చూడవలసినవి: దిగంబర్ జైన్ టెంపుల్, చేతితో ముద్రించిన వస్త్రాలు
వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : బస్సు సౌకర్యం కలదు.
మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి :
http://letustravel.weebly.com/sanganer.html
ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణం నుండి 12 కి మీ దూరంలో కల సంగనేర్ అనే గ్రామంలో కలదు. ఈ సంగనేర్ అనే గ్రామం చేతితో ముద్రించిన వస్త్రాలు మరియు చేతితో తయారు చేసిన పేపర్ కి ప్రసిద్ధి. ఇక్కడ ఉండే అన్ని షాప్స్ లోనూ ఇవి లభిస్తాయి. ఈ సంగనేర్లో మరొక ప్రధాన ఆకర్షణ దిగంబర్ జైన్ టెంపుల్. ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడి స్థానికులు అంటారు. కాని ఇప్పుడు ఇక్కడ ఉన్న నిర్మాణం మాత్రం 15 వ శతాబ్దానికి చెందినదిగా చెపుతారు. ఈ గుడి లోని శిల్ప కళా చాతుర్యం మనల్ని కట్టి పడేస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
చూడవలసినవి: దిగంబర్ జైన్ టెంపుల్, చేతితో ముద్రించిన వస్త్రాలు వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/sanganer.html
0 Comments
ఇది కోయంబత్తూర్ నుండి 30 కి మీ దూరంలో కలదు. ఈ ధ్యాన లింగం ప్రవేశించడానికి ముందే మన దగ్గర ఉన్న మొబైల్స్, కెమెరాస్ అన్నీ డిపాజిట్ చేయించుకుంటారు. బాగ్స్ మాత్రం లోపలికి తీసుకొని పోవచ్చు. మన వస్తువులు డిపాజిట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే కుడి చేయి వైపు ఒక పెద్ద సూర్య గుండం ఉంటుంది. ఆ గుండం లోపల మూడు శివ లింగాలు ఉన్నాయి. ఆ గుండంలో వాటర్ ఫాల్ లాంటిది ఏర్పాటు చేసారు అందులో స్నానం చేసి ఆ మూడు లింగాలను దర్శించుకోవచ్చు. స్నానం చేయడానికి భక్తులకు కాషాయం వస్త్రాలు కూడా ఇస్తారు. ఇది మగవాళ్ళకు మాత్రమే. ఆడవాళ్లకు కూడా లోపల చంద్ర గుండం కలదు. ఈ సూర్య గుండం ఒడ్డున ఒక స్తంభానికి నాగ పడగ చెక్కి ఉంది. ఇక్కడికి అందరూ వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. సూర్య కుండంలో నుండి బయటకి వచ్చాక ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకు ముందుగా ఒక కొలనులాంటిది కనిపిస్తుంది అందులో తామర పూలు, ఆరెంజ్ కలర్ చేపలు చాలా చూడముచ్చటగా అనిపించాయి. కొలనుకు దగ్గరలో ఒక చిన్న పాటి నర్సరీ కూడా కలదు. అక్కడినుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు లింగ భైరవి గుడి కనిపిస్తుంది. ఆ గుడి లోపల మధ్యలో ఒక త్రిశూలం ఉంది దానికి అన్నీ పసుపు కొమ్ములు కట్టబడి ఉన్నాయి. ఆ గుడికి ఎదురుగా ఒక పెద్ద బండ రాయి మీద మూడు శివునికి యొక్క ఆకారాలు చెక్కబడి ఉన్నాయి. మొదటి శివుని ఆకారం పూర్తిగా కళ్ళు మూసుకొని, నుదుటి మీద సగం చంద్రుని ప్రతిమ కలిగి ఉంది, అంటే శివుడు ధ్యానం చేస్తూ,చాలా శాంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది . రెండవ శివుని ఆకారం సగం కళ్ళు తెరుచుకొని, నుదుటి మీద త్రినేత్రం కలిగి ఉంది అంటే మాములుగా శివుడి రూపాన్నీ తలపిస్తుంది. మూడవ శివుని ఆకారం పూర్తిగా కళ్ళు తెరుచుకొని, నుదుటి మీద సూర్యుడి ప్రతిమ ఉంది అంటే శివుడు ఆగ్రహంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇంకొంచెం లోపలి వెళ్తే అక్కడ వెదురుతో చేయబడిన ఒక చిన్న గుడిసెలో ఓంకార్ గుడి కనిపిస్తుంది. అది తెరిఛి ఉండబడే సమయం 12.30 pm - 1.30 pm మాత్రమే. ఇంకా కొంచెం లోపలి వెళ్తే చంద్ర గుండం కనిపిస్తుంది అదే ముందుగా చెప్పినట్టు ఆడవాళ్ళ కోసం కట్టిన గుండం. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ద్యానలింగం. ధ్యాన లింగానికి వెళ్ళడానికి ముందుగా మరొక చెక్ పాయింట్ . ఇక్కడ మనతో పాటు తెచ్చుకున్న బాగ్స్ ని కూడా డిపాజిట్ చేయాలి.ఇక్కడి నుండి మహిళలను వాళ్ళ కాళ్ళకు పట్టీలు ఉంటె అనుమతించరు. వాటిని కూడా తీసివేయాలి.(లోపలికి వెళ్ళాక ధ్యానం చేసుకునే వాళ్లకు మహిళల కాళ్ళకు ఉండే పట్టీల వల్ల వచ్చే శబ్దం వల్ల ధ్యాన భంగమవుతుందని). అక్కడ నుండి ధ్యాన లింగలోకి ప్రవేశించగానే, అక్కడే వరండాలో ఉన్న సహాయకులు ఎవరిని కూడా మాట్లాడ వద్దనీ, అక్కడ కూర్చోమని సైగలతో చెప్తున్నారు. అక్కడ కొద్ది నిముషాలు కూర్చున్నాక లోపలికి పంపిస్తారు.(ప్రధాన ధ్యాన లింగంలో కూర్చున్న వాళ్ళు బయటికి వచ్చాక వరండాలో కూర్చున్న వాళ్ళని లోనికి అనుమతిస్తారు.) లోపల డోము ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది. అందులో మధ్యలో పెద్ద శివ లింగం, దానికి ఎదురుగా ధ్యానలింగం బయట ఒక నంది విగ్రహం కలదు. శివ లింగం చుట్టూ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వీలుగా 28 చిన్న చిన్న గుహలు ఉన్నాయి. కొద్ది సేపు ధ్యానం చేసిన తరవాత ఒక చిన్న ఘంట మోగుతుంది (వినపడీ వినపడనట్టుగా). అప్పుడు లోపల ఉన్నవాళ్ళు బయటికి వెళ్తారు. వరండాలో కూర్చున్న వాళ్ళు లోపలి వస్తారు. లోపలికి కేమెరాలు అనుమతించరు అని చెప్పారు కదా మరి ఫోటోలు ఎలా తీసారంటారా ! అంతర్జాలం ఉంది కదండీ!!!!!
ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి పొల్లాచ్చికి వెళ్ళే మార్గంలో, 13 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న వినాయకుణ్ణి ఎచనారి వినాయకర్ అంటారు. తమిళనాడులోని అన్ని వినాయకుని గుడులల్లోకెల్లా దీనిని ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ గుడిలోని వినాయకుడి విగ్రహం 6 అడుగుల ఎత్తు మరియు 3 అడుగుల వెడల్పుతో ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి క్రీ శ 1500 నాటి ఒక చరిత్ర ఉంది. నిజానికి ఇక్కడ ఉన్న మూల విరాట్ ఈ ఆలయం కోసం తయారు చేయబడింది కాదు. పేరూర్ లోని పట్టీశ్వరర్ ఆలయం కోసం (ఇది కూడా కోయంబత్తూరు లోనే కలదు) తయారుచేయబడింది. మధురై నుండి పేరూర్ వెళ్ళే క్రమంలో ఈ విగ్రహం ఎచనారిలో వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. అప్పటినుండి ఈ వినాయకుడి విగ్రహం ఎచనారిలోనే పూజలు అందుకుంటూ ఎచనారి వినాయకర్ అయ్యాడు.
చూడవలసినవి: ఎచనారి ఆలయం వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/eachanari-temple.html హరిత నగరం కోయంబత్తూర్ లోని రేస్ కోర్స్ రోడ్డు రేసులకు నిలయం కాదు. జనావాసం, పెద్ద పెద్ద భవంతులతో పాటు , పలు చారిత్రాత్మక కట్టడాల తాలూకు మీనియేచర్లు ఈ రోడ్డులోని ప్రధానమైన ఆకర్షణ. ప్రతి రొజూ ప్రాతః సంధ్యాకాలాల్లో ఈ విశాలమైన రోడ్డు పాదచారుల స్వర్గంగా మారిపోతుంటుంది. రేస్ కోర్స్ రోడ్డు లోని పచ్చని చెట్లు స్వచ్ఛమైన ఆమ్లజనిని అందిస్తుండటం వల్ల కోవై కార్పోరేషన్ సైతం దీనిపైన అత్యంత శ్రద్ధ కనబరుస్తూ దీన్ని యాత్రా సందర్శక స్థలంగా పర్యాటకుల స్వర్గధామంగా మార్చింది.
ప్రపంచాన్ని చూసినట్లే కోవై నగరవాసులకు ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. అదేమంటే ఏ రోజైతే కోవై పూర్తి కట్టడాలతో మారిపోతుందో.. అప్పుడు శ్రీకృష్ణుడు తిరిగి జన్మించి అలాంటి నిర్మాణాలు చేసిన వారిని శిక్షిస్తాడని, ఈ నమ్మకం ఉండబట్టే ఇంకా కోవై పచ్చని చెట్లతో అలరారుతోందని వారి విశ్వాసం. సరే ఇక ఈ రోడ్డుకు వస్తే ప్రపంచాన్ని ఎలా చూసినట్లు అవుతుందో చెప్పుకుందాం. వాకర్లు నడిచే కుడి-ఎడమ వైపు పెంచిన పచ్చిక బయళ్ళలో ప్రపంచంలోని అతి సుప్రసిద్దమైన భవంతుల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేసారు. ఎర్రకోట (రెడ్ ఫోర్ట్ ), సెల్యూలర్ జైలు, బహాయి టెంపుల్, ఒక పక్కకు ఒరిగి ఉన్న పీసా గోపురం,హవా మహల్ , ఈఫిల్ టవర్, రాష్ట్రపతి భవనం ఇలా అనేక ప్రముఖ కట్టడాల నమూనాలు ఈ పచ్చిక బయళ్ళలో అందంగా అలంకరించారు. వీటిని చూస్తుంటే ఆయా దేశాలకు వెళ్లి వాటి ముందు నిల్చొని చూస్తున్న భావన కల్గేలా వీటిని నిర్మించారు. కోవై వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ రేస్ కోర్స్ రోడ్ లో ఒకసారి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరిగి చూడాల్సిందే. అంతటి సౌందర్యం కోయంబత్తూర్ లోని ఈ రోడ్డుకు మాత్రమే సొంతం. హవా మహల్, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్, పాతబస్తీలోని జొహారీ బజార్ లో కలదు. దీన్ని మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ 1799 సంవత్సరంలో నిర్మించాడు. దీని రూపకర్త లాల్‌చంద్ ఉస్తా. శ్రీ కృష్ణుని కిరీటం ఆకారంలో ఉండే విధంగా దీన్ని నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వాళ్ళ కంటపడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చూసేందుకు వీలుగా ఇది నిర్మించబడింది. ఇందులో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తుని శరద్ మందిర్ అనీ, ఇక్కడ శరత్కాలపు ఉత్సవాలను జరుపుకునేవారు. రెండవ అంతస్తుని రతన్ మందిర్ అనీ, ఇక్కడి గోడలకు వివిధ రకాలైన గాజు పని మనం చూడవచ్చు. మూడవ అంతస్తుని విచిత్ర మందిర్ అనీ, ఇక్కడ మహారాజా వారు తమ ఇష్ట దైవమైన శ్రీకృష్ణున్ని కొలిచేవారు. నాలుగవ అంతస్తుని ప్రకాశ్ మందిర్ అనీ అంటారు. ఇక చివరిదైన ఐదవ అంతస్తుని హవా మందిర్ అనీ అంటారు. వీధి వైపు ఉన్న గోడకు 953 చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి. వీటి ద్వారా గాలి సులభంగా ప్రవేశిస్తుంది. ఈ ఐదవ అంతస్తు పేరుమీదుగానే ఈ మొత్తం కట్టడాన్ని హవా మహల్ అని పిలుస్తున్నారు.
చూడవలసినవి: హవా మహల్, గాల్తాజీ మందిరం, సిటీ ప్యాలెస్ , ఆల్బర్ట్ హాల్, ఇసార్ లట్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: http://letustravel.weebly.com/hawa-mahal.html బెతెస్డ ( అంతర్జాతీయ ప్రార్ధనా మందిరం), ఇది తమిళనాడు కోయంబత్తూరు లో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 25 కి. మీ దూరంలో , కోవై కుట్రాలంకు వెళ్ళే దారిలో కారుణ్య నగర్ లో కలదు. ఇక్కడికి భక్తులు వివిధ రకాల ప్రార్ధనలు చేయడానికి వస్తారు. ఈ చర్చి లో వివిధ ప్రత్యెక ప్రార్ధనా మందిరాలు కలవు. ఆరుబయట అక్కడక్కడ ప్రార్ధనలు చేసుకోవడానికి చిన్న చిన్న గోపురాలాను నిర్మించారు. ఏసు క్రీస్తు జీవిత గాథను తెలిపే 7 నిర్మాణాలు మనల్ని అలరిస్తాయి. ఇక్కడ ఉండటానికి వసతి సౌకర్యం కూడా కలదు.
చూడవలసినవి: చర్చి , కోవై కుట్రాలం వసతి : ఇక్కడనే వసతి కలదు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/bethesda.html ఇది రాజస్తాన్, జైపూర్ పట్టణంలోని పాత బస్తీ లో కలదు. ఇసార్ లట్, దీనినే స్వర్గసులి అని కూడా అంటారు. దీనిని సవాయి ఈశ్వరీ సింగ్ 1749 లో ఒక యుద్దంలో గెలిచినందుకు సంకేతంగా నిర్మించాడు. ఇది ఏడు అంతస్తులుగా ఉంది. పాతబస్తీ గుండా వెళ్ళేటప్పుడు మనకు ఇది కనిపిస్తుంది. ఎందుకంటే పాతబస్తీలోనే ఇది ఎత్తైన నిర్మాణం. చాలా మందికి దీని పైకి కూడా వెళ్ళవచ్చును అనే విషయం తెలియదు. ఎందుకంటే ఇది సన్నగా ఎత్తుగా ఉండడంవల్ల . అక్కడ ఉండే వాళ్ళని అడిగితే తప్పకుండా దారి చూపెడతారు. లోపలినుండి మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఇరుకుగా అనిపిస్తుంది. పైకి వెళ్ళాక చూస్తే పాత బస్తీ మొత్తం కనిపిస్తుంది. మనం ఆకాశంలో నిలబడి చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సారి జైపూర్ వెళ్ళినప్పుడు దీనిని తప్పకుండా దర్శించండి.
చూడవలసినవి: ఇసార్ లట్ , సిటీ ప్యాలెస్ , గాల్టాజీ మందిరం, ఆల్బర్ట్ హాల్ వసతి : జైపూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : బస్సు సౌకర్యం కలదు. మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/isar-lat.html చాలా రోజుల నుండి కోవై కుట్రాలం వెళ్ళాలని అనుకున్నా, వేరే వేరే కారణాలవల్ల వెళ్ళలేక పోయాము. ఒకరోజు పేపర్ చదువుతుంటే ఈ సీజన్ లో ఈరోజు నుండే కోవై కుట్రాలంకు సందర్శుకులను అనుమతిస్తున్నారని తెలిసింది. (అంతకు మునుపు ఎందుకు సందర్శుకులను అనుమతించలేదంటే నీళ్ళు లేనందున. ఋతుపవనాలు మొదలవడం వల్ల ఈ మధ్య వర్షాలు పడడంతో నీటి ప్రవాహం పెరిగింది.) ఆరోజు బుధవారం కావడంతో వారాంతంలో వెళ్ళొచ్చు అని శనివారం ప్లాన్ చేసుకున్నాం. ఇది కోయంబత్తూర్ నుండి 30 కి.మీ దూరంలో కలదు. శనివారం ఉదయం బయల్దేరి అక్కడికి చేరుకునే సరికి 9 గంటలు అయింది.
అక్కడికి వెళ్ళాక తెలిసిందేమంటే ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 3.30 వరకు మాత్రమే సందర్శుకులకు ప్రవేశం. అప్పటికే అక్కడికి చేరుకున్న సందర్శుకులతో మాటలు కలిపాను. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు మరియు తినుభండారాలు సైతం ప్లాస్టిక్ ప్యాకింగ్ తో ఉంటే వాటిని లోనికి అనుమతించరు. అక్కడి నుండి ఒక 100 మీ. దూరంలో అటవీ శాఖ వారి చెక్ పోస్ట్ ఉందని, వాహనాలు అక్కడే పార్క్ చేయాలని, అక్కడి నుండి అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్ళాలని తెలిసింది. సరిగ్గా పది గంటలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు (ఒక్కరికి 50/-, కెమెరాకి 25/-). టిక్కెట్ తీసుకొని ముందుకు (100 మీ.) వెళ్లి అక్కడ బండి పార్క్ చేసాం. అక్కడ చిన్న చెక్ పోస్ట్ కలదు. అక్కడ మన వెంట తెచ్చుకున్న బ్యాగ్ లను మరియు ఇతర వస్తువులను చెక్ చేసారు. ఏవైనా ప్లాస్టిక్ కు సంబందించిన వస్తువులు ఉంటే అవి వల్ల దగ్గర ఉంచుకొని తిరిగి మనం వెళ్ళేటపుడు వారి దగ్గరి నుండి తీసుకోవచ్చు. మా బ్యాగ్ చెక్ చేసిన తర్వాత వెళ్లి బస్సులో కూర్చున్నాము. ఐదు నిమిషాల్లో బస్సు బయల్దేరింది. మార్గ మధ్యంలో అక్కడక్కడ చిన్న గుడిసెల సమూహాలు కనిపించాయి. ఇవి ఇక్కడ నివసించే ఆది వాసీలవి. బస్సు ఒక పది నిమిషాల్లో ఒక దగ్గర ఆగింది. అక్కడి నుండి ముందుకు బస్సు వెళ్ళడానికి మార్గం లేదు. అక్కడ నుండి ఒక అర కిలో మీటర్ నడిస్తే కోవై కుట్రాలం వాటర్ ఫాల్స్ వస్తాయి. బస్సు దిగి వడివడిగా నడక ప్రారంభించాం. ఆరోజు మేము వచ్చిన బస్సే మొదటిది. అందుకని ముందుగా వెళ్తే జన సాంద్రత తక్కువగా ఉంటుందని, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని త్వరత్వరగా వెళ్ళాము. కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక కొండ మీద నుండి నీళ్ళు ప్రవాహంలాగా వస్తున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కిందుగా నీళ్ళ ప్రవాహం. బ్రిడ్జ్ దాటి కుడి చేతి వైపు కిందికి మెట్లు దిగగానే కోవై కుట్రాలం కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడకు స్నానం చేయడానికి వస్తారు ఎందుకంటే ఈ నీటిలో ఔషద గుణాలు ఉంటాయని, వాటితో స్నానం చేస్తే చాలా రోగాలు నయమవుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. పొక్కిషం అంటే తమిళంలో ఖజానా అని అర్ధం. కానీ కోయంబత్తూర్ పొక్కిషంలో ఉన్నది బంగారమూ, వజ్రవైడూర్యాలూ , రత్నాలూ కాదు. పురాతన వస్తు సంపద . కోయంబత్తూర్ నగర శివారులోని ఈ మ్యూజియాన్నే స్థానికులు పొక్కిషంగా పిలుస్తారు. కోవై (కోయంబత్తూర్) లోని ఈ మ్యూజియం దేశంలోనే విశాలమైన ప్రాచీనమైన వాటిలో ఒకటిగా ప్రసిద్ధి. కోయంబత్తూర్ అర్ ఎస్ పురంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (IFGTB) 155 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలో 110 సంవత్సరాల చరిత్ర ఉన్న మ్యూజియం ఉంది. అదే పొక్కిషం మ్యూజియం. 19వ శతాబ్ధం తొలి రోజుల్లో ఆంగ్లేయ అటవీ అధికారి జె ఎస్ గాంపల్ పురాతన వస్తువులని సేకరించి చెన్నై లోని తన కార్యాలయంలోని ఓ గదిలో పెట్టేవాడు. కొద్దిరోజులకు అది ఒక చిన్నపాటి మ్యూజియంగా మారింది. కానీ ఆయన తరవాత వచ్చిన అధికారులెవరూ ఆ వస్తువుల గురించి పట్టించుకోలేదు. దాంతో ఆ మ్యూజియం కొద్ది రోజులకే మరుగున పడిపోయింది.
గాంపల్ తరవాత చాలా రోజులకు వచ్చిన ఫారెస్ట్ కన్జర్వేటర్ హారెస్ ఆర్చిబాల్డ్ గాస్ (హెచ్. ఎ . గాస్) మ్యూజియం పునరుద్దరణకు ఆసక్తి చూపాడు. అయితే ఆ మ్యూజియం ఏర్పాటుకు చెన్నై కంటే కోవై (కోయంబత్తూర్) అనువైన ప్రాంతమని గుర్తించాడు గాస్. దీనికి కారణం కోవై పరిసరాల్లో ఉండే వైవిధ్యమైన ప్రకృతి. దాంతో మ్యూజియాన్ని చెన్నై నుండి కోవైకి మార్చాడు. అప్పటినుండి తనకు కనిపించిన పురాతన వస్తువులన్నీ తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టేవాడు. రాళ్ళు. శిల్పాలు, కొయ్య బొమ్మలు, మొక్కలు, జంతు కళేబరాలు, సర్పాల చర్మాలు ...... ఇలా ఆయన సేకరించినవి వేల సంఖ్యలోనే ఉన్నాయి. మొదట వాటిని ఆటవీశాక కార్యాలయంలోనే పెట్టి ఉంచేవాడు. కానీ వస్తు సంపద పెరుగుతుండడంతో 1920లో ప్రస్తతం ఉన్న భవనాన్ని నిర్మించారు. గాస్ తరవాత వచ్చిన అధికారులు కూడా దీని అభివృద్ధికి కృషి చేసినప్పటికీ గాస్ సేవలకు గుర్తింపుగా ఈ మ్యూజియానికి ఆయన పేరే పెట్టారు. ఈ మ్యూజియాన్ని ప్రధానంగా జంతు, వృక్ష శాస్త్ర విభాలుగా విభజించవచ్చు. సాధు జంతువుల నుండి క్రూర మృగాలు , పురుగులూ , పక్షులూ.. ఇలా అన్ని రకాల ప్రాణుల అస్థిపంజరాలు , కళేబరాలు దీనిలో మనకు దర్శనమిస్తాయి. మొత్తం 456 రకాల చెట్లు ఈ మ్యూజియం ప్రాంగణంలో పెరుగుతున్నాయి. ఇవన్నీ మనదేశానికి చెందిన వృక్ష జాతులే కావడం మరో విశేషం. వందల ఏళ్ల కిందట ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతుల్ని తెలుసుకోవడానికి ఈ మ్యూజియం సందర్శన ఉపయోగపడుతుంది. ఇది కోయంబత్తూర్ లో , అవినాశి రోడ్డులో కలదు. ఇందులో భారత దేశం లోని వివిధ ప్రాంతాల వారు ఉపయోగించిన చేతి మగ్గాల వస్తువులు కలవు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు నూలు ఎలా వడికేవారో, బట్టలు ఎలా తయారు చేసేవారో చిత్రాల రూపంలో మనం ఇక్కడ చూడవచ్చు. ఆర్ట్ గాలరీ లో చూడ చక్కని కళాఖండాలు కలవు. ఫోటోలు తీసుకోవడం నిషేధం.
సందర్శన వేళలు : ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు రెండవ శనివారాలు మరియు ఆదివారాలు సెలవు. చూడవలసినవి: G D నాయుడు మ్యూజియం, V.O.C పార్క్ మరియు జూ వసతి : కోయంబత్తూర్ లో చాలా హోటల్స్ కలవు. అందుబాటు : గాంధీపురం నుండి బస్సులు కలవు . మరిన్ని ఫోటోలకు మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి : http://letustravel.weebly.com/kasturi-sreenivasan-trust-art-gallery-and-textile-museum.html |
నా గురించినా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ .... మీ బద్రి Archives
November 2013
Categories
All
ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.
పండ్ల ప్రదర్శన - 2013
మొత్తం పేజీ వీక్షణలు
|