాటిని కదిలించే ప్రయత్నం మాత్రం చేయకండి.
చూడవలసినవి: క్రోకొడైల్ ఫాం మరియు అమతావతి రిజర్వాయర్ వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 25 కి.మీ దూరంలో కలదు. డ్యాం కింది భాగంలో అమరావతి అమ్మవారి చిన్న గుడి కలదు. ఈ డ్యాంని ముఖ్యంగా వ్యవసాయం కోసం మరియు వరదలను నివారించడానికి కట్టబడినది. దీనిని 1957 లో కామరాజర్ హయాంలో నిర్మించారు. గత 2 సంవత్సరముల నుండి యాత్రికులకు బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తేబడినది.
చూడవలసినవి: అమతావతి రిజర్వాయర్, క్రోకొడైల్ ఫాం వసతి: పలనిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పలని నుండి మరియు ఉడుమలైపెట్టై నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది పొల్లాచిలోని ఎస్.ఎస్. కోయిల్ వీధిలో కలదు. ఈ గుడి 300 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెపుతారు. ఈ ఆలయపు గోపురం మీద గాంధీ, రామకృష్ణ పరమహంస మరియు బుద్దుడి ప్రతిమలు కలవు. ఆలయంలోని శిల్ప కళా సంపద మనల్ని ఆకట్టుకుంటుంది. ఆవు మరియు ఏనుగు రెండు ఉన్న ఒకే ప్రతిమలో రెండింటికి కలిపి ఒకే తల ఉండటం విశేషం.
చూడవలసినవి: అమ్మన్ కోయిల్ వసతి: పోల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచిలో లోకల్ బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు నుండి 65 కి.మీ దూరంలో కలదు. ఇది వాల్పరైకు అడుగుభాగంలో కలదు. దీనిని 1959-1969 మధ్యన అలియార్ నది మీద నిర్మించారు. సెప్టెంబర్ 2002 నుండి ఇక్కడ జల విద్యుత్ శక్తిని తయారు చేస్తున్నారు. డ్యాం కింది భాగంలో పార్క్, గార్డెన్, అక్వేరియం మరియు చిన్న థీమ్ పార్క్ ఉన్నాయి. ఈ రిజర్వాయర్ కొండల నడుమ ఉండడం వలన ఇక్కడికి చాలా మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ ఉండాలనుకునేవారు అటవీశాఖ వారి విశ్రాంతి గృహంలో ఉండవచ్చు. చెట్ల మీద కట్టిన గదులలాంటి వాటిలో బస చేయడం మరచిపోలేని అనుభూతి.
చూడవలసినవి: అరియార్ డ్యాం,మంకీ జలపాతాలు మరియు అంబరం పాలయం దర్గా వసతి: పోల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. ఇది పొల్లాచి నుండి 30 కి.మీ దూరంలోను మరియు అరియార్ డ్యాం నుండి 6 కి.మీ దూరంలోను కలదు. ఇది పొల్లాచి నుండి వాల్పరైకి వెళ్ళేదారిలో కలదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు జలపాతాల దగ్గరికి అనుమతించరు. అరియార్ డ్యాం నుండి 3 కి.మీ దూరం వెళ్ళిన తరవాత అటవీశాఖ వారి చెక్ పోస్ట్ కలదు. జలపాతాలకు వెళ్ళడానికి టికెట్ అక్కడే ఇస్తారు. ప్రవేశ రుసుము 15/-. జలపాతాల దగ్గర కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. దగ్గర ఒక కట్టె లాంటిది ఉంచుకుంటే మంచిది. లేకపోతే కోతులు బలవంతంగా మన దగ్గర ఉన్న వస్తువులను లాక్కుంటాయి. ఇక్కడి జలపాతాలు కొండల నడుమ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. వారాంతాల్లో చాలా మంది తమిళనాడు నుండే కాక కేరళ నుండి కూడా ఈ జలపాతాలను సందర్శిస్తారు.
చూడవలసినవి: మంకీ జలపాతాలు, అరియార్ డ్యాం వసతి: పోల్లాచిలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది తమిళనాడు. ఈరోడ్ జిల్లాలో కలదు. దీనినే లోయర్ భవాని డ్యాం అని కూడా అంటారు. ఈ డ్యాంను భవాని నది మీద కట్టారు. ఈ డ్యాం మెట్టుపాలయం మరియు సత్యమంగళం మధ్యన కలదు. ఇది సత్యమంగళం నుండి 16 కి.మీ దూరంలో కలదు. ఈ డ్యాం కు ముందు భాగంలో ఒక గార్డెన్ కలదు. ఇక్కడికి వారాంతాల్లో చాలా మంది తమ కుటుంబాలతో విహారానికి వస్తుంటారు.
చూడవలసినవి: భవాని సాగర్ డ్యాం వసతి : సత్యమంగలంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : కోయంబత్తూరు మరియు ఈరోడ్ నుండి ఆటోలు లభించును. ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. పానగల్లు పట్టణం శిల్పకళా సంపదకు నిలయం. కుందూరు చోడుల కాలంలో ఇక్కడ నిర్మించిన ఛాయసోమేశ్వరాలయం ప్రముఖమైనది. ఈ ఆలయం చుట్టూ గర్భగుడిలున్న దేవాలయం ఉన్నది. దీనిని త్రికుటాలయం అని పేర్కొంటారు. గర్భాలయంలో శివలింగం కనిపిస్తుంది. పూర్వం ఈ లింగం చుట్టూ నీరు పారుతూ పొలాలకు వెళ్లేదని పూర్వీకులు చెప్పుకునేవారు. అయితే నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తున్నా ఎక్కడికి వెళ్తుందన్న విషయం అర్థమయ్యేది కాదు. ఈ నీళ్లలో మునిగిన లింగంపై అన్ని కాలాలలో, అన్ని సమయాలలో స్తంభాకారంలో ఒక ఛాయ కనిపి స్తుంది. ఈ నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ మాత్రం కదల కుండా కనిపిస్తుంది. ఈ ఛాయ వలనే ఛాయసోమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది.
ఇదిలా ఉంటే పురాణాలలో ఛాయ అంటే నీడ కాకుండా ఛాయాదేవి సూర్యూడి భార్యగా, శనేశ్వరుడి తల్లి అని చెప్పుకునే వారు. అందుకే ఎక్కువ మంది ఇప్పటికీ ఛాయాసోమశ్వర ఆలయంలో అనేకమంది శనిపూజలు జరిపించుకుంటున్నారు. ఈ దేవాలయంలో పూజలు నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడినాయి. రుద్రమదేవ మహారాజు పుణ్యముకై తాంత్రపాలుడు మల్లినాయకుడు ఉదయాదిత్య సముద్రం వెనుక అభినవ సోమనాథ పూజకై దానం చేసినట్లు ఒక శాసనం కలదు. ఈ అభినవ సోమనాథుడే ఛాయాసోమేశ్వరుడు. కాకతీయుల సామంత రాజైన శరపాణి దేవుడు ఛాయా సోమనాథుడిని అంగరంగ భోగాలకై తమ్మ సముత్రు, ఉదయ సముద్రం వెనుక దానం చేసినట్లుగా ఒక శాసనమున్నది. ఇతడే స్వామికి ద్వాదశ నివర్తనముల భూమినిచ్చినట్లు మరో శాశనంలో ఉంది. కాకతీయకుమార రుద్రమదేవ మహారాజుల రాజ్య కాలంలో సామంతుడగు మల్లికార్జున నాయకుడు తన రాజుకు పుణ్యంగా ఛాయాసోమనాథ దేవరకు ఉదయ సముద్రం దానమిచ్చినట్లు మరో శాసనంలో ఉంది. చూడవలసినవి: ఛాయా సోమేశ్వర ఆలయం , పచ్చల సోమేశ్వరాలయం, మ్యూజియం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|