ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు గోనాగ చతుర్ముఖుడుగా రూపుదిద్దుకున్నాడు. ఈ సారి సామివారి విగ్రహానికి ఇరువైపులా రెండు విగ్రహాలను ఏర్పాటు చేసారు. స్వామివారి కుడి వైపు రాములవారి విగ్రహం మరియు ఎడమవైపు భువనేశ్వరి మాత విగ్రహాలు కలవు. ఈ రెండు విగ్రహాలను యాదగిరి గుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లోటస్ ఆలయంలో ఏర్పాటు చేసే మ్యూజియంలో ఉంచేందుకు తరలిస్తున్నారు.
0 Comments
ఇది ఉప్పల్ లోని స్టేడియంకు దగ్గరలో కలదు. వెలుగు గుట్ట అని అడిగితే ఎవరైనా చెబుతారు. ఇక్కడ శివాలయంతో పాటు ఆంజనేయస్వామి గుడి మరియు అమ్మవారి గుడి కలదు. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉన్నదని ఇక్కడ పూజారి చెప్పారు. అది నిజాం కాలం. ఇప్పుడు ఉప్పల్ ఉన్న ప్రాంతం అప్పుడు అటవీ ప్రాంతం. ఇక్కడికి నిజాం నవాబులు గుర్రం మీద విహారానికి వచ్చేవారట. నిజాం ప్రభువులకు తెలియకుండా కొందరు యాదవులు ఇక్కడ గొర్రెలు కాచుకునేవారట. ఒకరోజు ఇద్దరు యాదవులకు రెండు గుండ్ల మధ్య ఒక శివలింగం కనిపించింది. అప్పటి నుండి ఆ ఇద్దరు యాదవులు సంవత్సరానికి ఒక రోజు అక్కడ దీపం వెలిగించి పూజించేవారట. తదనంతర కాలంలో ఈ ఉప్పల్ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ గా మార్చారు. ఇక్కడ ఉన్న సర్పంచులు ఈ వెలుగు గుట్ట ప్రాంతాన్ని శివుడి ఆలయం కోసం కేటాయించారు. తరవాత కొంత మంది దాతల సహాయంతో ఈ గుడిని నిర్మించారు. ఇక్కడి అమ్మవారి ఆలయంలో అష్టాదశ శక్తి పీఠముల యొక్క దేవతా మూర్తులతో వివరాలను కూడా ఇక్కడ పొందుపరచారు. ఇక్కడ కొండ మీద శ్రీ కోందండ రామస్వామి ఆలయం కూడా కలదు. దీనిని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దాతలు ఎవరైనా ఈ ఆలయపు నిర్మాణానికి సహకరించగలరని మనవి.
ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. పానగల్లు పట్టణం శిల్పకళా సంపదకు నిలయం. కుందూరు చోడుల కాలంలో ఇక్కడ నిర్మించిన ఛాయసోమేశ్వరాలయం ప్రముఖమైనది. ఈ ఆలయం చుట్టూ గర్భగుడిలున్న దేవాలయం ఉన్నది. దీనిని త్రికుటాలయం అని పేర్కొంటారు. గర్భాలయంలో శివలింగం కనిపిస్తుంది. పూర్వం ఈ లింగం చుట్టూ నీరు పారుతూ పొలాలకు వెళ్లేదని పూర్వీకులు చెప్పుకునేవారు. అయితే నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తున్నా ఎక్కడికి వెళ్తుందన్న విషయం అర్థమయ్యేది కాదు. ఈ నీళ్లలో మునిగిన లింగంపై అన్ని కాలాలలో, అన్ని సమయాలలో స్తంభాకారంలో ఒక ఛాయ కనిపి స్తుంది. ఈ నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ మాత్రం కదల కుండా కనిపిస్తుంది. ఈ ఛాయ వలనే ఛాయసోమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది.
ఇదిలా ఉంటే పురాణాలలో ఛాయ అంటే నీడ కాకుండా ఛాయాదేవి సూర్యూడి భార్యగా, శనేశ్వరుడి తల్లి అని చెప్పుకునే వారు. అందుకే ఎక్కువ మంది ఇప్పటికీ ఛాయాసోమశ్వర ఆలయంలో అనేకమంది శనిపూజలు జరిపించుకుంటున్నారు. ఈ దేవాలయంలో పూజలు నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడినాయి. రుద్రమదేవ మహారాజు పుణ్యముకై తాంత్రపాలుడు మల్లినాయకుడు ఉదయాదిత్య సముద్రం వెనుక అభినవ సోమనాథ పూజకై దానం చేసినట్లు ఒక శాసనం కలదు. ఈ అభినవ సోమనాథుడే ఛాయాసోమేశ్వరుడు. కాకతీయుల సామంత రాజైన శరపాణి దేవుడు ఛాయా సోమనాథుడిని అంగరంగ భోగాలకై తమ్మ సముత్రు, ఉదయ సముద్రం వెనుక దానం చేసినట్లుగా ఒక శాసనమున్నది. ఇతడే స్వామికి ద్వాదశ నివర్తనముల భూమినిచ్చినట్లు మరో శాశనంలో ఉంది. కాకతీయకుమార రుద్రమదేవ మహారాజుల రాజ్య కాలంలో సామంతుడగు మల్లికార్జున నాయకుడు తన రాజుకు పుణ్యంగా ఛాయాసోమనాథ దేవరకు ఉదయ సముద్రం దానమిచ్చినట్లు మరో శాసనంలో ఉంది. చూడవలసినవి: ఛాయా సోమేశ్వర ఆలయం , పచ్చల సోమేశ్వరాలయం, మ్యూజియం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. ఇది పానగల్లు మ్యూజియంకు ముందు భాగంలో కలదు.ఇది అన్యమతస్తుల దుశ్చర్యలకు గురైనట్లు తెలుస్తున్నది. దేవాలయం పైభాగం సింహ ద్వారంలోని గజేంవూదుల తొండాలు దెబ్బతిని కనిపిస్తున్నాయి. ఈ ఆలయం నల్లరాతితో నిర్మించబడినది. రామాయణ, మహాభారతాది ఘట్టాలతో సహా ఎన్నో శిల్పాలు ఈ ఆలయ ప్రాకారాలందూ గోడలపై చెక్కబడినాయి. పచ్చల సోమేశ్వ రాలయ పునరుద్ధరణకు 1923లో నిజాం ప్రభువు ప్రధాన మంత్రైన మహారాజు సర్కిషన్ ప్రసాద్ బహుద్దర కృషి చేసినాడు. ఈ ఆలయంలోని లింగమునకు ఒక పెద్ద మచ్చ(రత్నం) పాదగబడి ఉండేనని, దేవుడి ఆలంకరణకు పచ్చల హారాలు వేయించి ఉండే వారని, తద్వారా దీనికి పచ్చల సోమేశ్వర ఆలయమనే పేరు వచ్చిందని తెలుస్తున్నది. ఇక్కడే మరొక వైష్ణవ ఆలయం ఉన్నదు. పైరెండు ఆలయాలకన్నా ఇది కొంచే ఆధునిక తపం. ప్రస్తుతం ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ అష్టధిక్పాలక శిల్పములు, బుగ్వేదమునందు ప్రధాన దేవతలుగా ఇంద్ర, అగ్రి, వర్ణ, కుబేరా, వాయువులు స్తుతించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రాచీన నగరాల్లో ఒకటైన పానగల్లు పట్టణం క్రీ.శ 11-12 శతాబ్ధాలలో కందూరు చోళుల రాజధానిగా ఉండేది. ఇక్కడ కాకతీయులకు సామంతులైన కందూరు చోళులు పచ్చల సోమేశ్వరాలయాన్ని నిర్మించారు. నల్ల శానపు రాళ్ళపై రమ్యంగా మలచిన శిల్పాలు, ఆలయాలు, మధ్యయుగ వాస్తు శిల్ప సాంప్రదాయాలకు అడ్డం పడుతున్నాయి. తూర్పు వైపున ఒకటి, పశ్చిమం వైపున మూడు ఆలయాలను 70 స్తంభాలతో నిర్మించిన మహామండపం కలుపుతూ ఉంది. ఆలయం గోడలపైన, మండపం స్తంభాలపైన చెక్కిన శివ, అష్టదిక్పాల, భారత, రామాయణ గాథలు, సమకాలీన జీవన విదానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. చూడవలసినవి: పచ్చల సోమేశ్వరాలయం,మ్యూజియం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది ఆంధ్రప్రదేశ్, నల్గొండ జిల్లాలో కలదు. ఇది నల్గొండ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో గల పానగల్లు అనే గ్రామంలో కలదు. దీనిని 1994 లో పురావస్తు శాఖవారు పచ్చల సోమేశ్వరాలయం వెనుక భాగంలో నెలకొల్పారు. జిల్లాలో లభ్యమయిన శిలాసంపదను సేకరించి మ్యూజియంలో ఉంచారు. ముఖ్యంగా ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, వంటపాత్రలు, లిపి , దేవతా విగ్రహాలు, అప్పటి నాణేలు మొదలగునవి ఇక్కడ కళ్లకు కట్టినట్లు దర్శమిస్తాయి. ఈ మ్యూజియంలో 1 వ శతాబ్ధం నుండి 18 వ శతాబ్ధం వరకు శిలాశాసనాలు, ఆయుధాలు, శిల్పాలు పొందుపరచడం జరిగింది. ప్రతి సోమవారం సెలవు దినం. సందర్శన వేళలు : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు.
చూడవలసినవి: మ్యూజియం, పచ్చల సోమేశ్వరాలయం వసతి: నల్గొండలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : నల్గొండ నుండి బస్సు సౌకర్యం కలదు. ఇది నల్లగొండ జిల్లాలో కలదు. హైదరాబాద్ నుండి 150 కి.మీ దూరంలో ఉన్నది. పూర్వం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి పట్టణంలో కలసి ఉండేది. . ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అతి విశాలమైన నాగార్జునసాగర్ డ్యాంను చూసి భావుకత్వంతో "ఆధునిక దేవాలయంగా" అభివర్ణించాడు. ఈ జలాశయం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకొని పరవళ్ళు త్రొక్కుతూ ఉంది. వర్షాకాలంలో కృష్ణవేణమ్మ మరింతగా ఉప్పొంగి పొరలుతుంది.
చూడవలసినవి: డ్యాం, నాగార్జున కొండ వసతి : నాగార్జునసాగర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/nagarjuna-sagar.html ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గోపలాయపల్లి గ్రామంలో కొండపైన ఉన్నది. ఇది హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాలకు మరియు నార్కెట్ పల్లి మద్యన ఉన్నది. మెయిన్ రోడ్ నుండి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు. ఇక్కడ ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. ఈ ఆలయం పచ్చని ప్రకృతి మద్య మనసుకు హాయి గొల్పుతుంది. ఈ ఆలయం ముందు సహజ సిద్దమైన కోనేరు కలదు.ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జాతర జరుగుతుంది. అప్పుడు చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలు మరియు హైదరాబాద్ నుండి కూడా చాలా మంది భక్తులు దీనిని దర్శిస్తారు.
చూడవలసినవి: వేణుగోపాలస్వామి ఆలయం ,శివాలయం , శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వసతి : కొండపైన ఉండడానికి వసతి సౌకర్యం కలదు. అందుబాటు : చిట్యాల మరియు నార్కెట్ పల్లి నుండి గోపాలాయపల్లి మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/gopalayapalli.html ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో కొండపైన ఉన్నది. ఇది హైదరాబాద్- నల్లగొండ రహదారిపై నార్కెట్ పల్లి నుండి 6 కి.మీ దూరంలో ఉన్నది. ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ నుండి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ మూడు గుండ్లు. మూడు గుండ్ల పైన శివుడు, లింగాకార రూపంలో మనకు దర్శనమిస్తాడు. ప్రతి సోమవారం ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జాతర జరుగుతుంది.
చూడవలసినవి: శివాలయం , మూడుగుండ్లు, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం వసతి : కొండపైన ఉండడానికి వసతి సౌకర్యం కలదు. అందుబాటు : నల్లగొండ మరియు నార్కెట్ పల్లి నుండి ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు.అక్కడి నుండి కొండపైకి వెళ్ళడానికి ఆటోలు లభిస్తాయి. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/cheruvugattu.html ఇది నల్లగొండ మరియు వరంగల్ సరిహద్దులో ఉన్నది. ఇది నల్లగొండ నుండి 110 కి.మీ, వరంగల్ నుండి 80 కి.మీ దూరంలోను ఉన్నది. ఇది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రహదారిపై ఆలేర్ నుండి 8 కి.మీ దూరంలో ఉన్నది. జైనులు ఈ ప్రాంతాన్ని తమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇంకా ఇక్కడ పలు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుని విగ్రహం చూడొచ్చు. ఇంకా జైన మతం ఆంధ్రప్రదేశ్ లో ఎంతగా గుర్తింపు పొందిందో ఈ కొలనుపాకలో తెలుసుకోవచ్చు.
చూడవలసినవి: జైన్ మందిరం వసతి : జైన్ మందిరంలో ఉండటానికి వసతి కలదు. అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఆలేర్ వరకు బస్సులో చేరుకోవచ్చు. ఆలేర్ నుండి కొలనుపాకకు ఆటోలు లభిస్తాయి. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/kolanupaka.html ఇది భువనగిరి పట్టణంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 51 కి.మీ దూరంలో ఉన్నది.భువనగిరి బస్సు స్టాండ్ వెనకాల ఈ కోట మనకు దర్శనమిస్తుంది. అక్కడినుండి 5 నిమిషాల నడకతో కోటను చేరుకోవచ్చు. ఎత్తయిన కొండపై నిర్మితమైనది . ఈ కోట 40 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడి ఉన్నది. చాళుక్య వంశస్తుడైన త్రిభువనముల్లు విక్రమాదిత్యుడు ఈ కోట నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.
చూడవలసినవి: కోట వసతి : ఈ పట్టణంలో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : ఈ పట్టణం హైదరాబాద్ - వరంగల్ హైవే ఫై ఉన్నది . ఇక్కడికి బస్సులో వెళ్ళడం చాలా సులభం. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/bhuvanagiri.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|